Monday, November 22, 2021

కణ్వ మహర్షి .

అంశం : కణ్వ మహర్షి .
శీర్షిక : భరత వంశ చరిత.

రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ : మహారాష్ట్ర ..
ప్రక్రియ : ఇష్టపది .


ఘోరుడను ఋషిపుత్రుడ ఘోర తపోధనుడుా
ఘన నిష్టాపరుడుా గౌరవ ఋషి  గణ్యుడు .
కణ్వ స్మృుతి కర్తగా కణ్వ ధర్మ శాస్తగా..
ప్రాముఖ్యత పొందెనుా  ప్రాశస్త్యము నొందెను॥

వేద మంత్ర ద్రష్ట- రు  గ్వేదమంత్ర  పుాజ్యుగా
చతుర్వేదమందున   చర్చ కణ్వ వివరణ .
విశ్వామిత్రు జేరె    విధి పుత్రి శకుంతల
కణ్వాశ్రమ మందున కడు ముద్దుగ పెరిగెను ॥

గాడమైన యొాగము గాంధర్వ  వివాహము  
జరిగె శకుంతలకుా జక్కగ దుష్యంతుతొ॥
దురదృష్టపు సమయము దుార్వాసుని శాపము 
దుఃఖిత శకుంతలను దుష్యంతుడు మరచెను॥ 
  
 శాపమొాచనాయెను శాకుంతల మురిసెను
 దుర్దినములు పోయెను దుష్యంతుడు పిలిచెను ॥
 ఇరువురి ఆనందము ఇలను ఏల రాజ్యము
 బహు గుణ భుాషణుడౌ భరతుడు జన్మించెను ॥ 
 
యాత్ర జేయ కణ్వుడు  యాదవ పురమేగెను 
సరసమాడ యాదవులు  శాపముకు గురాయెను
కణ్వుడిడిన శాపము కాదుగ  నిష్ఫలముా ॥
ముసలము జన్మించెను   ముప్పుగనదె మారెను ॥

యాదవులు నశించెను  యవని బోసిపోయెను
శ్రీ కృష్ణుని జన్మము  శీఘ్రమిలను ముగిసెను ॥
కణ్వ వృత్తాంతముా  గనినట్టే చదివిన,
జగదీశ్వరి మురిసెను  జగమునకెరిగించెను ॥.



 
   
   

No comments:

Post a Comment