Thursday, October 3, 2019

మరువలేనురా...క్రిష్ణా...



తెలుగు వెలుగు 

శీర్షిక  : మరువలేనురా...క్రిష్ణా...

ప్రక్రియ : లలిత గీతం

మరువలేనురా...ఈ రేయినీ హాయిని
తరుణ మిదియె నీ... చెలి చేర రారా ॥
క్రిష్ణా.....ఆ....

దరహాస మదే నీ మొామున చిందిన
 విరులు జల్లులై విరివిగ కురియగ
కలువ కన్నియలు కళ కళ లాడగ
మలయమారుతపు మధుర వీచినీ ॥  ॥మరువలేనురా...॥

నీ మధు మురళీ గానము వినగా
 మ్రుదు పద  మంజీర నాద నాట్యముల
గోప కన్నియలె  నిన్ను  చేర...నీ
రాసకేళి  రసనామ్రుత  లీలలు .. ॥ మరువలేనురా...॥

మలయమారుతపు మధుర వీచిలో

గోపకాంతలా విరహ గీతిలో..

కలువల రేడే.... కురియ..వెన్నెలలు

యమునా తటి నీ..  చిలిపి చుాపులను..॥ మరువలేనురా..॥


రచన , శ్రీమతి,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.
---------------------------


No comments:

Post a Comment