Thursday, November 4, 2021

భీమసేనుడు

రచన శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్  మహారాష్ట్ర .

ప్రక్రియ : ఇష్టపది.

శీర్షిక : వజ్రకాయుడు.
(వచన కవిత )


కుార్మి యాదవ రాజు కుంతిభోజరాజుకు
పలుక గారములేలు పట్టి భోజ పుత్రిక ॥
కోరుకున్న దేముడే కోరు సంత తిచ్చునని ,
వాసిగ దుార్వాసుడు  వరమొసగెను ఆమెకు ॥

పసి ప్రాయపు ధ్యానము వరమడిగిన మంత్రము
పఠియించిన  ఫలముా  పసి బిడ్డకు జన్మము
నీట విడెచె బాలుని నిజ భయమున  కుంతీ.
రహస్యమును దాచెను రాత్రి పవలు వగచెను ॥

సరి సమయము వచ్చెను  సఖి కుంతి వివాహము
కురువంశపు రాజుతొ  గుాడిన శుభ సమయము
యొాగ సంతానమదె యొాగ్యతగలదనుచును
యోగ దృష్టిధనులైన  యొాగులు సరి పల్కెను॥

కురువంశ సంజాతుడు  కుంతీ వర పుత్రుడు
భీషణ ఘన కాయుడు భీముడు జనియించెను 
పాండు రాజు భార్యగ పాండవులకు తల్లిగ
కుంతి  పేరుగాంచెను  కులసతిగా  నిలిచెను.॥

పాండవానుజుడితడు బలవంతుడు భీముడు. 
వాయు పుత్రుడీతడు వరలతిబల కాయుడు
సరి నాగుల వరముతొ సహస్ర కరి బలుడు
మాత్ర గదా ధరుడుా మల్ల యుద్ధ యొాధుడు ॥

జంపె బకాసురునుా జరాసంధు చీల్చెను
హిడింబసురు దునిమెను "హిడింబి "పెండ్లాడెను.
ఘటోత్కచ,శ్రుతసోము ఘన పుత్రులు భీమకు
 హిడింబీ, ద్రౌపతుల హిత పుత్రులు ఇరువురు  ॥

అమ్మ మాట మరువడు అన్నయాజ్ఞ  మీరడు 
అతడె భీమసేనుడు  అతి వజ్రకాయుడుా 
కురుక్షేత్ర సమరము  కుల హీనుల దమనము
అనుజులు కౌరవులను అంత మిడిన ఘనుడుా॥

ఆరు అక్షౌహిణుల  అదె కౌరవ సైన్యము
నిర్జించిన వీరుడు నిజ భుజ బల భీముడు
భారతమున బలుడుా, భరత కీర్తి చరితుడు
ఈశ్వరికిల యిష్టుడు  ఇటువంటి సొిదరుడు ॥


No comments:

Post a Comment