Monday, February 1, 2021

సాహిత్యం ఎందుకు...?

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం*
*ప్రతిరోజు కవితాపోటీలు*
⚛️⚛️⚛️⚛️⚛️⚛️⚛️⚛️⚛️
పర్యవేక్షణ: *శ్రీ డా॥అడిగొప్పుల సదయ్య గారు*
నిర్వహణ: *శ్రీ బీరప్పొల్ల అనంతయ్య గారు*
తేది: *02-02-2021: మంగళవారం*
అంశము: *సాహిత్యం ఎందుకు?*
ప్రక్రియ: *వచనము*
రచన: ముక్కా సత్యనారాయణ
         పెనుగంచిప్రోలు
🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚

సాహిత్యమనగ సహితము కాదె సాలోచనగ చూడ ,
సర్వజనులకు శ్రియము కోరగ చేయవలె కవనము.
జగతిలోన శాంతి కలుగచేయును సాహిత్యమే
జనులలోన మార్పులు తేగలది కూడా సహితమే.
వెంకటేశునలరించిన అన్నమయ్య కీర్తనలు , వెంగమాంబ కృతులు
వెండికొండ వాసుని కొలిచి పిలిచిన ధూర్జటి శతకము,
భోజుని కడ కవిరత్నములు , విక్రమార్క నవరత్నాలు
దేవరాయని అష్టదిగ్గజాలు చేసె రచనలు ప్రయోజనముతోడ.
ఆరోగ్య, అస్త్ర శస్త్ర, యాంత్రిక సాంకేతికతల నాడె రచియించె.
నేటి సాహిత్యమే రేపటి భవితకు దిక్సూచి కాగలదు.
పలు ఉద్యమాల స్ఫూర్తి , పలు జాతుల కీర్తి , 
ప్రేమ కథల ఆర్తి , విజయగాథల దీప్తి సాహిత్యమే కదా!
నాడు భగవానుడు చేసిన వ్యక్తిత్వ వికాస గీతయు సహితమే.
దేశభక్తి రగిలించిన ఆనందమఠ, వివేకానంద వికాసము
భర్తృహరి సుభాషితాలు , గాంధీజీ సత్యశోధన , దాస్ క్యాపిటల్
ఏది చూసిన దాగినది ప్రయోజనమె, యుద్ధము శాంతి ఏదైనను.
అక్షరము చాలదె అగ్గిపుల్ల వలె అగ్ని రగిలించగ..
ఆహ్లాదమైన , ఆనందమైన , భక్తి రక్తి ముక్తి పథముల యేదైనను
విప్లవమైన ,వికాసమైన , సాంకేతికమైన విశ్వశ్రేయస్సు కోరగ
అదియె సాహిత్యమును , విశ్వజనుల అభివృద్ధియె కోరునెపుడూ..

No comments:

Post a Comment