సుమ సందేశం .
--------------------
మల్లెలు ,విరజాజులు, చామంతులు ,మందారాలుా
మేలు బంతి , గులాబి- సంపెంగ పారిజాతాలు ,
ఆమని అందించు సిరులు,
ధన్యులాయెగా తరులుా...
ఏమని చెప్పాయొ వినరె ,
అందమైన పుా...సఖులుా॥॥
తేట తెల్లనైన మనసు, మల్లెవంటి దంటా......
ఆశతో అడుగేయమంటు , చేమంతీ మాటంటా..
బంగారు లోకమే నీదందీ పుాబంతీ..
గుప్పెడంత ప్రేమ పంచి , ఇమ్మంది గులాబీ సఖి ॥
తలదించుకు బతకొద్దనె , జాజీ మహరాణందిీ...
బ్రతికినన్నాళ్ళు- మంచి బాటలో నడువందీ..
జన్మధన్యమయ్యేందుకు దేముని కొలువందీ
పరుల మంచి కోరేటీ , మనిషే మహనీయుడంది..॥॥
రచన , శ్రీమతి,
పుల్లాభట్ల జగదీశ్వరీ ముార్తి.
కల్యాణ్.
No comments:
Post a Comment