Wednesday, October 16, 2019

ఆస్వాశన..( భరోసా. ).

అక్షరాల అలల్లో కొట్టుకు పోతుా-
కవితాంశాల గాధల్లో ,
శాఖోపశాఖలుగా విస్తరిస్తుా-
కలం గళం లో చిక్కుకున్న,
అసహాయ ఆర్తనాదం...
ఆడపిల్ల...॥
ఒకచోట భ్రుాణ హత్యకు లోనైతే,
వేరొకచోట వెలయాలిగా -
యాతనలకు బలౌతోంది.
పసితనం లోనే కామాంధుల
క్రౌర్యానికి లోనై -రక్తపు ముద్దై  
మట్టిలో  కలిసిపోతోంది.॥
యవ్వనదశలో -
యాసిడ్ దాడులకు గురై,
తీరని కలల కొలిమిలో
కాలిపోతోంది.॥
ఇల్లాలిగా ఈతిబాధల 
కడలిలో ,నడి సంద్రపు నావై -
మిగిలిపోతోంది.॥
దురహంకార మ్రుగాళ్ళ-
విడాకుల విధ్వంశ చర్యలకు
రెక్కలు తెగిన పక్షిలా 
విల-విల లాడుతుా విలపిస్తోంది.
అమ్మై ,అక్కై ,చెల్లై  ,
ఆలై , ఆదరించే నెచ్చెలై ,
సహనానికి మారు పేరుగా -
నిలచిన ఆమె బతుకు ,
ప్రతీచోట అవమానింపబడి, ,
వయొాపరిమితి కానని-
మగ మ్రుగాల -
వాసనాక్రుత్యాలకు,
బలవన్మరణాల పేటికల లో
శవమై ఒరిగిపోతోంది.

పసితనం నుండి ,
పండు ముసలి వరకు
కామాంధుల క్రౌర్యానికి  
ఆహుతౌతున్న అబలలారా
మీ కష్టాలనుా  కన్నీళ్ళనుా తుడిచి,
మీకై మేమున్నామని  ఆశ్వాశన నిచ్చే-
ఆపద్బాంధవుడు అవతరించి..,
తెలంగాణా గడ్డపై, ఇచ్చిన భరోసా..
స్థ్రీల సంరక్షణా  వికాశాల జాబితా---
రండి..మీ బాధాస్పద జీవితాలకి-,
స్వస్తి  పలకండి. 
ఆడది అబల కాదు-
సబల అని నిరుపించే ,
ఆదర్శ  "బడికి" హాజరవ్వండి.
స్త్రీల  వికాశమే ప్రగతి పథానికి 
విజయ పథమని
చాటి చెప్పండి॥

రచన ..శ్రీమతి ,
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్..
( మహారాష్ట్ర ).
--------------------



No comments:

Post a Comment