12/07/2021
మెట్రో ఉదయం జాతీయ తెలుగు దినపత్రిక
మరియు ఉదయ సాహితీ వేదిక కర్నూల్ ,& హైదరాబాద్ సంయుక్తంగా నిర్వహించే కవితల పోటీ
కవితా అంశం " అమ్మ "
శీర్షిక : ఇల వెలసిన దేవత .
" అమ్మ " అనే రెండక్షరాల లో
నిబిడి ఉన్నది అండ పిండ బ్రహ్మాండం.
ఓంకారమయ నాద తరంగం.--
'అమ్మ "అనే శబ్దానికి ఆరంభం.
వేల రుాపాల శక్తిగా కాచుతున్న బంధం ॥.
"దైవం మానవ రుాపేణ" అన్న వాక్యానికి
సంపుార్ణ మైన సాదు స్వరుాపం "అమ్మ ".
అమ్మ గర్భంలో నవ మాసాల ప్రయాణం.
ఏ ప్రయత్నముాలేక పోయినా అందుతుాన్న జీవామృుత ఫల స్వరుాపం, అమ్మ.॥
మాటల తరంగాలతో తెలుసుకున్న
ముచ్చటైన ప్రపంచం అమ్మ.
సృష్టికి ప్రతి సృష్టి చేసిన దేవత ఒడిలో
నిశ్ఛింతగా నిదరోయే పసితనానికి
స్వాంతన నిచ్చే శాంతం అమ్మ.
తడబడే అడుగుల్లో ఆటల్లో, మాటల్లో,
మెళకువల వేటల్లో కాచే చేయుాత అమ్మ.
జీవన బాటలో ఒడిదుడుకుల
ఆరాటాన్న తగ్గించే పోరాటం అమ్మ.॥
బాధ్యతల బరువులో నాన్న లో
సగమైన భావనతో, నడిపే జీవిత
సంసార నావకు చుక్కాని అమ్మ. ॥
అక్షరాల బాటలో మనను అందలాలకు
ఎక్కించి, ఆనందాల కోటలో అందర్నీ
నిలిపి -ఆనందించే, అహర్నిశల
ఆరాటాల అలుపెరుగని పోరాటం అమ్మ ॥
తరగని ప్రేమ కు సాక్ష్యం అమ్మ .
నాటి కీర్తి చరితలకు, నేటి భావి తరాలకు
జీవిత అదర్శాల అరంభం అమ్మ ॥
అనురాగం, ఆనందం,విడలేని బంధం
కలబోసిన భువి వెలసిన " దేవత మన అమ్మ" ॥
రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
క్రమ సంఖ్య : 127.
హామీ :
ఈ కవిత ఏమాధ్యమునందుా ప్రచురితం కాని నా స్వీయ రచన .
No comments:
Post a Comment