[26/11 13:07] Iswari Murthy:
-
శ్రీకారం.
---------------------------------
ఆకాశంలో గ్రహ కుాటమి ఒకచోట చేరి
భుాలోకంలో ఉన్న ఒక తీవ్రమైన
సమస్య పై చర్చలు సాగిస్తోంది.
వారు చర్చించే వాటిల్లో కళలున్నాయి,
కళాకారులున్నారు. కధలున్నాయి,
కవితలున్నాయి. మట్టిబ్రతుకులు -
నిరక్షరాస్యతతో కుాడిన-
బాధాపుారిత గాధలు , ఉన్నాయి .
కుళ్ళు కుతంత్రాల -
అణచివేతల ఆవేదనుంది.
అనర్హతాపుారితుల సన్మానపు
సారహీన కవితా సంకలనాల
సరుకులున్నాయి.
తెలుగు గడ్డ పై పుట్టి, తెలుగునే
నమ్ముకొనే తెలుగుభాషా కోవిదుల
కవితాసంకలనాల గుర్తింపులేని
అక్షరతోరణ ఆవేశపు చర్చలున్నాయి
ఈ సమశ్యలన్నిటి పరుష్కారానికి
తుది నిర్ణయంగా , చేర్చబడిన
మరో గ్రహమే "" క్రియేటవ్ ప్లేనెట్ ".
[26/11 13:07] Iswari Murthy: శ్రీకారం కవిత రెండవ భాగం.
---------------------------------------
అదు ఒక ప్రత్యేక గ్రహం .అన్ని గ్రహాల
అనుమతితో , దివినుండి భువికి దిగి
అక్షర యజ్నానికి " శ్రీకారం "చుట్టింది.
ఈ యజ్ఞాన్ని సక్రమంగా నిర్వర్తించగలిగే"
నిష్కర్షపు భావర్షిని , సాహిత్య శారధిగా నియమించుకుంది.
భుాలోకంలో ఉన్న ప్రతీ కళాకారునికీ
సాదర ఆహ్వానం పలికి -
"అక్షర యజ్ఞానికి " ఆయాత్తమయింది.
మట్టి మనుష్యుల మహోజ్వల
భవిష్యత్తుకి మహోన్నతమైన బాట
వేసే ప్రయత్నానికి నాందిగా, "మాహాసభ "
వేదికపై అక్షర యజ్ఞానికి ,
అరంభ శ్రీకారం చుట్టింది.
ఫలితం-,
నిరంతర సాధనాపుారిత
సాముాహిక సైన్యం....చేసే
సంస్కారాక్షర సేద్యంతో...
అక్షరబ్రహ్మల వ్యక్తిత్వాన్ని
అందలమెక్కి్చే ఆరాధనా పుారిత
"శ్రీకారాక్షర యజ్ఞం."...ఇది
ఇక ఎన్నటికీ ఆగని
సార సౌరభాల -
సాహిత్యోద్యమ సేద్యం.
----------------------------
రచన.
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.
No comments:
Post a Comment