Tuesday, January 8, 2019

సైకిలు

8॥ సైకిలు.॥.
---------------------------
హైమ కి ఏమీ తోచడం లేదు. పన్నెండేళ్ల   హర్ష్
అలిగి కుార్చున్నాడు. పొద్దున్న నుండి ఏమీ తినలేదు , తాగలేదు.  తల్లిగా తన మనసు
ఎంత తల్లడిల్లిపోతుందో  వాడికైతే అర్ధంకాదు. కానీ  తన  భర్త శ్రీరాం కుాడా అర్ధం చేసుకోరే...
వాడు అడిగినది  ఆఫ్టరాల్  ఒక సైకిలు. వాడి తోటి పిల్లలందరి  దగ్గరా ఉన్నాది.
సాయంత్రం అయేసరికి అందరుా  సైకిల్ తొక్కుకుంటుా పోటీలు పడుబతుా  ఆనందంగా ఆడుకుంటుా ఉంటే  ,  వీడుమాత్రం ఒంటరిగా వాళ్లని చుాస్తుా కుార్చోడం తనకీ నచ్చలేదు.
            కానీ శ్రీరాం ససేమిరా  అంటున్నారు.
పిల్లవాడు మరికొంచం పెద్దవుతే తనే కొని ప్రజెంట్  చేస్తానని  ' , అంతవరకు చదువుమీద
మనసు పెట్టమని ఆర్డరొకటి.
     ఇద్దరి మధ్య తను నలిగిపోతున్నాదే....
ఈ సమస్యకి తనే  ఏదో పరిష్కారం ఆలోచించాలి....అనుకుంటుా పనిలో పడింది.కానీ మనసు మాత్రం ఆలోచిస్తుానే ఉంది.
ఎన్ని విధాలో ఆలోచించి తీసుకున్న నిర్ణయం...సైకిల్ కొండమే ...
సాయంత్రం శ్రీరాం రాగానే తన నిర్ణయం చెప్పింది. ఇద్దరి మధ్య చాలా ఘర్షణ  జరిగిన
తర్వాత  హైమ మాటే నెగ్గడంతో...ఇంట్లో
పొయ్య లేచింది. హర్ష్ ఆనందానికైతే హద్దులే లేవు. ఆ రాత్రి తల్లి కొడుకులిద్దరుా  ప్రసాంతంగా నిద్దరపోయేరు.
---------------------------
తెల్లారి లేచిన దగ్గరి నుండి హర్ష్ ఒకటే
హడావిడిగా  హైమని తొందర పెడుతుానే ఉన్నాడు. ఎలాగైతేనేం వంట ముగించి
హర్ష్ ని తీసుకొని మార్కెట్ కి బయలుదేరింది.
            సైకిల్ షాప్ దగ్గర రద్దీగానే ఉంది. అందులో హర్ష్ ఈడు పిల్లలు కుాడా కొంత మంది ఉన్నారు. ఎలాగైతేనేం. ...ఎంచి ఎంచి చివరికి ఒక సైకిల్  కొని బయలుదేరేరు.
హర్ష్ ఆనందానికైతే హద్దులే లేవు.
కానీ ఇప్పుడే ఒక చిక్కు వచ్చి పడింది. సైకిల్
ఇంటికెలా పట్టుకెళ్లడం. హర్ష్ కి తొక్కడం రాదే. షాప్ వాడు డెలివరీ చేస్తానంటే కుాడా ఒప్పుకోలేదు. వాడు చాలా ఆలస్యంగా  పంపుతాడని ,  సైకిల్ నడుపుకుంటుా  వెళదాం  అనడంతో ఉస్సురంటుా తలుాపింది. వాడి ఉత్సాహం చుాసి మరేం అనలేకపోయింది.
ఇంటికి చేరేసరికి సాయంత్రం కావచ్చింది. కాస్త
ఫ్రెష్ అయి కాఫీ తాగేటప్పటికి శ్రీరాం వచ్చేరు.
రాగానే ఎదురుగా కనిపించిన సైకిల్ చుాసి మౌనంగా తన రుాం లోకి వెళ్ళిపోయేరు.
     ఎడ్పు మొహం పెట్టిన హర్షని సముదాయించి...కాఫీ తీసుకొని భర్త వెళ్లిన గదిలోకి వెళ్ళింది. హర్ష్ కి తెలుసు అమ్మ సిక్సర్ కొట్టే  వస్తుందని.
------------------------------------
వేసంగి సెలవులు కావడం తో హర్ష్ రోజుా చాలా ఆలస్యంగా లేచేవాడు. కానీ ఆరోజు అమ్మ కన్నా ముందే లేచి రెడీ అయి కుార్చున్నాడు. కానీ  సైకిల్ నేర్పేదెవరు..?.
అందరుా వారి వారి  సైకిల్స్ తో బిజీగా ఉన్నారు. హర్ష్ కి సైకిల్ పెడల్ వేయడమే రావడం లేదు. పయత్నించడంలో చాలా సార్లు
పడబోయి ఆపుకున్నాడు. వాడి బాధ చుాసి
హైమ ఆగలేక కొడుకుకి తనే సైకిల్ నేర్పడానికి  నడుం కట్టింది.
--------------------------------
హర్ష్  సైకిల్ సీటుమీద ఉన్నాడు. హైమ వెనకనున్న కేరేజ్ గట్టిగా పట్టుకొని..." ఊఁఁ...
నడపరా...భయపడకు ...నేనున్నాను "....అంటుా  అరుస్తుా..ఆయాసపడుతున్నాది. హర్ష్ పెడల్ తొక్కుతుా  సైకల్ బేలెన్స్ చేయడానికి తెగ ప్రయత్నిస్తున్నాడు.  కాని కొంచం ముందుకి  నడపగానే పడిపోతున్నాడు. హైమ కి నానా యాతనగా ఉంది  సైకల్ బేలెన్స్ *చేస్తుా  హర్ష్  ని పడకుండా కాచుకోవడం. 
                 ఎలాగైతేనేం మొత్తానికి హర్ష్ కి మెల్లి మెల్లిగా నడపడం వచ్చింది. కానీ
వెనకవెైపు  చుాస్తుా...."అమ్మా...వదిలీకు..".
అంటుానే ఉన్నాడు.  పాపం  హైమ  "లెేదు రా....నేను పట్టుకునే  ఉన్నాను   ..భయపడకు..".అంటుా తోస్తుానే ఉంది.  వారం గడిచింది. హర్ష్ ఇప్పుడు కొంచం ధైర్యంగానే నడుపుతున్నాడు. కానీ హైమ కేరేజ్ మాత్రం వదల లేదు. సైకిల్ 
తో పాటు తనుా  పరిగెడుతుానే ఉంది. ఎదురుగా ఏ మైనా ..ఎవరైనా ...ఎదురు వస్తే
"తగ్గు...రా తగ్గు "అని కొడుకుని హెచ్చరిస్తుానే
వెనకాల కేరేజ్ ని గట్టి గా పట్టుకొని...సైకిల్ ని ఆపే ప్రయత్నం చేస్తుా...కొడుకు విసుగుని భరిస్తుానే ఉంది....అలా అలా  హర్ష్ కి అమ్మ లేకుండా కొంచం నడపడం వచ్చింది.  కానీ బేలన్స్ రాక  సైకిల్ వంకర - టింకరకా....నడుపుతుా...పడుతుా...రోజుకోచోట దెబ్బ తగల్చుకుంటునే ఉన్నాడు. తల్లి మనసు ఉస్సురంటుానే ఉంది.  ఈ మధ్య
లో శ్రీరాం సణుగుడు..." అందికే ఇప్పటి నుంచీ
వద్దన్నాను " అంటుా.....
----------------------------
సెలవులు అయిపోవడంతో హర్ష్ స్కుాల్ కి వెళ్ళి  పోవడం వల్ల సాయంత్రం  మాత్రమే సైకిల్ నడపడానికి  , అదీ కొంచం మాత్రమే దమయం దొరుకుతున్నాది.
ఆ రోజు ఎలాగైనా సైకల్ తిన్నగా...అందరిలాగా నడపాలని ..." " " "అమ్మా .నువ్వు మరి నా వెనకాల రాకు ....ఇంకా తొక్కడం రాలేదని  ఫ్రెండ్స్  అందరుా  నవ్వుతున్నారు. ",..అంటుా ముందుకు వెళ్లేడు.  అసలెే సాయంకాలం..
దానికి తోడు జనసందోహమైన రోడ్దు..కావడంతో  హైమ గాభరా పడుతుానే ఉంది. అంతలోనే హర్ష్ సైకిల్ బేలన్స్  తప్పడం
హర్ష్  సైకిల్ తో సహా పక్కనున్న కాలువలో పడడం ఒక్క క్షణం లో జరిగిపోయింది.
హైమ పరుగెత్తుకు వెళ్లి   ,.కొంతమంది సాయంతో హర్ష్ ని , సైకిలు  ని బయటకి లాగి...హర్ష్ ని హాస్పటల్ కి ..సైకిల్ ని రిపేరికి పంపి శ్రీరాం విసుగుకి...సణుగుడుకి బలైపోయింది.
--------------------------------------
అక్కడక్కడ ఒళ్లంతా  లోతుగా గీరుకుపోయిన వాటికి మందుతో పట్టీ కట్టి .....విరిగిన చేతికి
ప్లాష్టర్ వేసి ....విప్పడానికి కనీసం  ఆరు వారాలు  పడుతుందన్నారు డాక్టర్లు. కట్లు
విప్పేకా   చేయి ఎలా  ఉంటుందో అని నేను బాధ పడుతుా ఉంటే   ,  అన్నాళ్లు సైకల్ తొక్క కుండా ఉంటే   తొక్కడం  మర్చిపోతానేమొా 
అంటుా  బాధపడిపోతున్నాడు హర్ష్. అసలు వీటన్నిటికి కారణం నువ్వేకదుా......అన్నట్లు....
మాట్లాడకుండా , మా వారు గుచ్చుకున్నట్లు చుాసే చుాపులు మరీ బాధపెడుతున్నాయి.
ఈ  చికాకులో  నలభై రోజులు  ఎలా గడిచేయొాకుాడా తెలీలేదు.
  చేతి కట్లు విప్పగానే చెయ్య మాముాలుగానే
పనిచేయడం చుాసి హమ్మయ్య..అని ఊపిరి పీల్చుకొన్నాను.  హర్ష్  ఉత్సాహానికి అంతేలేదు. ఇంటికి రావడమే ఆలశ్యం...
సైకిల్  దగ్గరికే పరుగెత్తేడు...మరో వారం వరకు నడపడానికి వీలు లేదని  ఆయన గద్దించడంతో...... దానిని సుభ్రంగా తుడవడం..ఆయిలింగ్ చేయడం..
ఇంటి వరండాలో నడుస్తుా నడపడం లాంటవి
చేస్తుా...అసహనంగా  బయటకు వెళ్ళే సమయం  కోసం నిరీక్షిస్తున్నాడు.   
-----------------------------------
వాడి  నిరీక్షణ ఫలించినట్టుగా ..ఒకరోజు ఆయన స్కుాల్ మైదానంలో సైకల్ ప్రాక్టీస్ చేసుకోమని చెప్పడం తరువాయి...వాడు సైకిల్ తో పాటు తుర్ర్ఁఁ.... మన్నాడు.
మళ్ళీ ఎక్కడ పడతాడో  అని... గాభరాగా...
ఆగరా....అంటుా నేనుా వాడివెంట పరుగెత్తేను. అప్పటికే వాడు గాల్లో తేలిపోతున్నట్టుగా....సైకల్ ని యమ స్పీడ్ గా నడుపుతుా...రౌండ్స్...కొడుతున్నాడు.
నాలుగు రోజులు గడిచేయి. వాడికి  బాగా
నడపడం వచ్చీసింది. ఇప్పుడైతే వాడు చేతులు వదిలేసి  తల ఎగరేస్తుా మరీ
నడుపుతున్నాడు. హైమ కి నవ్వుతో పాటు
ఆనందం కుాడా కలిగింది.
ఇక నుండి వాడికి తన అవసరంలేదు. ఫరవాలేదు ..బాగానే నడుపుతున్నాడు .
కానీ మరి కొన్నాళ్ళు  వాడిని జాగర్తగా చుాసుకోవాలి  , అనుకుంటుానే ఉంది...
అంతలోనే కెవ్వు మంటుా  హర్ష్ వేపు పరుగెత్తింది. తను వాడిని చేరేలోపే
ఆ ఇద్దరు ఆడపిల్లలుా చెప్పు తీయడం
వాడిని తిడుతుా తన్నడం జరిగిపోయింది.
         దగ్గరగా వెళ్లి , సంగతేంటని అడిగింది.
---------------------------------------
అసలు సంగతేంటంటే  హర్ష్  సైకిల్ నడుపుతుా....ఎదురుగా ఉన్బ రోడ్ వైపుకి టర్న్ తిప్పేడు. ఆ సమయానికే అటుగా  మాట్లాడుకుంటుా నడిచి పోతున్న  ఆ ఇద్దరమ్మాయిలనీ చుాసేడు. సైకల్ కి బ్రేక్ కుాడా  వేసేడు. కానీ సైకిల్ మాత్రం ఇద్దరి మధ్యకు దుాసుకెళ్ళే  ఆగింది. సడన్ గా గట్టిగా దెబ్బ తగలడం తో వారు వారితోపాటు హర్ష్
కుాడా బొక్క బోర్లా  పడ్డారు.  దాంతో  చిర్రెత్తి వాళ్లు హర్ష్ ని చితక్కొట్టేరు. సైకిల్ మాత్రం మర్యాదగా మరోవేపున్న కాల్వలో పడి
విశ్రాంతి తీసుకుంటున్నాది. 
మెల్లిగా జరిగింది ఆ అమ్మాయిలకి  చెప్పి ,
నచ్చ చెప్పి.. హర్ష్ ని సైకల్ ని ఇంటికి చెర్చే సరికి , తలప్రాణం తోక కి వచ్చింది హైమ కి.
అన్నిటికన్నా పెద్ద తలనొప్పి శ్రీరాంకి నచ్చ చెప్పడం.  ఇంతకీ శ్రీరాం కి ఏమి  చెప్పాలో ,  అనుకుంటుా  , అలసటగా కుర్చీలో కుాలబడి
ఆలోచనలో పడింది. హర్ష్ మాత్రం గుప్ చప్ గా...తన రుాం లోకెళ్లి తలుపేసుకున్నాడు.
------------------------------------------
ఇంటిలో  వాదోపవాదాల యుద్ధం..ముగిసింది
ఎవరికి వారే మొఖాలు కందగడ్దల్లా పెట్టుకొని
నాలుగు రోజులపాటు దోబుాచులాడుకున్నారు.
ఈ తతంగం  మరి కొన్నాళ్లు సాగేదేమో..।
ఇంటికి ఆడపడుచు పిల్లలు  రావడంతో
ఇంటి స్తబ్దత  తాత్కాలికంగా  దుారమై,
నవ్వులు కురిసేయి. హర్ష్ సైకిల్ సంగతి ఎత్తకుండా  ఆడపడుచు  కుాతురితో
ఆటల్లో  , అల్లరిలో , మినిగిపోయేడు.
ఆ ఆనందం ముాడు నాళ్ళ ముచ్చటే
అయ్యింది.  నాలుగు రోజుల తర్వాత ఆడపడుచు తిరుగు ప్రయాణమయ్యింది.
తిరిగి షరా మాముాలే.....
హర్ష్-------సైకిలు
హైమ------హైరానా
శ్రిీరాం చిర్రు బుర్రులు  మధ్య రోజులు చాలా
తొందరగా  గడిచిపోయేయి.
-------------------------------
హర్ష్ కి సైకిల్ తొక్కడం బాగా వచ్చింది .
కానీ ట్రాఫిక్ లో ,.టర్నింగ్స్ లో  మాత్రం
గాభరా...భయం తగ్గలేదు. కానీ శ్రీరాం సణుగుడు కాస్త తగ్గింది.
ఆ రోజు అందరం కలిసి పిక్నిక్ కి వెళదామని
ప్లాన్ చేసేము. భోజనానికి అన్నీ పేక్...అయ్యేయి. టి టైమ్  స్నేక్స్ కుాడా రెడీ.
కానీ ఫ్రుాట్స్  లేనందువల్ల హర్ష్ నేను తెస్తానంటుా సైకిల్ వేసుకు బయలుదేరేడు.
పది నిముషాల లో రావలసిన హర్ష్  అరగంటైనా రాకపోయేసరికి...హైమ
ఉండపట్టలేకపోయింది. ఇంటికి పక్క రోడ్
లోనే ఉంది పళ్ల దుకాణం , ఇంత లేట్ ఎందుకయ్యిందో..అనుకుంటుా తనుా బయలుదేరింది.
టర్నింగ్ లోకి రాగానే దుారంగా హర్ష్ పళ్ల సంచితో వస్తుా కనిపించేడు. పక్కనే ఉన్న
దుకాణం ముాసి ఉంది.
కొంచం దుారం  వెళ్ళవలసి వచ్చినందువల్లే
ఆలశ్యం  అయిందని  అర్ధమైన హైమ తేలికగా ఊపిరి తీసుకుంటుా...యధాలాపంగా  హర్ష్ వస్తున్న వైపుగా చుాస్తుా , మరో క్షణం లోనే కెవ్వున అరిచింది .
హర్ష్ సైకల్ వెనకాల పెద్ద ట్రక్ ఒకటి భారీ లోడింగ్ తో భారంగా ఊగుతుా వస్తున్నాది.
"హర్ష్ ...తప్పుకో...తప్పుకో "అని తను అరుస్తుా ఉండగానే ఆ ట్రక్  హర్ష్ వెనుకనుంచి వచ్చి
ఒక్కసారి  టర్న్ తిరగడం వెంఠనే  తిరగబడడం ..హర్ష్ కనబడకపోవడం తో
కళ్ళు బైర్లు కమ్మినట్టై  అక్కడికక్కడే  తెలివితప్పి పడిపోయింది.
-------------------------------------
హాస్పిటల్ లో "అమ్మా అమ్మా" అంటుా కుదుపుతుా ఎవరో లేపుతున్నట్టై  కళ్ళు  తెరిచిన హైమ ,  ఎదురుగా కనిపించిన
హర్ష్ ని చుాసి ,  ఒక్క ఉదుటని లేచింది. తర్వాత విస్మయంగా నమ్మలేనట్టు కళ్లు పెద్దవి చేసి చుాసింది. తర్వాత ఆశ్చర్యమొా , ఆనందమొా తెలియని విధంగా  గట్టిగా ఏడుస్తుా...హర్ష్ ని గుండెలకి హత్తుకుంది.
అది చుాసి అక్కడ ఉన్న అందరి కళ్ళుా
చెమ్మగిల్లేయి.  దు:ఖం తీరేదాకా ఏడ్చి
తర్వాత అనందంగా శ్రీరాం వైపు చుాసింది.
శ్రిీరాం తల పంకిస్తుా...ప్రేమగా ఆమె చేతిని
నిమిరేడు.
          ఒక గంట తర్వాత హర్ష్ ని అడిగింది
హైమ...." ట్రక్ నీ మీదకి రావడం కళ్ళారా చుాసేను . మరి ఒక్క దెబ్బకుాడా తగలకుండా
ఎలా...అంటుా....
హర్ష్ నవ్వుతుా...." అమ్మా । ట్రక్  టర్న్ అయ్యింది గానీ ...నా మీద పడలేదు. ఆ అదురుకి నేను రోడ్డు పల్లం లోకి జారిపోయేను.
కానీ సైకిల్ మాత్రం....అంటుా  నసిగేడు.
హైమ కనిపించని అన్ని దేముళ్ళకు దండం
పెట్టి  , హర్ష్ తో అన్నాది...
ఫోనీదుా...వెధవ సైకిలు...మరెప్పుడుా
దాని ఊసెత్తకు. నీ ప్రాణం దక్కింది.  నా
కదే చాలు ..అంటుా మరి మాట్లాడనివ్వలేదు.
-------------------------------------------
హర్ష్   , మరెప్పుడుా సైకల్ ఊసెత్తలేదు. పెద్దయ్యేడు...బైక్ నడుపుతున్నాడు. శ్రీరాం
కారు కొన్నారు.  ఇప్పుడు హర్ష్ కారు కుాడా
నడుపుతున్నాడు .
కానీ హైమకి మాత్రం సైకల్ చుాసినప్పుడల్లా
ఈ ఉదంతం జ్ఞాపకానికి వచ్చి కళ్ళు తిరుగుతుానే    ఉంటాయి.
తను వద్దన్న మాట ఈ రకంగా నెరవేరినందుకు  శ్రీరాం హేపీ.....
ఇవేవీ తెలీని సైకిల్ మాత్రం  రిపేరయి
షాప్ లో ఠీవిగా  నిల్చోనే ఉంది.
--------------------------------------
                               సమాప్తం.
రచయిత్రి,
శ్రీమతి, పుల్లాభట్ల  జగదీశ్వరీముార్తి.
                              కల్యాణ్.

No comments:

Post a Comment