అవినీతి నిర్ముాలన పై
నా కవిత, వరుస దొంతరలో
పైనే ఉంది మరి-
ఎప్పుడు చదువుతారో !
చేతులు మారుతున్న కవిత
మారుతున్న ముఖ కవళికలకి ప్రతీక.
మంత్రి నుండి మాముాలు మనిషి వరకు
మాయచేసి మహారధులౌతున్న వారి చిట్టా మరి !
వరుస చుాపుల తుాపులు నాపై-
వేల రుాకల ఇనాము మరి కవిత పై .
కాలం కాటువేసినట్టుంది,
కాలయాపనతో వైద్యం జరుగుతోందక్కడ !
పేరున్న ప్రతినిధులకు
పుాల పుాతల లేపనం.
కాగితాల బొత్తుల్లో -
చుట్ట బడుతున్న ,
మత్తు-మందుకు , ఫలహారం ।
కనికట్టు చేతుల్లో -కరకుగా చిక్కిన
నా కవితా వనిత-
చినిగి , చెదిరిపోయింది ముక్కలై -
కర్కశ శరఘాతాలు తగిలి
నా గుండె ఎప్పుడో పగిలిపోయింది ॥
---------------------------------------------
రచన, శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.
-------------------
No comments:
Post a Comment