Friday, January 18, 2019

మహారాష్ట్ర లో తెలుగు వైభవం

అమ్చీ ముంబాయ్.
--------------------------
చాలీ చాలని జీతం తో
రాజీ పడలేని జీవితానికి
అభయమిచ్చే ఆనందపురం
మహారాష్ట్రయే  మనకొక వరం ॥

మహారాష్ట్ర లో అడుగిడిన ఆనందం
ముంబై నగరం పై  తరగని మమకారం
అన్నా పిలుపులతో ఆత్మీయానుబంధం
సమానత్వానికి నిండు నిదర్శనం ॥

అడుగడుగునా తెలుగుదనపు పచ్చదనం
తెలుగు సభల పరిమళాల సుగంధం
సాంస్క్రుతిక , సంగీత, సాహిత్యాల
సమన్వయపు వేడుకల తోరణాల అందం ॥

తెలుగు పండగల  నుాతన శోభలు  
పసుపు కుంకుమల పసిడి  తోరణాలు.
ముగురమ్మల శుభ మంగళ గీతాల
తెలుగు వెలుగుల  వైభోగాలు ॥

గణపతి రాయని  ఘన స్వాగతంతో
నవదుర్గల శుభ యాగ, పుాజలు
దీపావళుల వరుస దేవెనల
అక్క, చెల్లెళ్లింట ఆనంద  భోజనం...॥

అన్నా టిఫిన్స్ నుండి , అంగడి వరకు
రెష్టారెంట్ల నుండి ..ష్టార్ హోటల్స్ వరకు
తెలుగు రుచుల నిడు తీపి భోజనాలు..
తెలుగు వాడి  ప్రతిభ నేలు ప్రశంశా పాకాలు ॥

పేదా గొప్పల తేడా లేదు
జాతి మతాల జాడ్యం లేదు
చదువు లేకున్న భయమే లేదు
బ్రతుకు తెరువు కిట కరువే లేదు ॥

చదువుల బడిలో , దేవుని గుడిలో
పదవుల వేటలో ,పలు రంగాలలో
మహరాష్ట్రాలో  ' తెలుగు వైభవం
సాధించెను  ఘనమైన  ప్రాభవం॥

అమ్చీ ముంబై....అమ్మ ఒడి
అనుభవ విద్యల నేర్పు బడి
అన్ని  జాతులకు ఆలంబన నిడు
ఆత్మ బాంధవుల  అభయ పురి ॥

--------------------------------------------
రచన, శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి   ,
           కల్యాణ్  .
----------------------------------------------

No comments:

Post a Comment