మానవాళికి నూతన మార్గాన్ని వేసి దుఃఖ విముక్తికి దారి చూపిన గౌతమ బుద్ధుని బోధనలు హేతుబద్ధమైనవి. ఇప్పటి వరకు సైన్స్ చెప్పిన, చెప్పని అనేక అంశాలను బుద్ధుడు 2500 సంవత్సరాల క్రితమే చర్చించాడు.
బుద్ధుని బోధనలలో ప్రధానమైనవి..
*అనాత్మ సిద్ధాంతం* : (ఆత్మ లేదు అని బుద్ధుడు స్పష్టం చేశాడు). ఆత్మ ఉన్నదని చెప్పే ఏ మతమైన అది అనుసరణీయం కాదు అన్నాడు... అలా చెప్పడం మూఢత్వమే అన్నాడు.
*అనిత్య సిద్ధాంతం*: నిత్యమైనది ఏది ఉండదు అని చెప్పాడు. ప్రతీది అనిత్యమై మార్పు చెందుతుంది అన్నాడు.
*కార్యకారణ సిద్ధాంతం* : ప్రతి కార్యానికి కారణం ఉంటుంది అన్నాడు. ప్రతిదానికి హేతువు ఉంటుంది అన్నాడు. హేతువు లేకుండా ఉన్న దేనిని నమ్మకూడదు అన్నాడు. ప్రతీది పరిశీలించి, చూసి, మీ పరిశీలనలో నిజమని తెలితేనే నమ్మండి అన్నాడు. ఎవరో చెప్పినది నమ్మడానికి వీలులేదు అన్నాడు.
*ప్రతిత్యాసముత్పాద సిద్ధాంతం* : దేవుడు ఉన్నాడా లేడా అన్నది ఇక్కడ ప్రదానం కాదు.దేవుడు ఈ సృష్టిని దేనితో నిర్మించాడు అనేదే ప్రధానం. ఈ సృష్టి శూన్యం లో నుండి నిర్మించబడింది అనడం సహేతుకమైనది కాదు. అది అబద్దమే అవుతుంది. అలా కాకుండా ఏదో ఒక పదార్థం నుండి సృష్టిని సృజిస్తే దేవుడు సృష్టికర్త కాడు. ఎందుకంటే తను సృష్టించడానికంటే ముందే ఒక పదార్ధం ఉంది కాబట్టి. కనుక సృష్టికర్త అంటూ ఎవరు లేరు (ఇంతవరకు ఎవరు చూడలేదు) కాబట్టి దేవుడు ఉన్నాడని నమ్మడం మూఢత్వమే అవుతుంది.
*చేతన సిద్ధాంతం* : విద్యుత్తు ఎక్కడ ఉంటుందో అక్కడ అయస్కాంత శక్తి కూడా ఉంటుంది. విద్యుత్తుని వెన్నంటి అయస్కాంత శక్తి ఉన్నట్టే శరీరం రూపుచెందడంతో పాటు చేతనత్వం కూడా ఏర్పడుతుంది.
ఏది బౌద్దం?
నువ్వు ఎవరి మీద ఆధారపడకుండా నీ స్వబుద్ధితో నీకు నీవుగా బుద్ధుడిగా మారడమే బౌద్ధం.
సృష్టి నియమాన్ని అర్ధంచేసుకొని సత్యాన్ని గ్రహించి ఆ ధమ్మం లో నడవడమే బౌద్ధం.
సత్యాన్ని గ్రహించినవాడిగా అనేకులకు ఆ సత్యాన్ని తెలియజేస్తూ, ధమ్మాన్ని ఆచరిస్తూ సంఘంలో జీవించడమే బౌద్ధం.
No comments:
Post a Comment