Tuesday, January 5, 2021

పాశురము 21.

రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్: మహారాష్ట్ర .
8097622021.



శీర్షిక : 
నందా ఆనందా...
----------------------

నందా...గోపాలబాలానందా  ఆనంద లీలా...
విందులే నీ వేణునాదము వినగ మధురము ఈ జగాన॥ నందా...

చరణం: 
పల్లెలో రేపల్లెలో మా చల్ల ముంతల కొల్లగొట్టి
ముందుగా మావెన్న  పాలను ఆరగించిన చిన్ని కృష్ణా 
ఆదుకొన భువినవతరించిన ఆది దేవుడ వీవయ్యా
నిన్ను కలువగ వస్తిమయ్యా నిదురలేవర కన్నయ్యా॥నందా...

చరణం:
పాలకుండలు నిండిన పాలిచ్చు పాడిగల వాడవుా
పాలకుడు ఆ నందునీ పరమ ముద్దుల బాలవుా...
శీల సద్గుణ రాయ గ్వాలా కృష్ణ మేల్కొని రావయ్య
జాలమేలర మాదు మొరవిన జగములేలిన వాడవయ్యా ॥ నందా...

చరణం :
ఆశ్రయించితిమీ..నిన్ను ఆదుకొనగా రావయ్యా...
విశ్రమించుట చాలు చాలిక వేద వేద్యా యొాగి వంద్యా
మధరగీతములాలపించి మంగళ శాశనములిడుచు
నీదు పదముల పుాజింప నీదు వాకిట వేరచియుంటిమి.॥  నందా...

యఖుడ వీవని తలచి వస్తిమి
యాదవా కుల దీప ధన్య..
చిన్న నాటీ సఖుల చేరగ 
రార కృష్ణా  రయముగాను
సుప్రభాతము పాడు చుంటిమి 
సుార్య తేజా లేచి రమ్మా ॥  నందా...

No comments:

Post a Comment