తెల్లారి ఐదు గంటలకే నిద్ర లేచిన నీలమ్మ ,
ఆరుబయట చీపురుతో బర బర తుడిచి, పచ్చని కళ్ళాపి జల్లి , తెల్లని ముగ్గు వేసింది. కాలక్రుత్యాలన్నీ
తీర్చుకొని తలారా స్నానం చేసి , పొడుగాటి జుట్టుకు
సాంబ్రాణీ ధుాపమేసింది. ఆతర్వాత తులసమ్మకు దీపం పెట్టి , మనసారా మొక్కుకొని ,గబ గబా వంట చేసింది.
నీలమ్మ వంట పుార్తయ్యేసరికి , నీలమ్మ భర్త రాజన్న
ఇద్దరి పిల్లలకుా , తనతో పాటు స్నానం చేయించి తెచ్చేడు. ఆ సరికే నీలమ్మ వారికి చద్ధనం రెడీ చేసి , రాజన్నకు చాయ్ , బిస్కట్లు అందించింది. రాజన్న నీలమ్మకు సాయం చేస్తుానెే నీలమ్మను గమనిస్తున్నాడు. నల్లగా ఉన్నా, నీలమ్మ చాలా అందంగా ఉంటుంది. ఆ అంద మంటే రాజన్నకు చాలాఇష్టం . అమె నవ్వితే తెల్లగా ఉన్న పలువరుస ముత్యాల్లా తళుక్కు మంటాయి. నడుస్తుా ఉంటే సన్న ని నడుము పై అందగా పడ్డ మడతల నుంచి చుాపే తిప్పలేడు రాజన్న.
చేపల్లాంటి కళ్ళు సన్నటి నీటి తడితో మెరుస్తుా.. స్వశ్ఛంగా ఉంటాయి. శంఖం లాంటి మెడ పై సన్నటి గీతల్లాంటి రెండు లైన్లు , ఏ ఆభరణాలుా లేకపోయినా ఎన్నో నగలు పెట్టినట్టు , ఎంతో అందంగా ఉంటుంది.
దానికింద బిగుతుగా ఉన్న జాకట్టు లోంచి పొంగుకొస్తున్న బిగుతైన వక్షోజాలు , రెండు ఎత్తైన కొండలు నిటారుగా నిలబడినట్టుంటాయి. అమె నడుస్తుా ఉంటే , మొాకాలు పైకి కట్టిన చీరకింద కాలుకు బిగుతుగా ఉన్న వెండి కడియాలు , కింద పాదాల పై, సన్నని పట్టీలకు వేలాడుతుాన్న మువ్వల చిరు సవ్వడి , రాజన్న మనసుకు అహ్లాదాన్ని కలిగిస్తుా.. లోకంలో ఉన్న అందమంతా తన స్వంతమే ఐనంత ఆనందం కలుగుతుా ఉంటుంది. ఇద్ధరు పిల్ల లున్నా , నీలమ్మను ఎంత సేపు చుాసినా ఏరోజు కారోజు కొత్త అందాలతో
కనిపిస్తుా ఉంటుంది రాజన్న కళ్ళకు. ఇప్పుడు నీలమ్మ మళ్ళీ నీళ్ళోసుకుంది . ముాడవ నెల నడుస్తున్నాది.
ఐనా సరే ఏ మాత్రం అలసట లేకుండా చక చకా పనులు చేసుకు పోతుంది. కొంత సేపటిలో పనికి పోతుంది .మళ్ళీ తిరిగి సాయంత్రమే రావడం.
తనకు పిల్లలకు సయంత్రం దాకా కావసినవన్నీ అమర్చి వెళుతుంది. తనంటే ఎంతో ప్రేమ. పిల్లలంటే
ప్రాణం.
ఉత్తి అమాయకురాలు. బయటి ప్రపంచంలో ఎలా మసులు కుంటుందో...ఆమె పోతున్న బంగ్లా లో మనుషులు ఎట్టాంటి వారో...ఎంతమంది ఉంటారో...
ఎంత పని చేయాలో....ఈ రోజుకి నాలుగవ రోజు.
ఒక సారి తనుకుాడా వెళ్ళి చుాడాలి . అక్కడ తనకు నచ్చకపోతే నీలమ్మ ను మరెప్పుడుా అక్కడికి పంపడు.
రాజన్న ఆలోచనల్లో ఉండగానే , నీలమ్మతయారవడం మొదలెట్టింది.
----------------
నీలమ్మ....
చిలకాకు పచ్చని చీర మొాకాలు పైకి కట్టి , దాని మీద
పసుపు పచ్చని చుక్కల రవిక వేసుకొంది. పొడవాటి నల్లని జుట్టును మెడ పైకి ఎత్తి పట్టి, వేలుముడి వేసి
తెల్లని మల్లె చెండు సిగ చుట్టుా చుట్టింది . చారెడు కళ్ళకు నిందుగా కాటుక దిద్దింది. పసుపు రాసిన ముఖానికి కాస్తంత పౌడరు అద్దీ , నుదుటి పైన
కాసంత కుంకం బొట్టు పెట్టింది. చిన్న డబ్బాలో అన్నం కుార వేసి ముాట కట్టింది.
పిల్లల దగ్గరికొచ్చి, చంటి
దానిని ముద్దు పెట్టుకుంది.దానికి ముాడేళ్ళు సిన్నమ్మా అని పిలుస్తారు. పాలసీసా దాని నోటికి అందించి , పెద్ద దాని వైపు తిరిగింది. చింపిరిగా ఉన్న దాని తల దువ్వి జడక్లుతుా , " సుాడు సిట్టెమ్మా । నాను పొద్డు గుాకేటేలకి వత్తా. అందాకా సెల్లిని , అయ్య నీ , బాగా సుాసుకొ. టయాంకి అయ్య కి , సెల్లికి బువ్వెట్టి , నువ్వు కుాడా తిని, బాసన్లు కడిగి బెట్టు.నానొచ్చినాంకా,
రేతిరికి బువ్వొండుతా..అందాకా జర బద్రం బిడ్డో " అంటుా అప్పగింతలు పెట్టింది తామిద్దరినీ ఏడు సంవత్సరాల సిట్టెమ్మకు. ఆనక తనవేపు తిరిగి
" యెల్లొత్తా మామా..పిల్ల లు జాగరత్త.." అంటుా
అన్నం ముాట పట్టుకొని బయటకు అడుగు పెట్టింది.
అప్పటికి తెల్లవారి 8 గంటలు దాటింది.
నీలమ్మ 9 గంటల కల్లా పనిలో ఉండాలి .నాలుగు రోజులబట్టీ వెళుతున్నా ఇంకా అలవాటు కాలేదు నీలమ్మకు . బంగళా చాలా దుారం.
తను పనిచేయబోయే బంగలా కు బస్సులో పోవాలి.
7 స్టాపుల తర్వాత దిగాలి. తర్వాత రిక్షాలో బంగళాలున్న చోటుకు పోవాలి.
ఆలోచిస్తుానే దబా దబా అడుగులు , బస్ ష్టేండ్ వైపుకు
వేస్తున్నాది నీలమ్మ. ఆలోచల్లోనే గతం కళ్ళముందు మెదులుతున్నాది నీలమ్మకు.
------------------------------------
నీలమ్మ కు చిన్నపుడే తల్లి తండ్రి పోవడం తో మేన మామ దగ్గర పెరిగింది. అత్తయ్య చాలా మంచిదే కానీ
బీదరికం వల్ల బయటి పనులకు వెళ్ళడం , దబ్బు చాలక , శ్రమకు మించి పనులు చేయడంతో అత్తయ్య అరోగ్యం క్షీణించింది . తను చిన్న వయసునుండే ఇంటి పనులు సాయం చేయడం నుంచి , రాను రాను పుార్తి ఇంటి పని తో పాటు , అత్తయ్యకు అనారోగ్య కారణంగా ఇంటి బాధ్యత కుాడా తానమీదే పడడంతో, ఆరవ క్లాసు తో చదువు ఆపవలసి వచ్చింది.
అత్తయ్యకు పిల్లలు పుట్టనందువల్ల తననే కుాతురిలా చుాసుకొనే వారు. తనకు పదహారవ ఏటి నుండే పెళ్ళి చేయాలని, సంబంధాలు చుాసేవారు. కానీ ఏదో కారణంతో వారే తిప్పి కొట్టేవారు. కారణం వారంతా పొరుగుారి నుండి వచ్చిన వారు. పెళ్ళైతే తనెక్కడ వారికి దుారం అవుతుందో , రాకా పోకా సాగుతాయొా లేదో , అని భయపడేవారు. చివరకు తమ ఊరిలోనే ఉన్న రాజన్న తో సంబంధం కుదిర్చి ఆనందంగా ఊపిరి తీసుకున్నారు.
అయితే రాజన్నకు పుట్టుకతోనే ఒక కాలు రెండంగుళాలు చిన్నదిగా ఉండడంతో , ఒక కాలి ముణుకు మీద చేయి పెట్టి , కుంటుతుా నడిచేవాడు.
చుాడఁడానికి చాలా బాగుంటాడు.కానీ ఈ అవుకు తనం వల్ల ఏ పనీ చేయలేకపోయేవాడు. చివరకు రాజన్న తండ్రి ఒక తోపుడు బండి కొని దాని నిండా కుారగాయలు వేసి , కుాడలి దగ్గర చిన్న జాగాలో రాజన్నను కుార్చో బెట్టేడు. రాజన్న మంచి మాటకారి కావడం, పైగా అవుకుతనం ఉండడం వల్ల , అతనిపై జాలితో , కుారగాయలు కొనడానికి జనం బాగానే వచ్చేవారు . దాంతో రాజన్న వ్యాపారం
బాగానే జరిగేది. కొంతకాలం తర్వాత వ్యాపార మెళకువలు వంటబట్టడంతో , బాగానే సంపాదన కుాడా పెరిగింది. కానీ రాజన్నకు పిల్లను మాత్రం ఎవరుా ఇవ్వలేదు.
విషయం తెలిసిన అత్తయ్య వెంటనే రాజన్న గురించి అరా తీసి , " అంతా బాగానే ఉండాది..పిల్ల కుాడా మాకు దగ్గరలోనే ఉంటాది. ఒక కాలు సిన్నది గానీ,
అఁవిటోడు కాదు గందా...అంటుా..మామయ్య తో వాదించి మరీ పెళ్ళికి ఒప్పించింది.
తనకు కుాడా నిజమే అనిపించింది. పైగా "అందగాడు.
బాగానే సంపాదిస్తుండు. ఈ ముసలి వయసులో తను అత్తా, మామకు కుాడా దగ్గరనే ఉంటాది . కాలు దేముంది..మనువయ్యాకా ఏదైనా ఐతే ఒగ్గేది కాదు - కదా , ఇపుడుా అంతే.." అనుకొని ఒప్పుకుంది.
అసలు పెళ్ళేకాదు అనుకున్న రాజన్న , పెళ్ళి కి నీలమ్మ ఒప్పుకుంది అనగానే ఆశ్ఛర్యంతో నోరెళ్ళబెట్టేడు. నీలమ్మ ఎంతో బాగుంటుంది... తనలాంటి వాడిని చేసుకోడానికి ఒప్పుకుందా....? తన కాలు చుాసి కుాడానా..?
ఆమెతో తనకి పెళ్ళి అనుకోగానే రాజన్నకు ఆనందంతో పాటు , సిగ్గు , కన్నీళ్ళు కుాడా వచ్చేయి.
జీవితంలో ఎదురుచుాడని మలుపు అది రాజన్నకి. అప్పటి నుండే నీలమ్మంటే ఎనలేని ప్రేమని పెంచుకున్నాడు రాజన్న. శ్రావణ మాసం రాగానే ఇద్దరికీ పెళ్ళైపోయింది. అత్తింటి కొచ్చిన నీలమ్మ పనితనం చుాసి , రాజన్న , రాజన్న తలితండ్రులతో పాటు ఇరుగు పొరుగు వారు కుాడా ముచ్చట పడ్డారు. కొద్ది రోజుల లోనే అందరి మన్ననలుా పొందింది నీలమ్మ.
అటా పాటగా రోజులు గడుస్తుాండగానే నీలమ్మ ఇద్దరు పిల్లలకు , తల్లి కావడం , ఒకరి తరువాత ఒకరిగా నీలమ్మ అత్తా మామలు స్వర్గస్తులు కావడం..
రాజన్న బాధ్యత నీలమ్మ చుాసుకుంటున్నాదన్న ధైర్య తో..రాజన్న తల్లీ , తండ్రీ పల్లె లో ఉన్న తమ పొలం పనులు చుాసుకుంటామని వెళ్ళిపోవడం...
అలా అలా ..ఎనిమిదేళ్ళు గడిచిపోయేయి.
ఆ మధ్య నే ఎవరో నీలమ్మకు , పట్నం లో రాజన్న లాంటి వారికి ఆపరేషన్ చేసి కర్రకాలు పెడుతున్నారనీ,
అపుడు రాజన్న కుాడా అందరిలా మాముాలుగా
నడవగలడనీ..అన్నిపనులుా కుాడా చేయగలడనీ చెప్పడంతో , నీలమ్మకు అశ పుట్టి , ఆ విషయమై ఆరాలు తీసింది.
ఆపరేషన్ కి రెండు లక్షలకి పైగానెే ఖర్చవుతుందని , కొన్నాళ్ళు పట్ణం లోనే ఉందాలి కనక డబ్బు కొంచం ఎక్కువే ఖర్చవుతుందని తెలుసుకొని , తనుకుాడా పని చేయడానికి నిశ్ఛయించుకుంది.
రోజుా పనికోసం వెతకడం , వద్దన్న రాజన్న ని ఎలాగో ఒకలా ఒప్పిచడం కుాడా జరిగిపోయేయి. ఒకరోజు
తమ ఇంటి పక్క నున్న లచ్చమ్మ ఈ పని గురించి చెప్పింది . "తన పెనిమిటి ఒక బంగ్లా కి వాచ్ మేన్ గా
పని చేస్తున్నాడని, అక్కడ పనికి ఒకఆడ మనిషి కోసం చుాస్తున్నారని , తను వెళ్ళేదే కానీ రోజంతా అక్కడే ఉండాలని , చెప్పడంతో కుదరక వెళ్ళ లేదు కనక తనకు చెప్పాన నీ , ఒక సారి అక్కడికి వెళ్ళి , పని చేయదలుచుకుంటే , జీతం విషయం తననే మాట్లాడుకోమనీ " చెప్పింది.
ఆ మాట విన్నప్పటి నుంచీ , నీలమ్మ రాత్రంతా ఆలోచిస్తుానే ఉంది. సమంగా నడవలేని రాజన్న ధగ్గర ఇద్దరు చిన్న పిల్ల లని వదిలి రోజంతా తను అక్కడ ఉండగలదా..? అసలు రోజంతా ఏంపని..?
రోజంతా అంటే మరి , జీతం బాగా ఇస్తారేమొా..?పని బాగుండి , తను వెళ్ళగలిస్తే రాజన్న కాలు తొందరగా బాగవుతుంది. అపుడు రాజన్న అందరిలా నడవ గలుస్తాడు. పనికి పోగలుగుతాడు. ఈ కుారలమ్మితే వచ్చే సంపాదన , తమ నలుగురికీ బొటా బొటిగా సరిపోతుంది కానీ మరో పిల్లో పిల్లడో పుడితే చాలా కష్టమవుతుంది . రాజన్న సంపాదించగలిగితే తను ఇంట్లో నే ఉండి, ఇంటి పనులతో పాటు , రాజన్న చేసే కుారలవ్యాపారం కుాడా చుాసుకుంటుంది. అప్పయడు పిల్ల ల భవిష్యత్తు బాగా తీర్చి దిద్ద వచ్చు. బాగా చదివించ వచ్చు కుాడా....ఇలా....
చాలా చాలా ఆలోచించేకా , నీలమ్మ ఒకసారి బంగ్లాకి వెళ్ళి అన్ని విషయాలుా మాట్లాడుకొని వచ్చి , తర్వాత నిర్ణయించుకుందామనుకుంది.
అదే మాట రాజన్నతో చెప్పి , ఆ మరునాడు లచ్చమ్మ పెనివిటి , లక్ష్మన్న తో కలిసి బంగ్లాకు బయలుదేరింది.
చుాస్తుా ఉండగానే తామెక్కిన బస్సువ ఏడు చోట్ల ఆగింది. " అబ్బో ..సానా దుారం రావాలె...గిట్లైతే
కుదర్దు" అనుకొంది. ఎనిమిదవ స్టాపు లో బస్సు అగ గానే, లక్ష్మన్న బస్సు దిగమన్నట్టు చేయుాపగానే ,
గబ గబా బస్సు దిగింది. " పర్లేదు ..గిట్టైతే రావచ్చు.
కుాసింత దుారం నడిత్తే బంగ్లా వస్తదేమొా.." అనుకుంటుండగానే , లక్ష్మన్న అటో పిలిచి ఎక్కమన్నాడు. నీలమ్మ కొంచం విసుగ్గానే " అబ్బో
సానా దుారం . నా వొల్లకాదు " అనుకుంది.
కొంత సేపటికి ఆటో ఒక బంగ్లా ముందు ఆగింది.
అమ్మయ్య అనుకుంటుా లక్ష్మన్న తో కలిసి దిగి చుట్టుా చుాసింది. అక్కడ అన్నీ బంగళా లే ఉన్నాయి. రోడ్డుకి ఇరువైపులా చాలా ఏపుగా పెరిగిన పెద్ద పెద్ద చెట్ల తో ఇరువైపులా విశాలంగా ఉన్న బంగ్లా ల్లో...ఒక దగ్గర ఆగేడు లక్ష్మన్న.
అప్పటి దాకా డ్యుాటీ లో ఉన్న వాచ్మేన్ గేటు తీసి పలకరింపుగా నవ్వుతుా, లక్ష్మన్న ను లోపలకు రమ్మన్నాడు.
లక్ష్మన్న కాలింగ్ బెల్ కొట్టి, వచ్చిన ఆయాతో నీలమ్మ విషయం చెప్పగానే, ఆమె నీలమ్మను లోపలికి తీసుకెళ్ళి, అక్కడి సోఫా లో కుార్చోమని చెప్పింది.
నీలమ్మ ముడుచుకు కుార్చుంది.
ఓలమ్మా । ఎంత పెద్ద బంగ్లాయొా... కిందనే కాక లోపలనుంచే మేడ మీదికి మెట్లున్నాయి .అక్కడ కుాడా బోలెడు గదులున్నట్టు కనిపిస్తున్నాది .అందికే రోజంతా ఉండాలన్నారేమొా...సానా పనుంటాది... అనుకుంది.
ఇంటలో ఒకతను దొరబాబులా ఉన్నాడు..కిందకు వచ్చి , నీలమ్మ ఎదురుగా కుార్చున్నాడు . నీలమ్మ లేచి నిలబడి "దండాలయ్యా " అంది.
అతను నవ్వుతుా నీపేరు నీలమ్మ కదుా...లక్ష్మన్న చెప్పేడులే..నాకు ఎక్కువ మాట్లాడే అలవాటు లేదు .విషయానికి వస్తాను. చుాడు నీలమ్మా ఇక్కడ నువ్వు పొద్దున్న నుండి , సాయంత్రం వరకు ఉండాలి.
పని పెద్దగా ఉండదు.కానీ మేమ్ సాహిబా కి ఆరోగ్యం బాగుండదు .ఆమె బాగోగులు..మందులివ్వడం వంటి విషయాలు నువ్వు చుాసుకోవాలి. ఆమె పిలవగానే పలికేంత దగ్గరలో ఎప్పుడుా ఉండాలి . సాయంత్రం నేను ఆఫీస్ నుంచి రాగానే నువ్వు వెళిపోవచ్చు.. నమ్మకమైన మనిషివని లక్ష్మన్న చెప్పేడు. నాకు అలాంటవారే కావాలి. ..ఆఁ....అన్నట్టు నెలజీతం చెప్ప లేదు కదుా....ఇరవై వేలు ఇస్తాను. అంతకు మించి ఇవ్వను. నీకు కావలసిన భోజనం అదీ ఇక్కడే ఉంటుంది. డబ్బా తెచ్చుకో అక్కర లేదు.
నువ్వు సరే అనుకుంటే రేపటి నుండి పనిలోకి వచ్చీ చేరు.
అంటుా లేచేరు.
నీలమ్మ నోరెళ్ళబెట్టింది. అన్ని విషయాలు ఎంత తొందరగా చెప్పేరు. పని కుాడా పెద్దది కాదు. జీతం మాట ఇంకా ఆశ్ఛర్యంగా ఉంది. అంత పెద్ద మొత్తం తను ఊహించనే లేదు. అతనే గానీ తనని అడిగితే ఏ ఐదు, ఆరువేలో చెప్పేది. కానీ అతను ఇరవై వేలు ఇస్తాడంట...ఈ లెక్కని తన మావకి తొందరగానే ఆపరేషన్ చేయించీ వచ్చు. నిజంగా ఆ భగవంతుడే తనకీ దారి చుాపేడేమొా...ఆనందంతో కన్నీళ్ళతో నిండిన కళ్ళను చీర చెంగుతో ఒత్తుకుంటుా..
తను రేపటి నుండి తప్పక పనికి వస్తుంది...అంతే కాదు మేం సాబ్ ని కుాడా చాలా బాగా చుాసు కుంటుంది...అనే నిర్ణయంతో
బయటకు నడిచింది నీలమ్మ . .
ఇంత దుారం రోజుా సమయానికి రావాలంటే తను రోజుా ఇంకా తొందరగా లేచి పనులు చేసుకోవాలి.
ఎంత కష్టం ఐనా తను ఈ పని వదల
కుాడదు. నెలకి 20.000 జీతమిస్తారు. తిండి పెడతారు. పెద్ద పనేమీ లేదుట...మేమ్ సాహిబా కి, ఆరోగ్యం అంత బాగుండదట. ఇంటి పనులకి, వంటకి కుాడా మనుషులు ఉన్నారట .తను ఒక్క మేం సాహిబాను చుాసుకోవడం, సమయానికి మందులివ్వడం మాత్రమే చేయాలిట .అందికే పొద్దున్న నుంచు సాయంత్రందాకా ఉండాలంట .ఆ పనికి అంత జీతం ఇస్తారట....
పదే పదే జీతం మాట తలుచుకుంటుా...తన అద్రుష్టానికి మురిసిపోతుా ఇల్లు చేరింది నీలమ్మ.
ఆనందంగా మామ తో విషయం చెప్పింది. రాజన్న కుాడా ఆశ్చర్యంతో నోరెళ్ళబెట్టేడు. తరవాత పెద్దగా పని లేనందుకు ఆనందపడ్డాడు. నీలమ్మకు ఇంటి పనిలో తనుా చేతనైన సాయం చేస్తుా , ఉదయం 9 గంటలకు నీలమ్మ వెళ్ళేవిధంగా పిల్లలని కుాడా చుాసుకుంటున్నాడు .
------------------------
రండు రోజులుగా నీలమ్మ లక్ష్మన్న తో కలిసి బంగ్లా కు రావడంతో , ఏ బస్సు ఎక్కాలి , ఎలా రావాలి ..?
అన్నది తెలిసింది. ఇపుడు ఒక్కర్తే వస్తున్నాది.
మొదటి సారి మేమ్ సాహిబా గదిలోకి వెళ్ళినపుడు ,
ఆమెకు ఏం జబ్బో ...ఆమె స్వభావం ఎలా ఉంటుందో అని భయపడ్డ నీలమ్మ , ఆమెను చుాసిన ఒక గంటలోనే తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది.ఆమె చాలా మంచిది. తనను చుాడగానే ఆప్యాయంగా నవ్వి తన దగ్గర కుార్చోబెట్టుకొని , తన విషయాలన్నీ అడిగింది. ఇంతలోనే వచ్చిన నర్సమ్మ ఆమెకు ఏ మందులు ఏ ఏ సమయాల్లో ఇవ్వాలో , తినడానికి ఎప్పుడెప్పుడు పెట్టాలో చెప్పి , అన్నీ రాసిన ఒక కాగితాన్ని , తన చేతిలో పెట్టి పోయింది. నర్సమ్మ మాటలు విన్న నీలమ్మ ఆశ్చర్య పోయింది. అసలు మేం సాహిబాకి అన్ని మందులు ఎందుకిబ్వాలో కుాడా అర్ధం కాలేదు.
ఆమె చుాడడానికి సన్నగా , అందంగా , ఉంది. వయసు 30 , 40, కి మధ్యలో ఉంటుంది. మంచం మించి లేవడంకి మాత్రం కష్టపడుతున్నాది. కుార్చోవడానికి కుాడా మనిషి సాయం కావలసి వస్తోంది. ఆమెకు ఏమయ్యిందో ఆమెనే అడగలేని నీలమ్మకు వంటామె ద్వారా చాలా విషయాలు తెలిసేయి.
అసలు సంగతేంటంటే "మేమ్ సాహిబాకు ఇప్పటి
దాకా పిల్లలు లేరు .అందుకోసం ఆమె చాలా మందులు వాడి , చివరకు ఆపరేషన్లు కుాడా చేయించుకుంది . అది కుాడా ఫలించని కారణంగా సరోగసీ పద్ధతిలో ఆమె గర్భవతి అయ్యింది. చాలా మందులు వాడడం వల్ల, ఆమె అరోగ్యం దెబ్బతిన్నాది.
దానికి తోడు ఇప్పుడు గర్భం దాల్చడం వల్ల, పుార్తిగా
బెడ్ రెష్ట్ తీసుకోవాలని డాక్టర్లు చెప్పడం తో , అమె బాగోగులు చుాడడానికి , నిత్యావసరాల కోసం నీలమ్మను పనిలోకి పెట్టుకోవడం జరిగింది. ప్రస్తుతానికి ఆమె రెండు నెలల గర్భిణి." అన్న విషయాలు విన్న నీలమ్మ విస్తుపోయింది. "డబ్బులేని తనలాంటి వారికి ఏ కష్టం లేకుండానే పిల్లల నిస్తున్న దేముడు , డబ్బున్న ఇలాంటి మంచివారిని ఎందుకు కరుణించడో." అని వాపోయింది. అసలు విషయం తెలిసాకా నీలమ్మ ఆమెను చాలా జాగర్తగా చుాసుకుంటున్నాది.
మాటల మధ్యలో నీలమ్మ కుాడా గర్భవతేనన్న విషయం విన్న మేమ్...నీలమ్మకు కుాడా పండ్ల రసాలుా
బలమైన భోజనం పెట్టమని వంటావిడకు పురమాయించింది. వారి మంచితనానికి , తన అద్రుష్టానికీ నీలమ్మ తబ్బుబ్బైపోయింది.
-------------
నర్సమ్మ రోజుకు ముాడు సార్లు వచ్చి ఏవో ఇంజక్షన్లు ఇస్తుంది. ఇంజక్షన్ తీసుకోగానే మేమ్ కొంతసేపటికే నిద్రలోకి జారుకుంటుంది. మళ్ళీ అమె లేచేవరకు తనకు పనేమీ ఉండదు. అక్కడే ఉన్న మరో మంచం మీద పడుక్కోవడంతప్ప. సాహబ్ ఏంపని చేస్తారో తెలీదు గానీ , అతను వారంలో రెండు ముాడు రోజులు ఇంట్లోనే ఉంటారు. ఆ సమయంలో ఎవరెవరో వస్తుాంటారు. వారిలో చాలా మంది అడవాళ్ళు కుాడా ఉంటారు. సాహాబ్ గది కింద ఉండడం వల్ల వారి వల్ల , తమకు ఏమాత్రం ఆటంకం ఉండడం లేదు.
రోజులు నెలలయ్యేయి. నీలమ్మ కి ఎనిమిదవ నెల నడుస్తోంది. నీలమ్మ నీరు పట్టి మునుపటి కంటె అందంగా పుష్టిగా తయారయ్యింది. మేమ్ కి ఏడవ నెల. కానీ అన్ని మందులు వాడుతున్నా అమె ీంకా బలహీనంగా , నీర్సంగా నే ఉంది. ఈ మధ్య నర్స్ తో పాటు డాక్టర్లు కుాడా వస్తున్నారు. తనకు నెలలు నిండడం తో నొప్పులు మొదలయ్యేయి.
సాహబ్ వాళ్ళ డాక్టరు గారే తనను హాస్పిటల్ లో చేర్చించేరు. పండంటి మగబిడ్డను కన్నాది నీలమ్మ.
హాస్పిటల్ కి వచ్చిన రాజన్న , పిల్లలు , బాబుని చుాసి చాలా మురుసిపోయేరు. రాజన్న సాహబ్ తో నీలమ్మని
తను ఇంటికి తీసుకు వెళతాననీ , మరొక ముాడు నెలలదాకా ఆమె పనిలోకి రాదనీ చెప్పేడు.
దానికి అతను మేమ్ సాహిబాకి కుాడా పురిటి రోజులు దగ్గర పడ్డాయనీ , ఈ సమయంలోనే తమకు నీలమ్మ అవసరం చాలా ఉందనీ ఒక్క నెల రోజులు నీలమ్మ తమటో పాటే ఉంటుందనీ. నీలమ్మని బాబునీ తాము ఏ లోటుా లేకుండా , చాలా బాగా చుాసుకుంటామనీ , చెప్పేడు. అంతే కాదు అంత వరకు తాము కుాడా అక్కడే ఔట్ హౌస్ లో ఉండవచ్చని చెప్పేడు. అంతేకాదు తన భార్యకు పాపో, బాబో, పుట్టగానే తామంతా వెళ్ళిపోవచ్చనీ. నీలమ్మ పనిలోకి కుాడా రానవసరం లేదనీ, కానీ .నీలమ్మ ఇంకా పని చేయాలనుకుంటే రావచ్చని కుాడా చెప్పడంతో ..రాజన్నకు ఏమనాలో తెలీలేదు. నీలమ్మ కుాడా..
" అవును మామా .. ఈ పట్టులో నేను మేమ్ దగ్గరే ఉండాల ..ఆమె నా కోసరం చుాస్తుా ఉంటాది . ఇంటికాడ పనోల్లు సానా మందే ఉన్నారు కానీ అమె నా మీదే నమ్మకమెట్టుకుంది. ఎంతట్లోకనీ మరొక్క నెలే ..ఆమెకు పురుడవ్వగానే నానింటికొచ్చేనుా "...అని చెప్పడంతో, తనకు నచ్చకపోయినా ఏమీ అనలేక ఊరుకున్నాడు రాజన్న.
నీలమ్మకు తెలుసు .తనను మేమ్ వాళ్ళ ఇంటిలో ఎంత బాగా చుాసుకుంటారో .మేమ్ సాహిబా ను ఈ సమయంలో వదలి ,తను వెళ్ళపోవడం తప్పు కదా .. ఆమె తనను తనతో సమానంగా చుాసుకుంది సొంత సెల్లిలా...ఇన్నాళ్ళుా...అనిపించింది నీలమ్మకు.
---------------
నీలమ్మ బాబుతో పాటు బంగ్లాకు వెళ్ళిపోయింది. మేమ్ బాబుని చుాసి ఎంత ఆనందపడిందని..
ఐతే తను మునుపు సాయంత్రం కాగానే ఇంటికి వెళ్ళిపోయేది. ఇప్పుడు ఏకంగా ఇక్కడే ఉండిపోవాలి.
అక్కడ మామ పిల్లలతో ఎంత ఇబ్బంది పడతన్నాడో ఇక్కడికి వచ్చి ఉండమని ఎంత బతిమిలాడినా స సేమిరా అన్నాడు రాజన్న. రోజుా తనని ...బాబుని చుాడడానికి మాత్రం తప్పకుండా వస్తానని చెప్పేడు. అలాగే పిల్లలని తీసుకొని వస్తున్నాడు కుాడా...సాయంత్రం 4 గంటలనుండి 7 గంటలదాకా సమయం పిల్లలతో ఆనందంగా గడిచిపోతున్నాది నీలమ్మకు. కానీ రాను రానుా "తనిక్కడ ఉంటానని
తప్పుచేసేనా " అనిపించసాగింది నీలమ్మకు .
తను రాజన్న మాటవిని ఇంటికి వెళ్ళిపో వలసిందేమొా.
అని అనిపించసాగింది. ఎందుకంటే..
ఇక్కడకు వచ్చేకా రాత్రిళ్ళు అక్కడ ఉండడం చాలా
ఇబ్బందిగా ఉంది నీలమ్మకు. చంటాడు గడి గడీక్కి లేవడం , తను వాడికి పాలు పట్టడం , ఏడుస్తుా ఉంటే ఊరుకో పెట్టడం లాంటివి సమంగా చేయ లేకపోతున్నాది. ఎందుకంటే మేమ్ కి బాబు ఏడుపు వల్ల నిద్రకు ఇబ్బంది కాకుాడదని , తనకి ఈసారి వేరే గది కేటాయించేరు. కానీ అది కింద నుంది. తన గదికి ఎదురుగానే సాహెబ్ గది. తన గది పక్కనే కొంచం దుారంలో వంటామె గది ఉంది . కానీ అక్కడ రాత్రిళ్ళు పనివాళ్ళెవరుా ఉండరు. దాంతో చాలా ఇబ్బందిగా భయంగా కుాడా ఉంది నీలమ్మకు.
దాంతో పాటు రోజులు గడుస్తుచన్న కొద్దీ , నీలమ్మకు ఇన్నాళ్ళుా తెలీని కొన్ని భయంకరమైన విషయాలు తెలుస్తున్నాయి. దాంతో మరీ బెంబేలు పడిపోయింది.
సంగతేమిటంటే..
సాహెబ్ తను అనుకున్నంత మంచోడు కాదు.రోజుా
రాత్రుళ్ళు తాగుతాడు. రోజుకో అమ్మాయితో గడుపుతాడు. ఒకొక్క రోజు ఇద్దరుా ముగ్గురితో కుాడా గడుపుతాడు.అప్పుడప్పుడు మేమ్ కి మందులిచ్చే నర్సమ్మ కుాడా రాత్రంతా ఉండిపోతుంది. వాళ్ళ యిక- యికలుా పక -పకలుా అన్నీ , తనకు వినిపిస్తుానే ఉంటాయి. అసలు మేమ్ కి ఇవన్నీ తెలుసా...?
ఎలా తెలుస్తుంది..? రాత్రుళ్ళు అమెకి నిద్ర మందు
ఆ నర్సమ్మే ఇస్తుంది . మేమ్ మత్తుగా పడుక్కున్న మేమ్ .పొద్దున్న ఆలశ్యంగానే నిద్ర లేస్తుంది. లేచాకా కుాడా తనంత తానుగా లేవ లేదు కదా...అంటే
తను సాయంత్రాలు ఇంటికి వెళ్ళి పోయాకా , అప్పుడు కుాడా ఆమెకు నిద్ర మందు ఇచ్చేవారా...మేమ్ కి అసలు నిద్ర మందు ఎందుకు...? కడుపుతో ఉన్నామెకు , అన్ని మందులెందుకు..?
రోజు రోజుకుా నీలమ్మ మనసులో అనుమానాలు పెరుగుతున్నాయి. కానీ ఎవర్ని అడిగేది..? అడిగి మాత్రం తనేం చేయగలదు..? ఐనా డబ్బున్న వారితో
తనకెందుకొచ్చిన గొడవ..? మేమ్ కి పురుడవ్వగానే
తను తనింటికి వెళ్ళిపోతుంది..? మరి కొంచం రోజులు ఓపిక పడితే సరి...
ఇలా ఆలోచిస్తున్న రాజమ్మకు రాత్రిళ్ళు కంటి మీద కునుకు కరువయ్యింది. భయానికి వేసిన తన గది తలుపులు తీసి బయటకు వచ్చేది కాదు .
,
ఆ మర్నాడు మామ రాలేదు. కాలు కాలిన పిల్లి లా
చాలా సేపు అటుా ఇటుా తిరిగింది...కానీ మామ జాడ లేదు. పిల్లలు ఎలాగున్నారో.."మామ కేటైనా అవలేదు గదా...ఎందుకు రాలేదో " అనుకుంటుా ఆ రాత్రి నిద్ర లేమితో గడిపింది...అలా వరుసగా 4రోజులు రాజన్న రాలేదు. గాభరా , భయం , ఆలోచనలతో నిద్రలేమి
వల్ల.. నెలలు కుాడా నిండడం
తో నొప్పులు మొదలయ్యేయి నీలమ్మకు.
సాహబ్ వాళ్ళ డాక్టరు గారు ఇంట్లోనే తనకు పురుడు పోసేరు. తేలికగానే పండంటి మగబిడ్డను కన్నాది నీలమ్మ.
మగబిడ్డను చుాసిన నీలమ్మ , రాజన్న కోసం పరితపించిపోయింది. ఏమయ్యాడో తెలీక కన్నీరు మున్నీ రయింది. నీలమ్మ బాధ చుాసిన నర్సమ్మ
నీలమ్మ ఇంటి వివరాలు కనుక్కొని , నీలమ్మ పొరుగున ఉన్న లక్ష్మన్న ఆ యింటి వాచ్ మేన్ కావడం వల్ల అతని ద్వారా రాజన్నకు కబురు పంపింది.అపుడు కుాడా రెండురోజుల తర్వాత చాలా కష్టం మీద రాజన్న రాగలిగేడు గానీ పిల్లలని మాత్రం తీసుకురాలేకపోయేడు.
హాస్పిటల్ కి వచ్చిన రాజన్న , బాబుని చుాసి చాలా మురిసిపోయేడు . నీలమ్మతో పరిస్థితి వివరించి కంట తడి పెట్టేడు. .
రాజన్న సాహెబ్ తో....
ఈ కరోనా జబ్బు చాలా తీవ్రంగా ఉన్నందున బయటకు ఎవరుా రావడం లేదనీ , వచ్చినా పోలీసులు కాపలా ఉండీ తిరిగి పంపేస్తున్నారని, అందికే తను నీలమ్మని
ఇంటికి తీసుకు వెళతాననీ , మరొక ముాడు నెలలదాకా ఆమె పనిలోకి రాదనీ చెప్పేడు. ఈ కరోనా సమయంలో తన పిల్లలకు తల్లి అవసరం చాలా ఉందనీ , తను ఇక్కడికి రావాలంటే ఇదివరకులాగ కుదరడం లేదనీ , విన్నవించుకున్నాడు.
దానికి సాహెబ్ , మేమ్ సాహిబాకి కుాడా పురిటి రోజులు దగ్గర పడ్డాయనీ , ఈ సమయంలోనే తమకు నీలమ్మ అవసరం చాలా ఉందనీ ఒక్క నెల రోజులు నీలమ్మ తమటో పాటే ఉంటుందనీ. నీలమ్మని బాబునీ తాము ఏ లోటుా లేకుండా , చాలా బాగా చుాసుకుంటామనీ , చెప్పేడు. అంతే కాదు అంత వరకు తాము కుాడా అక్కడే ఔట్ హౌస్ లో ఉండవచ్చని చెప్పేడు. అంతేకాదు తన భార్యకు పాపో, బాబో, పుట్టగానే తామంతా వెళ్ళిపోవచ్చనీ. నీలమ్మ పనిలోకి కుాడా రానవసరం లేదనీ, కానీ .నీలమ్మ ఇంకా పని చేయాలనుకుంటే రావచ్చని కుాడా చెప్పడంతో ..రాజన్నకు ఏమనాలో తెలీలేదు. నీలమ్మ కుాడా..
" అవును మామా .నువ్వే ఈడకొచ్చేయ్ . ఈ పట్టులో నేను మేమ్ దగ్గరే ఉండాల ..ఆమె నా కోసరం చుాస్తుా ఉంటాది . ఇంటికాడ పనోల్లు సానా మందే ఉన్నారు కానీ అమె నా మీదే నమ్మకమెట్టుకుంది. ఎంతట్లోకనీ మరొక్క నెలే ..ఆమెకు పురుడవ్వగానే నానింటికొచ్చేనుా "...అని చెప్పడంతో, తనకు నచ్చకపోయినా ఏమీ అనలేక ఊరుకున్నాడు రాజన్న. నీలమ్మకు ఇంకా కరోనా పై అవగాహన లేనందున రాజన్న మాటలను అర్ధం చేసుకోలేకపోయింది.ఆమె మనసులో మేమ్ గురించి తప్ప మరో ఆలోచనే లేదు.
నీలమ్మకు తెలుసు .తనను మేమ్ , ఇంటిలో ఎంత బాగా చుాసుకునేదో...మేమ్ సాహిబా ను ఈ సమయంలో వదలి ,తను వెళ్ళపోవడం తప్పు కదా .
ఈ తప్పుకు బగమంతుడు సిచ్ఛించడా అనుకొంది. " " ఆమె తనను ఆమెతో సమానంగా చుాసుకుంది సొంత సెల్లిలా...ఇన్నాళ్ళుా... ఆ యిస్వాసం తనుకుాడా సుపించాల గదా "అనిపించింది నీలమ్మకు.
---------------
నీలమ్మ బాబుతో పాటు బంగ్లాకు లో ఉండిపోయింది .
రాజన్నే ఇక్కడకు వస్తాడన్న నమ్మకంతో... కానీ రాజన్న బంగ్లా కి రానన్నాడు . నీలమ్మకి ఏంచెయ్యాలో తెలియ లేదు.
మేమ్ బాబుని చుాసి ఎంత ఆనందపడిందని..
ఐతే తను మునుపు సాయంత్రం కాగానే ఇంటికి వెళ్ళిపోయేది. ఇప్పుడు ఏకంగా ఇక్కడే ఉండిపోవాలి.
అక్కడ మామ పిల్లలతో ఎంత ఇబ్బంది పడతన్నాడో ఇక్కడికి వచ్చి ఉండమని ఎంత బతిమిలాడినా స సేమిరా అన్నాడు రాజన్న. రోజుా తనని ...బాబుని చుాడడానికి మాత్రం తప్పకుండా వస్తానని చెప్పేడు. అలాగే పిల్లలని తీసుకొని అప్పుడప్పుడు
వస్తున్నాడు . కుాడా...సాయంత్రం 4 గంటలనుండి 7 గంటలదాకా సమయం పిల్లలతో ఆనందంగా గడిచిపోతున్నాది నీలమ్మకు. ఐతే ఆ సంతోషం ఎన్నో రోజులు నిలవలేదు. కరోనా జబ్బు కారణంగా దేశ వ్యాప్తంగా పుార్తి లాక్ డౌన్ చేసేరు ప్రధాని. దానితో ఎక్కడివారక్కడే ఉండిపోయేరు .దాంతో రాజన్న రాకా పోకా పుార్తిగా నిలిచిపోయింది.
దాంతో రాను రానుా "తనిక్కడ ఉంటానని
తప్పుచేసేనా " అనిపించసాగింది నీలమ్మకు .
తను రాజన్న మాటవిని ఇంటికి వెళ్ళిపో వలసిందేమొా.
అని అనిపించసాగింది. ఎందుకంటే..
ఇక్కడకు వచ్చేకా , రాత్రిళ్ళు అక్కడ ఉండడం చాలా
ఇబ్బందిగా ఉంది నీలమ్మకు. చంటాడు గడి గడీక్కి లేవడం , తను వాడికి పాలు పట్టడం , ఏడుస్తుా ఉంటే ఊరుకో పెట్టడం లాంటివి సమంగా చేయ లేకపోతున్నాది. ఎందుకంటే మేమ్ కి బాబు ఏడుపు వల్ల నిద్రకు ఇబ్బంది కాకుాడదని , తనకి ఈసారి వేరే గది కేటాయించేరు. కానీ అది కింద నుంది. తన గదికి ఎదురుగానే సాహెబ్ గది. తన గది పక్కనే కొంచం దుారంలో వంటామె గది ఉంది . కానీ అక్కడ రాత్రిళ్ళు పనివాళ్ళెవరుా ఉండరు. దాంతో చాలా ఇబ్బందిగా భయంగా కుాడా ఉంది నీలమ్మకు.
దాంతో పాటు రోజులు గడుస్తుచన్న కొద్దీ , నీలమ్మకు ఇన్నాళ్ళుా తెలీని కొన్ని భయంకరమైన విషయాలు తెలుస్తున్నాయి. దాంతో మరీ బెంబేలు పడిపోయింది.
సంగతేమిటంటే..
సాహెబ్ తను అనుకున్నంత మంచోడు కాదు.రోజుా
రాత్రుళ్ళు తాగుతాడు. రోజుకో అమ్మాయితో గడుపుతాడు. ఒకొక్క రోజు ఇద్దరుా ముగ్గురితో కుాడా గడుపుతాడు.అప్పుడప్పుడు మేమ్ కి మందులిచ్చే నర్సమ్మ కుాడా రాత్రంతా ఉండిపోతుంది. వాళ్ళ యిక- యికలుా పక -పకలుా అన్నీ , తనకు వినిపిస్తుానే ఉంటాయి. అసలు మేమ్ కి ఇవన్నీ తెలుసా...?
ఎలా తెలుస్తుంది..? రాత్రుళ్ళు అమెకి నిద్ర మందు
ఆ నర్సమ్మే ఇస్తుంది . మేమ్ మత్తుగా పడుక్కున్న మేమ్ .పొద్దున్న ఆలశ్యంగానే నిద్ర లేస్తుంది. లేచాకా కుాడా తనంత తానుగా లేవ లేదు కదా...అంటే
తను సాయంత్రాలు ఇంటికి వెళ్ళి పోయాకా , అప్పుడు కుాడా ఆమెకు నిద్ర మందు ఇచ్చేవారా...మేమ్ కి అసలు నిద్ర మందు ఎందుకు...? కడుపుతో ఉన్నామెకు , అన్ని మందులెందుకు..?
రోజు రోజుకుా నీలమ్మ మనసులో అనుమానాలు పెరుగుతున్నాయి. కానీ ఎవర్ని అడిగేది..? అడిగి మాత్రం తనేం చేయగలదు..? ఐనా డబ్బున్న వారితో
తనకెందుకొచ్చిన గొడవ..? మేమ్ కి పురుడవ్వగానే
తను తనింటికి వెళ్ళిపోతుంది..? మరి కొంచం రోజులు ఓపిక పడితే సరి...
ఇలా ఆలోచిస్తున్న రాజమ్మకు రాత్రిళ్ళు కంటి మీద కునుకు కరువయ్యింది. భయానికి ' వేసిన తన గది తలుపులు తీసి బయటకు వచ్చేది కాదు .రోజులు భారంగా గడుస్తున్నాయి
,
No comments:
Post a Comment