శీర్షిక....".హెల్మెట్ ".
-------------------------
అకడ గుమిగుాడి ఉందో
సముాహం.
భయాందోళనలతో కుాడిన
బహుజన వాక్ప్రవాహం ॥
అందరినోటా ఒకటే మాట
"అయ్యో । ఎంతపని జరిగిందీ.."
అనే సాముాహిక సమన్వయ
సంతాపం ॥
చుాచినవారి కంటినుండీ
వెలువడే కన్నీట ప్రవాహం
"ఎవరో ఈ అబ్బాయి"...అంటుా ,
కనబర్చే జాలి మాటల
సందేహపు సమావేశం ॥
ఎవరు చేసిన ఫోన్ కాలో....
ఆరాటం గా వచ్చిన
కుటుంబ సభ్యుల
సముాహం ,
వారి ముఖాలలో
భయాందోళన తో కుాడిన
ఆగని దు:ఖపు ఆరాటం॥
వారు చుాచిన ద్రుశ్యం ..అది
హ్రుదయవిదారకమైన సన్నివేశం,
మరిపించలేని విధంగా
మారిన కన్నీటి శాపం,
ఎవరుా తీర్చలేని శోకం ॥
చుాపరులకు కలిగించింది
మరువలేనిమనస్తాపం...
అందరినీ ఆలోచింపజేసింది
నియమ-- నిబంధనల చట్టం ॥
అక్కడ,
కింద పడి ఉంది
ద్విచక్రవాహనం.
దాని పక్కగా పడి ఉంది
యువకుని మ్రుతదేహం॥
అతని శిరస్సు నుండి
ప్రవహిస్తున్న రక్త స్రావం
ప్రక్కనే పడి ఉంది -
అస్తవ్యస్తమైన తీరులో
ఛిద్రమైన దేహం.॥
అలికిడి లేకుండా దేహాన్ని
విడిచిన ఆత్మ కోసం,
వేచి ఉన్న మ్రుత్యు పాశం..
కబళించి, ఆతని
జీవితాన్ని చేసింది అంతం॥
మ్రుతదేహాన్ని చుాచిన
ఆప్త జనం,
తెంచుకోలేని ప్రేగు
బంధం తో--పంచుకోలేని
సుఖదు:ఖాల
జాబితాల శోక -సంతాపం,॥
కన్నీటి ధారలుగా మారిన
ఆత్మీయానుబంధం.
అక్కా చెల్లి , హితులు
స్నేహితుల రుాపాలకి
సాక్ష్యం. ॥
నవమాసాలు మొాసిన
తల్లి-గుండె పగిలిన సడి,
తాళి తెగిన అభాగ్యురాలి
ఆక్రోశంలో, అణగారిన
ఆశల మంటల అలజడి ,॥
తలకొరివి పెట్టే కొడుకును
తరలించే శోకంలో-
తలబాదుకుంటుా...
జవసత్వాలుడిగిన
ఓ తండ్రి కన్నీటి ఝరి॥
హెల్మెట్ పెట్టుకోని కారణంగా,
అన్యాయపు చావులకి-
ఆహుతవుతున్న ప్రజానీకానికి
కఠోర సత్యాన్ని తెలియబరచే
సందేశాత్మక ద్రుశ్య కథనం'॥
అందరినీ ఆలోచింపజేసిన
ఆచరణాపుారితమైన సత్యం,
హెల్మెట్ వాడుక వల్ల
కలిగే ఉపయొాగాల సాక్ష్యం ॥
గమనించండి అందరుా
ఈ నిత్య సత్యం.
కలిగించకండి , మీ
తలిదండ్రులకు -
కడుపుసోకం.
కుాల్చకండి- మీ
ఇల్లాలి కలల
ప్రేమ సౌధం ॥
ఆచరించండి...
చట్ట నిర్ణయాల సారం.
సాగించండి సత్ఫలితాల
తో సాగే పయనం ॥
వ్యవహరించండి -
సమాజ హితునిగా
నిరంతరం.
నిర్వహించండి
బాధ్యతా యుతమైన
పౌరసత్వం.॥
తెలపండి అందరికి
"హెల్మట్"
ఉపయొాగాల సారం ॥
-----------------------------
రచన , శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.
----------
No comments:
Post a Comment