స్త్రీ శక్తి .
అడుగడుగునా, అవమానాలతొో,
అంతరంగంలో రగిలిన --ఆరని మంటలకు
కారిన ఆమె కన్నీరు, సునామీలు గా మారి నగరాలని కబళిస్తున్నాయి.
అంగాంగ శోషణకు , బాధతో తల్లడిల్లి-
ఉప్పొంగిన హ్రదయాక్రోశపుటలలు-,
తీరం చేరి , నురగలుగా మారిన వైనం,
ఆమె అసహాయత్వానికి సాక్ష్యం॥
పుట్టిన పసికందు నైనా.,పండుముసలినైనా
పెళ్ళైన కాంతనైనా , పరువం నిండిన పడతినైనా
కామంనిండిన కళ్ళతో చుాచే..మ్రుగాళ్ళ రాక్షసత్వానికి , బలై పోతున్న శక్తిహీనుల
రక్తశ్రావపు ఝరులు ప్రళయాన్ని సుాచిస్తున్నాయి.
గ్రుహ నిర్బంధ గ్రహణాలు,
కట్న పిశాచాల వేధింపు చావులు,
విడాకు తీర్పుల విషపు కోరల కోర్బాలు,,
భ్రుాణ హత్యల వంటి హేయ చర్యల పాపాలకి
భుామి కంపించి బద్దలెైపొోతొోంది.
కామాంధుల కాట్లకు బలైన వసి వాడని ,
పసి కుానల దుర్వాసనాపుారిత శవాల
దుర్గంధం , మహమ్మారిగా మారి మనుషుల
శరిీరాలని శవాలుగా మారుస్తొోంది..
.ఇలాఇంకా ఇంకా అరాచకాలు
పెరగకముందే...స్త్రీ శక్తిని నిరుాపించుకోండి
మీకు అండగా వెన్నంటి ఉండెే
స్త్రీల సంరక్షణాకెేంద్రాల ..సహాయక
చర్యలను అందుకొోండి.
రండి ..అడుగు ముందుకేయండి
సమ సమాజానికి నాందిగా..
నవలోకం శ్రుష్టించండి...
స్త్రీ " శక్తి " అని నిరుాపించండి.
--------------------------
రచన ..శ్రిీమతి ,
జగదిీశ్వరిీముార్తి
కల్యాణ్.
No comments:
Post a Comment