Monday, February 28, 2022

మాతృభాష కవితల విజేతలు


పేరు.  వజ్రాల ఇందిర   (1st place )
అంశం తెలుగు భాషకొరకూ
ప్రక్రియ.  వచనకవీత
శీర్షిక.  మాతెలుగుతల్లికీ

పదానీకీ పాదాభీవందనంచేసా
అక్షరమై ఆశీర్వదించిందీ
ఆలోచనలను అక్షరం చేసా
అంతరంగాన్ని కదిలించిందీ
చిందర వందర
గందరగోళంలో
అక్షరాలన్నీఏరీకూర్చాను
మాతెలుగుతల్లికీ
మరుమల్లె దండైంది
అక్షరార్చన చేస్తే
కాగడై వెలిగిందీ
మామంచితెలుగుకూ
మంగళహారతి పాడతాను
పల్లకినెక్కీంచీ పదీవూళ్లు తిప్పాలనీవుందీ
బోయనై నిన్ను నా
భుజస్కందాలపై 
మోస్తాను
మనుచరిత్ర తో మనసును
పునీతను చేసుకుంటాను
ఆముక్తమాల్యద తో
ఎద ఎదను తట్టీలేపుతాను
మరుగున పడిపోతున్నా
సంస్త్రతాంద్రలతో
సహజీవనంచేస్తాను
పెద్ద బాల శిక్ష మీద
కక్షగట్టిన వాళ్లాందరిరీమీదా
హృదయపీఠీకరాస్తాను
తెలుగు వాచకం వీచికలతో
ఒక తుషార వసంతమై
ఆడతాను
తాళపత్ర గ్రంథాలు
సోయగాలుకూ
స్వర్ణ తాపటంచేస్తాను
మానవాళీ తీర్చీదిద్ధీన
మానస సరోవరం నా
సుస్వరాక్షరార్చనచేస్తాను
పద్యం గద్యం తో 
సేద్యం చేసీ
పదాలపంటలు
పండీస్తాను
నేనన్నవేళలా
నాతెలుగు భాషకూ
దాసోహమంటాను
మాతెలుగుతల్లీకీ
పదాలపట్టాభీషేకం
చేస్తాను

ఈవచనకవిత నాస్వీయరచన
అనీ హామీ ఇస్తున్నాను
వజ్రాల ఇందిర🙏🏻

[2/21, 16:31] +91 94923 39689: పేరు:గుంటూరు లక్ష్మణరావు*
*ఊరు:టి అర్జాపురం విశాఖపట్నం జిల్లా*
*ప్రక్రియ:వచనం*
*శీర్షిక:అమ్మ భాషలో ....(*3rd)

*అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలతో*
💐💐💐🌷🌷🌷

నేలతల్లి చేర్చుకొనగ
కన్నతల్లి దూరమాయెను
విన్నకథలు ఊరడించగ
జోలపాటలు సేదదీర్చెను!

కంటిచూపు మందగించెను
పరభాషలు గేలిజేసెను
అమ్మ భాష ఆదరించగ
కడుపునింపెడి కూడుదొరికెను!

మమకారాన్ని చంపుకొని,
ఉన్న ఊరిని, 
మాతృభాషను వొదిలి పెట్టి,
ఆత్మీయత,అభిమానాలను
కాలదన్నుకుని,
నే,నగరానికి జేరలేను!

కన్నతల్లిని మరువలేను
అమ్మ భాషను విడువలేను
గడచిన కాలంగా 
ఆటుపోట్లకెదురొడ్డి
అమ్మ భాషలో 
అమ్మను చూస్తున్నా!

*ఇది నా స్వీయరచన దేనికి అనువాదం కాదని హామీ ఇస్తున్నాను*



[2/21, 19:13] +
91 83744 22023: 
01-03-2022 '
కవిపత్రిక'సంచిక కొరకు
పేరు:ఆకుమళ్ల కృష్ణదాస్ ( 2nd)
నంద్యాల. కర్నూలు జిల్లా.
అంశం : తెలుగు భాష కొరకు
ప్రక్రియ:వచన కవిత
శీర్షిక : అక్షర కన్యలు

నా అక్షరాలే నా ఆరోప్రాణం
మాతృభాషకు మణిమయ వడ్డాణం
గుండ్రంగా చుట్టి వదిలేస్తే..
సున్నాలుగా మిగిలిపోతాయని బాధ పడ్డా!
అందుకే నా అక్షరాలకు చక్కగా చదువు చెప్పాను
అందమైన అచ్చులుగా మార్చాను
మా బుజ్జిపాప జడకుచ్చులు గా మారాయి
హలో అనే హల్లులుగా మార్చాను
మా ఇంటి అల్లుళ్లు గా మారాయి
దీర్ఘాలిచ్చాను..చక్కని మార్గాలు చూపాయి
సొగసైన ఒత్తు లిచ్చాను
మొక్కజొన్న పొత్తు లయ్యాయి
భరతనాట్యం నేర్పాను
బాపు బొమ్మ లయ్యాయి
కూచిపూడి నేర్పాను..
కవితలుగా మారాయి
వికసించమని చెప్పాను
ఆకాశమంత ఎదిగాయి
నా అక్షరాలింతే..
నిదురొస్తే ఒళ్ళో ఉంటాయి
మెలకువొస్తే మెదళ్ళో ఉంటాయి
నిజం చెప్పాలంటే అవన్నీ..
వెన్నెల్లో ఆడుకునే కలువల చెలులు
వేకువనే సడిచేసే సుప్రభాతాలు!!

ఆర్యా!నమస్కారం🙏
ఇది నా స్వీయ రచన అని నా హామీ.
ఆకుమళ్ల కృష్ణదాస్
నంద్యాల.🦚🦜
8374422023


21/02/2022
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా...

అంశం : నేను సైతం : మాతృ భాష కొరకు,

శీర్షిక :  పలుకు తేనెల తల్లి.
ప్రక్రియ : వచన కవిత.

రచన : శ్రీమతి :పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ , మహారాష్ట్ర . (ప్రోత్సాహక).


గిడుగువారి గొడుగులో 
గ్రాంధిక మనే మసుగు తీసి
 దేశ వ్యవహారిక భాషగా వన్నెకెక్కి
 అందరి నోట పలుకు యాస గోస
 మన అందమైన తెలుగు బాష ॥

నన్నయ తిక్కన ఎర్రాప్రగడల 
రచనా శైలికి అక్షర పునాది వేసి
అష్ట దిగ్గజాల సాహిత్య వనంలో 
ఛందోబద్ధ కావ్య ,పద్య, గద్య 
కందమై,వేమన పద్యాలలో వేల
 అందాలు సంతరించుకుంటుా
కవన వనంలోవీర విహారం చేస్తున్న 
పలుకు తేనెల ముాట మన తెలుగు భాష॥

జానపదాల వేల కీర్తులతో 
 జన పదాల జల్లుగా కురిసి, 
 తెలుగింటి ఆడపడుచుగా 
అక్షర నీరాజనాలందుకుంటున్న 
ఆదర్శ సాంప్రదాయాల
 అద్భుత చరిత , అందమైన 
 యాస గల మన తెలుగు భాష ॥

హామీ: ఈ కవిత ఏ మాధ్యమునందునుా ప్రచురితము కాని నా స్వీయ రచన .


************************

No comments:

Post a Comment