4/02/2022.
సాహితీ బృందావన జాతీయ వేదిక
ప్రక్రియ : సున్నితం .
రుాపకర్త : నెల్లుట్ల సునీతగారు.
అంశం : జనాభా విస్ఫోటనం .
శీర్షిక : ఆలోచనతో అడుగు ముందుకు
రచన : శ్రీమతి : పుల్లాభట్ల : జగదీశ్వరీముార్తి .కల్యాణ్ : మహారాష్ట్ర.
226.
మితిమీరిన జనాభాతో అసౌకర్యాలు
అభివృద్ధి బాటలో అవాంతరాలు.
ఆచరణకురాని సంక్షేమ పథకాలు
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
227.
పచ్చదనం కరువైన పల్లెసీమలు
నీటికొరతతో బీడువారిన పంటభుాములు
ఆత్మహత్యలతో అన్నదాతల జీవితాలు
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
228.
పరిష్కారంలేని పథకాలతో కేంద్రవైఫల్యాలు
అందుబాటుకురాని ఆర్ధక వ్యవహారాలు
పెరుగుతున్న నిరుద్యోగ సమస్యలు
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
229.
పెరుగుతున్న కాలుష్యంతో విషపరిణామాలు
పోషకాహారాల కొరతతో పెరిగేరోగాలు
అంటురోగాలకు అందని మందులు ॥
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
230.
ఆలోచనల్లో మార్పుతో ఆనందం
జననియంత్రణే ప్రగతిపథానికి సోపానం
చేయిచేయికలిస్తే దేశోన్నతి తథ్యం
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
హామీ :
పై సున్నితాలు నా స్వీయ రచనలు.
విద్యా విధానాలలో లోపాలు
పిల్లల భవితకు ప్రతిబంధకాలు
ప్రగతి పథానికి అవరోధాలు
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
No comments:
Post a Comment