తెలుగు భాషా చైతన్య సమితి, లక్ష్య సాధన ఫౌండేషన్-వారి...
అంశం : శ్రీశైల భ్రమరాంబా మల్లికార్జున స్వామి వైభవం
కవితా సంకలనం కొరకు,
రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ : మహారాష్ట్ర ..
శీర్షిక : జ్యోతిర్లింగ స్వరుాపుడు.
శ్రీశైల క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమునందు
కర్నూలు జిల్లా లోని ప్రసిద్ధ శైవ క్షేత్రము. ॥
ఈ క్షేత్రంలో భ్రమరాంబా సహితుడైన శ్రీ
మల్లిఖార్జునస్వామి భక్తులకోర్కెలుదీర్చే
స్వామిగా అభయహస్తుడై లింగరుాపంతో
రాజిల్లుతుా ఉంటాడు.॥
ద్వాదశ జ్యోతిర్లింగాలలో రెండవది,అష్టాదశ శక్తి పీఠములలో ఆరవది, దశ భాస్కర క్షేత్రములలో ఆరవది ఐన శ్రీశైల క్షేత్రం నాలుగు గోపురాలతో
అత్యద్భుతమైన కట్టడాలుగా నిర్మించిన దేవాలయాలతో నిత్యముా హర నామస్మరణతో
పవిత్రమై ,కన్నుల-కింపైనదిగా ప్రసిద్ధి కెక్కింది.
ఈ క్షేత్ర స్థలపురాణ కథనం ప్రకారం ,
గాయత్రీ ఉపాసకుడైన అరుణాచలుడనే రాక్షసుణ్ణి
దేవతలు , దేవగురువైన బృహస్పతిల
సహకారంతో ఆ పరమేశ్వరి తుమ్మెద రుాపంలో
వచ్చి వధించిందని ప్రతీతి.
స్వశ్ఛమైన నీరుగల మనోహరగుండము,నాగ ప్రతిమలు, అద్దాల మండపాలు , పంచపాండవుల
దేవాలయాలు , ప్రశిద్ధ పంచ మఠాలు కాక
ఎన్నో ఆకర్షణీయమైన పర్యాటక ప్రదేశాలతో
శోభాయమానమై వెలుగొందుతుా ఉంటుంది.
శ్రీశైలానికే సిరిగిరి, శ్రీగిరి, శ్రీపర్వతము, శ్రీశైలము మొదలైన నామాలు కుాడా ఉన్నాయి.
*****
ఈ క్షేత్ర స్థలపురాణ కథనం ప్రకారం ,
గాయత్రీ ఉపాసకుడైన అరుణాచలుడనే రాక్షసుడు
తన తపోశక్తితో తనకు మరణం లేకుండా బ్రహ్మచే వరం పొందడంతో ,భయ భీతులైన దేవతలు
ఆదిశక్తిని ప్రార్ధించగా..గాయత్రీ ఉపాసకుడైన
ఆతనిని చంపడం ఎవరి తరముా కాదని అంబ
పలుకుతుంది.
అటుపై దేవతలు తమ గురువైన
బృహస్పతిని గుాడి వేసిన పథకం ప్రకారం,
తమ గురువును అరుణాచలునివద్దకు పంపుతారు.
దేవగురువైన బృహస్పతి ని జుాచి అరుణాచలుడు
ఆశ్ఛర్యచకితుడై, అతని రాకకు కారణమడుగగా
బృహస్పతి , తామిరువురుా గాయత్రీ ఉపాసకులు కావడమే ఒక పెద్ద కారణమని చెపుతాడు.
అదివిన్న అరుణాచలుడు , "దేవతలు కొలిచే గాయత్రిని తాను కొలువడమా." అని అహంకరించి
గాయత్రీ ఉపాసనను విడిచిపెడతాడు.
అది చుాసి కోపించిన ఆదిశక్తి భ్రమర (తుమ్మెద) రూపం ధరించి అసంసాఖ్యకంగా భ్రమరాలని సృష్టిస్తుంది. ఆ భ్రమరాలు అరుణాసురుడిని అతని సైన్యాన్ని సంహరిస్తాయి.
ఇక్కడ ప్రజలు శ్రీ మల్లికార్జున స్వామిని శివుడుగా,, మాత పార్వతి దేవిని భ్రమరాంబగా పూజించేందుకు
మల్లెల తీర్థం అనే జలపాతాలలో స్నానాలు ఆచరిస్తారు. ॥
ఈ నీటిలో స్నానాలు ఆచరిస్తే పాపాలు పోతాయని మోక్షం వస్తుందని భావిస్తారు.॥
స్వశ్ఛమైన నీరుగల మనోహరగుండము,నాగ ప్రతిమలు, అద్దాల మండపాలు , పంచపాండవుల
దేవాలయాలు , ప్రశిద్ధ పంచ మఠాలు కాక
ఎన్నో ఆకర్షణీయమైన పర్యాటక ప్రదేశాలతో
శోభాయమానమై వెలుగొందుతుా ఉంటుంది.
శ్రీశైలానికే సిరిగిరి, శ్రీగిరి, శ్రీపర్వతము, శ్రీశైలము మొదలైన నామాలు కుాడా ఉన్నాయి.
2.
నల్లమల ఆడవుల లో కొండగుట్టల మధ్య గల
శ్రీశైల క్షేత్రం లో, ద్వాదశలింగాల లో ఒకటైన
శ్రీ మల్లికార్జునుని పవిత్ర లింగం ఉండడం వలన
ప్రసిద్ధ శైవక్షేత్రం గా పేరుపొందింది ॥
ఇక్కడ ప్రజలు శ్రీ మల్లికార్జున స్వామిని శివుడుగా,, మాత పార్వతి దేవిని భ్రమరాంబగా పూజించేందుకు
మల్లెల తీర్థం అనే జలపాతాలలో స్నానాలు ఆచరిస్తారు. ॥
ఈ నీటిలో స్నానాలు ఆచరిస్తే పాపాలు పోతాయని మోక్షం వస్తుందని భావిస్తారు.॥
క్రీ.శ.6వ శతాబ్ది నాటి మైసూరులోని కదంబరాజుల తాల్గుండి శాసనంలో మొదటిసారి శ్రీశైలం
పేరు కనిపిస్తుా , చరిత్రకు ఆధారాలుగా ఉన్న శాసనాల్లో మొదటిదిగా ప్రసిద్ధి చెందినద క్షేత్రం
శ్రీశైలం.॥
No comments:
Post a Comment