Monday, November 8, 2021

బాల భారతం.

*బాలభారతం ఈ-కవితాసంకలనం*కొరకు
శీర్షిక : బాల భారతం.
పద్య ప్రక్రియ : ఆటవెలది.

కల్ల కపట మెల్ల  కానరాని వయసు
మర్మ మెరుగ నట్టి మనసు దినుసు
వావి-వరుస లెంచి వరుసపి లుపుతోడ
పరుల నమ్ము లేత పసిడి వయసు॥

ఆట పాట లాడి అల్లర్ల  మునిగేరు
ముద్దు జేయ ఒడిని మురిసి జేరు
మామ తాత యనుచు మనసార నదెనమ్మ
తనదు ప్రాయ మెల్ల తారు మారు॥

కాము కులకు జిక్కి  కమిలి కుమిలె బాల
రక్ష ణిలను గనక రగిలె బేల 
పశువు కన్న హీన పరుడైన మగవాడు
గనడు వావి వరుస గార్ధభుండు ॥

నమ్ము పిల్ల దాని నట్టేట ముంచేటి
నరులు రాక్షసు లిల నమ్మ బోకు
కామ మెంతో పెరిగె  కాముకులిల నిండె
ఆడ జన్మ మదియె  అరటి ఆకు॥

.రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ : మహారాష్ట్ర ..
8097622021.

హామీ:
నా ఈ రచన ఏ మాధ్యమునందునుా ప్రచురితం కాని
నా స్వీయ రచన

No comments:

Post a Comment