20-01-2021
అంశం: అనుకోకుండా ఒక రోజు ( కథానిక.)
శీర్షిక : తీరిన కోరిక.
రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్: మహారాష్ట్ర .
----------------------------------------
"సాంప్రదాయ ఋచులు " రెష్టారెంట్ ,
వచ్చి పోయే జనం తో కోలాహలంగా ఉంది. ప్రతీ చిన్న ఫంక్షన్ కు, పండగలకు కుాడా ఇక్కడే
అందరుా ఆర్డర్స్ ఇవ్వడంతో , జనం లైన్ కట్టి
మరీ టోకెన్స్ ప్రకారం ఐటమ్స్ పేకింగ్ చేయించు కుంటున్నారు.
ఎంత మంది ఆర్డర్ ఇచ్చినా తరగని "క్వాలిటీ ఫుడ్" గా
ప్రతీ సంవత్సరం కుాడా , ఉత్తమ స్థానంలో నిలిస్తొింది
"సాంప్రదాయ ఋచులు " రెష్టారెంట్.
పైన ఎ. సి. రుామ్ లో కొంచం నెరిసిన జుట్టుతో , కాటన్ చీర కట్టుకొని , వేలుముడి వేసుకొని , సి. సి. ట.వి స్క్రీన్ లో ఇదంతా చుాస్తున్న జానకమ్మ , తన కోర్కెను
ఈ రకంగా తీర్చినందుకు భగవంతుడికి పదేపదే
నమస్కరిస్తుా .. "అనుకోకుండా, ఆ రోజు జరిగిన సంఘటన" స్పరణకి రాగానే. గతం లోకి జారిపోయింది.
************************************"""""
తనకు చిన్నప్పటినుంచీ చదువుకోవాలని, ఏదైనా స్వయం కృషితో సాధించాలని చాలా ఆశగా ఉండేది
కానీ అమ్మా నాన్న కుాడా ,ఆడపిల్లవు ,అణిగి మణిగి
ఉండాలంటుా, ఎంత చదివినా పెళ్ళి చేసుకొని ఇంటి పనులేకదా చేయాలి, ఆడపిల్లకి పెద్ద పెద్ద
చదువులెందుకంటుా...పదవతరగతి అవ్వగానే పెళ్ళి
చేసీసేరు .
తన మనసులో కోరిక అలాగే ఉండిపోయింది.
అత్తవారింట్లో చాకిరీ , పిల్లలు బాధ్యతలతో
క్షణం తీరికలేని జీవితం.
పొద్దున్నే తయారై తమ కారును తామే డ్రైవింగ్ చేసుకుంటుా వెళుతున్న సంపాదనాపరులైన
సాటి స్త్రీలను చుాడగానే
తన మనసులో కోరిక తిరిగి ఉవ్వెత్తున లేచేది.
ఆగలేక భర్త తో చెప్పింది గానీ , అతను కుాడా
ఇప్పుడేం చదువుతావు..ఎప్పటికి పుార్తవుతుంది..
ఇంక ఉద్యోగమెప్పుడు....
ఐనా పిల్ల లచదువులకే ఉన్నది చాలడంలేదు...
అంటుా...లెక్కలు -జమలు చెప్పేసరికి మరేం
మాట్లడ లేకపోయింది.
పని వంట -,పని-వంట, పని తో అలా ఇంట్లోనే ఉండడం చాలా విసుగ్గా ఉండేది.
నవరాత్రి పండగ దగ్గర పడుతుా ఉంటే చాలా మందికి
చాలా ఉత్సాహంగా ఉండేది.
కారణం తమ సొసైటీలో ఆ తొమ్మది రోజులుా
అమ్మవారి పండగ చాలా బాగా జరిగేది. జనం బాగా వస్తారు. చాలా మంది గృహిణులు ఎవరికి తోచిన
వంటకాలు వారు చేసి చిన్న చిన్న జాగాల్లో కట్టిన దుకాణాల వంటి వాటిలో పెట్టి అమ్మేవారు .ఆ వచ్చిన డబ్బులో కొంత సొసైటీకి ఇచ్చే ఒప్పందం తో వారికి
ష్టాల్ వాడుకొనే హక్కుండేది.
అమ్మవారిని చుాడడానికి పిల్లలతో వచ్చేవారు ,
ఆడి పాడి అలసిన పిల్లలకు
" హోమ్ మేడ్ ఫుడ్" అంటుా కొని పెట్టడమేకాక
వారు కుాడా తినేవారు.
కొంచం ఎక్కువ ఖరీదైనా అందరివీ అమ్ముడుపోయేవి.
అనుకున్న దానికంటే సొమ్ము ఎక్కువ రావడం తో అమ్మేవారి ముఖం ఆనందంతో కళ కళ లాడేది.
ఇవన్నీ చూస్తున్న జానకమ్మకు తను కూడా ఇందులో పాల్గొంటే బాగుందన్న కోరిక ఎక్కువైంది.
ఈ ఏడు తనుకుాడా పాల్గొనాలని సంకల్పించుకొంది.
దీనికి తను ఎవరి పెర్మిషనుా తీసుకో అక్కర లేదు.
కానీ ఇప్పటికే మూడు రోజులు గడిచిపోయాయి. స్టాల్స్ అన్ని నిండిపోయి ఉన్నాయి. తనకు దొరుకుతుందో, దొరకతో ,అనుకుంటూనే సాయంత్రం" హారతి" కోసమని కిందకు వెళ్ళింది. దేవి హారతిభక్తిగా చేసింది .ప్రసాదం తీసుకుని బయటకు వస్తూ ఉంటే స్టాల్స్ అన్నిటిలోకీ చివరిగా ఉన్న స్టాల్ ఖాళీగా కనిపించింది. దాంతో జానకమ్మ ఆనందపడుతూ అక్కడి యాజమాన్యం వారికి తనకు "ఆ చిన్న స్టాలు మూడు రోజుల కోసం కావాలని" అభిమానపడుతూ మొహమాటంగానే అడిగింది.
అది. ఖాళీగా ఉండటంతో, వాళ్ళు కొంచెం సేపు ఆలోచించి, ఆ తర్వాత ఒప్పుకోగానే, ఆనందంతో సంబరపడిపోయింది జానకమ్మ..
"అనుకోకుండా ఈ రోజు" తన కోరికను తీర్చినందుకు అమ్మవారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంది జానకమ్మ..
************************************
రాత్రంతా నిద్ర పట్టలేదు జానకమ్మకు. మూడు రోజుల కోసం స్టాల్ అంటే బుక్ చేసింది గాని
తనకు ఇప్పటి కాలం వంటలు అంటే ....
పిజ్జాలు ,బర్గర్లు , సమొాసాలు వంటివి అంత
బాగా రావు.కానీ తన సరదా కోసం ఒక్కసారి తమ సాంప్రదాయ వంటలైన పులిహోర , దద్దోజనం,
బుార్లు , పెరుగువడలు , చక్కెరపొంగలి చేద్దామని నిర్ణయించుకొంది . తెలుగు స్టాల్ ఇస్తామన్న విషయం భర్త తో చెప్పింది. సొసైటీ లోని
చాలా మంది ఆడవారు అలా చేసే వారు ఉన్నారు
కనుక అతనేమీ అనలేదు కానీ తను చేసే ఈ వంటలు
ఎవరు తింటారంటుా ఎద్దేవా చేయడంతో తను చిన్నబోయింది. కానీ తను చేద్దామనుకున్న పని మానదలుచుకోలేదు. ఆలోచనల్లో ఉండగానే నవరాత్రి రానే వచ్చింది. పగలు రాత్రి తేడాలేని వెలుగుల సంబరం. పగలంతా పుాజలు, ఆరతులు, నైవేద్యాలుా ,ఐతే సాయంత్రం ఐదు నుండే ప్రోగ్రాములు..రాత్రి
పది గంటలనుండి, తెల్లారి రెండుా ముాడు గంటలవరకు కోలాటం ఆటలతో సందడే సందడి.
అందరితో పాటుగా తను కుాడా చిన్న ష్టాల్ తీసుకొని
పైన "సాంప్రదాయ ఋచులు " అన్న బో్ర్డ్ పెట్టి
తనుచేసిన తినుబండారాలు పెట్టింది. చీర కట్టు బొట్టుతో , వేలుముడి వేసుకొని వచ్చిన తనను
చుాసి మిగిలిన వారు వ్యంగ్యంగా నవ్వుకోవడం చుాసి బాధ వేసింది . సాయంత్రం వరకు ఎవరుా తన వంటలు రుచి కుాడా చుాడలేదు.మిగిలిన వారివి
అన్నీ చెల్లిపోయి సాయంత్రానికి మళ్ళీ చేసుకు వస్తున్నారు. రాత్రి తొమ్మదికే వారందరు చేసినవి
ఖాళీ ఐపోయాయి. తనకు కళ్ళనీళ్ళొక్కటే తరువాయి.
నిరాశగా అన్నీ తీసి ఇంటికివెళిపొిదా మని అనుకుంటుండగా, సొసైటీవారు బుక్ చేసిన గుజరాతీ
కోలాటం గ్రుాప్ వారు వచ్చీ , మిగిలిన ఐటమ్స్ ఏవీ
లేకపొివడంతో తన దగ్గరకు వచ్చేరు. పొద్దున్న నుంచీ చాలా చోట్ల ఆడుతుా ఉండడంతో ఆకలిగా ఉన్నామంటుా పులిహోర, చక్కెరపొంగలి ముందు తీసుకున్నారు.
అంతే ఆ తరువాత ఐదు నిముషాల్లో అన్ని వంటలు
ఖాళీ..
అవన్నీ తిని చాలా బాగున్నాయంటుా...
అనడమే కాక తమకు అవే ఐటమ్స్ మరునాడు కుాడా
కావాలనడంతో, తను ఆనందంతో తబ్బుబ్బైపోయింది.
తను మిగిలినవారు తనను చుాసి నవ్వేరన్న కోపంతో
తన వంటలు చెల్లలేదన్న అక్కసుతో వీరికి రేట్లు చాలా ఎక్కువగానే చెప్పింది. కానీ అనుకోకుండా ,వారు అదే రేటుతో కొనుక్కొని
మరునాడు కుాడ యాభైమందికోసం చేయగలవా
అని ఆడగడంతో ఆశ్ఛర్య పోయింది.
అంతే । ఆ రోజుతో తన దశ తిరిగిందనే చెప్పాలి.
ఆ తొమ్మది రోజుల్లో తను ఖర్చు పెట్టినదానికి నాలుగు రెట్లు ఎక్కువ ఆదాయం రావడమేకాక , చాలా చోట్ల నుండి ఆర్డర్స్ రావడం, డబ్బు కుాడా రావడంతో ఇంట్లో తనకు ప్రత్యేకత పెరిగింది. చేతి సాయంకి మనుషులను పెట్టుకొని
ఆర్డర్స్ పుార్తి చేయడానికి భర్త , ఇంటి సభ్యులు కలిసి సహాయం చేయడంతో తన ఆనందం రెట్టింపయ్యింది.
పండగ అయ్యేక కుాడా , చాలా మంది ఏదైనా
పండగ వస్తే , చుట్టాలు వస్తున్నారంటుా తన దగ్గర
పిండివంటలు ఆర్డర్ చేసేవారు. దాంతో పరపతి పెరిగింది. అర్డర్స్ ఎక్కువయ్యేయి. అంతే...
ఆరోజు నుండీ తను వెను తిరిగి చుాడలేదు.
పర్యవసానం సిటీ లో పేరెన్నిక గల స్థాయిలో "సాంప్రదాయ ఋచులు " రెష్టారెంట్. పైన
దుర్గమ్మ తల్లి ఫొటో ..అన్నపుార్ణ అవతారిణిగా ..
ఈ రోజు ఈ స్థాయికి తనను తీసుకెళ్లి,
తన "గెలుపు" కు కారణమై ,తనకొక గుర్తింపు నిచ్చిన తన సొసైటీ లో జరిగే "దసరా పండగకు "
ఈనాటికీ తను ఫ్రీగా అవే "సాంప్రదాయ ఋచులను " సప్లై చేస్తున్నాది .అంతేకాదు..ఆ గుజరాతీ గ్రుప్ వారు
తమ సొసైటీలో "కోలాటం" ఆడడానికి వచ్చినపుడల్లా
వారికి కుాడా తను ఫ్రీగా "సాంప్రదాయ ఋచులను "ఇవ్వడం పరిపాటైంది.
ఒక రకంగా తన" గెలుపు" కు కారకులు వారేకదుా...
*********************†****
No comments:
Post a Comment