వందనాలు గోనుమయ్యా ,
బొజ్జ గణపతయ్యా
ఇందు ధరుని సుకుమారా ,
రారా ముద్దుల బాలా ॥
దంతి ముఖా ' దానవ గణ
భంజకా భవా శుభా..
ఎంచ నీకు సాటెవరుర
సర్వ విఘ్న నాశకా....
ముాషిక వాహన మెక్కి
ముజ్జగముల నేలుసామి
మొదటి పుాజ లందు దేవ
ముదముగ మము కావరార ॥
షణ్ముఖ సోదర సౌర్యా...
సాధు జనా శ్రిత సఖా
సన్నుత గణతతి , గుణపతి
వందిత ఘన నాయకా...
లంబోదర గాన లోల
గౌరీ ప్రియ నందనా
గం గం గం గణపతి
శుభ మంత్రార్చిత పరిపుార్ణా ॥
----------------------------------------
రచన .: శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.
-----------------------------
No comments:
Post a Comment