నయవంచకుల నగరంలో
నగారా మ్రొాగుతోంది.
అసహాయులైన అబలలకు
ఆత్మస్థైర్యాన్నిచ్చేందుకు
అకాశంలో నక్షత్రాల లా...
వికసిస్తున్నాయి షీ టీమ్ సంస్థలు.
తేట తెల్లని తెలంగాణా చంద్రుడు
చల్లని కాంతులతో -
భరోసా వెన్నెలలు కురిపిస్తున్నాడు-
మగువల మనోధైర్యానికి
అండగా తానున్నానంటుా...
ఆత్మస్థేర్యంతో
అరాచకాలనెదుర్కోంటుాపో...
మానభంగాలు చేసే మ్రుగాళ్ల
కుత్తుకలను కోసే కాళీశక్తి
నీలోనే ఉంది
అర్ధరాత్రి స్వాతంత్ర్యం అనుభవించు
షీ టీమ్ నీడ నీ వెన్నంటే ఉంది.
ఇంద్ర ధనుస్సులో
ఏడు రంగులు ఒకటై
తెల్లని కాంతులు విరజిమ్మినట్లు
నీ లో ఉన్న నీశక్తులు
వెలికి తీసి చుాడు
నీలో ఒక ఝాన్నీ లక్ష్మీ బాయేకాక
ఎవరెష్ట్ శిఖరాలనధిరోహించే
..మొధటి స్త్రీ శక్తి నుండి..
ప్రేమామ్రుతాన్ని పంచే
మదర్ థెర్రీసా వరకు గల
ఎన్నోరుాపాలు వెలికి వస్తాయి.
అవసరాన్ని బట్టి
అమ్మ నుండి అంబ గా గల అన్ని
అవతారాలను ఎత్తగలవు.
నిన్ను నువ్వు గుర్తించు.
నీవుా ఒక నిర్భయ స్ఫుార్తి వై
స్త్రీ శక్తికి నిదర్శనంగా నిలుస్తావు.
------------------------------------
రచన , శ్రీమతి ,
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. ( మహరాష్ట్ర ).
---------------------------
No comments:
Post a Comment