6/01/2021.
అంశం :వివేకానంద.
శీర్షిక : దిశా నిర్దేశకుడు.
రచన: శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.
-------------------
అందరు తనవారనుకుంటేనే నిజమైన స్వేచ్ఛ లభిస్తుందనే వేదాంత తత్వానికి చెందిన వ్యక్తి వివేకానందుడు.
.త్యాగ, సాక్షాత్కారాలను పొందినవాడే ప్రపంచంలోని సర్వమతాలలోని ఏకత్వాన్ని దర్శించగలడు.
అంటుా వేదాంత , యొాగ ,తత్త్వ శాస్త్ర సారాన్ని
మానవాళికి బోధించిన వేదాంత గురువు , రామక్రిష్ణ పరమహంస ప్రియ శిష్యుడు ,అయిన వివేకానందుడు ప్రఖ్యాత ఆధ్యాత్మిక నాయకునిగా పేరు పొందేరు.
అతని పుార్వ నామం నరేంద్రదత్తా. సహనం లేని వ్యక్తి
విజయం సాధించలేడని , బలమే జీవనమని , బలహీనతే మరణమని , మన విధికి మనమే విధాతలమని , ఔన్నత్యానికి విశ్వాసమే మార్గమని
వితంతువు కన్నీళ్ళు తుడవనివారు, అనాధకు అన్నంపెట్టనివారినెవరినీ విశ్వసించకుాడదంటుా,
నిరంతరం వెలిగే సుార్యుణ్ణి చుాసి చీకటి,
నిరంతర సత్య పోరాటకుని చుాసి ఓటమి
భయపడతాయన్న స్ఫుార్తిని యువతలో మేల్కొల్పిన
జ్ఞాన ధనుడు.రోజులో ఒకసారైన మనతో మబం మాట్లాడుకుంటే మనలోనే ఒక మహావ్యక్తిని మనం కనుగొనగలమన్న సత్యాన్ని దర్ముంపజేసిన
ఆత్మ జ్ఞాన సంపన్నుడు.
కెరటం నా ఆదర్శం , లేచి పడుతున్నందుకు కాదు.పడుతుా లేస్తున్నందుకంటుా తనదైన ఒక నిర్దిష్ట
నిశ్ఛయ సాధనా పటిమతో అందరిమనసుల లోనికి చిచ్చుకుపోయిన వాడు తొలిసారిగా పాశ్ఛాత్య ప్రపంచానికి మన భారతీయ తాత్విక విశిష్టతను
బోధించిన ఆధ్యాత్మిక గురువు, మొదటి సన్యాసి
శ్రీ వివేకానంద స్వామి. యువతకు దిశా నిర్దేశం చేసిన వాడు ,రామకృష్ణ మఠస్థాపకుడు అయిన ఈతని జన్మదినాన్ని జాతీయ యువ దినోత్సవంగా నిర్ణయించి
ఈ నాటికీ మనం జరుపుకుంటున్నామంటే అతని సిద్ధాంతాలను ఈనాటికీ మనం ఆదరించడంతో పాటు ఆచరిద్దాం....
-----------------
No comments:
Post a Comment