మహారాష్ట్రా ఆమని..
--------------------------------
చదివిన చదువుకి దోరికిన ఉద్యోగానికి
సంబంధం లేని జీవితాలు
అప్లై చేసినది ఆరువేల మంది అయితే
అద్రుష్టం వరించినది ఆరుగురికే॥
వారిది బ్రతుకు తెరువు త్రుప్తి '
మిగిలిన వారిలో చావలేని విరక్తి.
కుాలిన ఆశలని , అవమానాల
అసహాయతని ముాట కట్టుకొని ,
బతుకుతెరువు కోసం ,
బహుదుారపు ప్రయాణం ॥
సన్నిహితుల
సముదాయింపుల సారం
ముంబయ్ మహానగరానికి
ఆశల పయనం ॥
అడుగు పెట్టినంతనే
అదిరిపడిన అంతరంగం ,
ఎదుట అలలై పొంగి ,
హోరెత్తే జనసముద్రం ॥
పగలుా రాత్రీ తేడా తెలీని
ఆర్ధిక ఆశల రద్దీ పేట
ముంబాయ్ నగరం ,
నా లాంటి వారికి వరాల వేట ॥
తెలుగు మాట ప్రతి చోట. ...
తెలుగు పలుకు ప్రతి నోట...
అన్ని కళలనుా ఆదరంచే
అందాల పుాదోట ॥
బంగరు కాంతుల బల్బుల తోరణం
బజారు ముాయని మాయా జీవనం
చదివిన వారికీ , చదవని వారికి
బ్రతుకు తెరువు ల బంగారు బాట.॥
కరువు లేని కడుపులు ,
కాయ కష్టపు బతుకులు...
కలిసి మెలిసే పిలుపులు .,
ఆదరించే వలపులు..॥
వారి భాష మరాఠీ అన్నది
తెలుగు వారి పాలిటి పెన్నిధి అది..॥
అమ్చీ ముంబై శుభ యాత్రా ,
అదే వెలుగులు పంచే మహరాష్ట్ర ॥
------------------------
రచన...శ్రీమతి
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.
--------------------------------------------
No comments:
Post a Comment