అవిగో....
కామాంధుల కర్కశత్వపు
సాముాహిక బలాత్కారాలకు
నింగికెసిన రక్తపు మరకలు
ఎర్రగా..కణ కణ లాడుతున్నాయి.
ఉధయించే సుార్యుడు
ఉలిక్కి పడేలా...
గర్భంలో నిండిన-
శవాల గుట్టలు చుాచి,
భోరుమన్న భుా మాత-
కార్చే కన్నీళ్ళు , ఏరులై, పొంగి'
భీభత్సవ సునామీలుగా -
మారుతున్నాయి.
ఆక్రోసిస్తున్న అబలల -
ఆర్తనాదాల -ప్రకంపనలతో,
బద్దలౌతున్న భుామాత-
ఒడి ,చీలి , మరుభుామిగా--
మారుతోంది -
అర్ధాంతరంగా అంతమౌతున్న
అమాయక జీవులను
ఉద్ధరించాలన్నా....,
ప్రళయ , భీభత్స , ప్రకంపనల
బాధతో కుంగిపోతున్న-
భుా- భారాన్ని తగ్గించాలన్నా..,
సశ్యశ్యామల -సుందర -
నందనవనంగా, మన-
దేశాన్ని మలచాలన్నా...,
స్త్రీ జాతి ,ఆది శక్తిగా మారి
అరిష్టాలని అరికట్టేందుకు
కంకణం కట్టుకోవాలి.
అభ్యుదయ ఆశయాలతో
ముండడుగు వేస్తుాపోవాలి.
అదుకే..కదలి రండి , .
కేలు -కేలు జత కట్టి-,
తెలంగాణా రక్షక సిబిరాల
సహాయ చర్యలను పొంది,
మీలో ఉన్న స్త్రీ శక్తిని
జాగ్రుతి చేయండి.
స్త్రీ అబల కాదు సబల
అన్నది నిరుాపించండి.
ఆడజాతి పై అమానుష
చర్యల ఉదంతం
అంతం చేయండి .
ఎందుకంటే..
షీ టీమ్స్ సాంతం
స్త్రీల వికాసానికే సొంతం.
తెలంగాణా" ప్రభుత్వ
నవ పథకాల సారం..
మహిళ ల అభివ్రుధ్ధికి
అందిన అసలైన "వరం."
"స్త్రీ శక్తి " వికాశ -
విజయాలకు నిలయం..
"షీ టీమ్స్" , అవే మన -
పురోగమనాలకభయం".
----------------------------------
రచన,
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ ( మహరాష్ట్ర ).
------------------------------
( కేలు కేలు జత కట్టి ).
(ఒకరి చేయి ఒకరు పట్టుకొని )
కేలు = ( k )
తెలంగాణా
( T )
రక్షక చర్యలు..
( R ).
K. T. R గారి పేరు రావాలనే చిన్న ప్రయత్నం..
రచన , శ్రీమతి
జగదీశ్వరీ ముార్తి.
కల్యాణ్ ( మహరాష్ట్ర ).
------------------------------
No comments:
Post a Comment