మహరాష్ట్ర లో తెలుగు వైభవం.(1)
--------------------------------------------.
చాలీ చాలని జీతం తో
రాజీ పడలేని జీవితానికి
అభయమిచ్చే ఆనందపురం
మహరాష్ట్ర రాజధాని
((ముంబయ్ నగరం..।॥
మహారాష్ట్ర లో అడుగిడిన క్షణం
తెలుగువాడిగా మనగలనా అన్న భయం.
అన్నా పిలుపుతో ఆత్మీయానుబంధం
సమానత్వానికి నిండు నిదర్శనం ॥
అడుగడుగునా తెలుగుదనం
తెలుగు సభల తో వెలిగిన
సాంస్క్రుతిక , సంగీతాల
సమన్వయ వేడుకల తోరణం ॥
తెలుగు పండగల వెలుగు వైభవం
పసుపు కుంకుమల పచ్చ తోరణం.
ముగురమ్మల శుభ మంగళ గీతాల
తెలుగు శోభలతో వెలుగు సు ధామం.॥
గణపతి రాయని ఘన స్వాగతంతో
నవదుర్గల శుభ యాగ పోషణం
దీపావళుల వరుస దేవెనల
అక్క, చెల్లెళ్లింట ఆనంద భోజనం...॥
అన్నా టిఫిన్స్ నుండి , అంగడి వరకు
తెలుగు రుచుల నిడు తీపి భోజనం
పేదా గొప్పల తేడా లేదు
బ్రతుకు తెరువు కిట కరువే లేదు ॥
చదువుల బడిలో , దేవుని గుడిలో
పదవుల పరుగులో ,పలు రంగాలలో
" మహరాష్ట్రాలో తెలుగు వైభవం "
సాధించిన తొలి ఘనత ప్రాభవం॥
అమ్చీ ముంబై....అమ్మ ఒడి
అనుభవాల చదువులను నేర్పు బడి
అన్ని భాషలకు ఆలంబన నిడు
ఆత్మ బాంధవుల అభయ పురి ॥
--------------------------------------------
రచన, శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్.
No comments:
Post a Comment