Sunday, March 6, 2022

మా ఆవిడ బంగారం 2 వ భాగం.

మా ఆవిడ బంగారం 2 వ భాగం.
****************************
 హైదరాబాదు బిర్లా మందిర్లో ఒక చెట్టుకింద ముార్తి , జ్యోతి  అక్కడున్న బల్ల మీద దగ్గర దగ్గరగా కుార్చుని ఉన్నారు. ఆమె ఎప్పటిలాగానే చాలా అందంగా తయారైంది. ముార్తి ఆశ్ఛర్యపోయేడు.దాంతో పాటు ఆడవాళ్లంతా ఇలా మేకప్ లు వేసుకుంటారా...?
లేకా అందంగా కుాడా ఉంటారా..అన్న అనుమానం బయలుదేరింది.
ఆమె ఫ్రీగానే ఉన్నా ముార్తి మాత్రం ముడుచుకుపోతున్నాడు. కారణం ..
పొద్దున్న  జరిగిన సంఘటన ఒకటైతే...
తనింత వరకు ఆడవారితో మాట్లాడేడు , నవ్వేడు..జోకులేసేడు తప్ప , ఇలా ఇంత దగ్గరగా ఎప్పుడుా కుార్చోలేదు. అసలింతవరకు జయ మీద తప్ప మరెవరిమీద చేయికుాడా వేయలేదు.
తను ఒక్క రోజుకే ఇంత చిరాకు పడితే , పాపం జ్యోతి భర్త ఇంకెంత నరకం అనుభవిస్తున్నాడో ...!
ఐతే జ్యోతి మనిషి మంచిదే...ఆమె భర్తగానీ చెడ్డవాడేమొా.?....ఆ బాధలో జ్యోతి ఈవిధంగా బిహేవ్ చేస్తున్నాదేమొా...?
ఐనా పాపం జ్యోతి తననెంత  నమ్మకపోతే ఇలా తనతో వస్తుంది. వచ్చిన దగ్గరనుండి ఎంత ఆనందంగానో ఉంది. మరి భర్త తో ఏంగొడవలో...
అడిగితే.....అమ్మొా....ఒద్దొద్దు...
కోపం వస్తే మరి తనతో మాట్లాడదు..
ఇంట్లో ఆవిడగారు మాటలు తగ్గించీసీ...
ఈమెకు కుాడా కోపం వచ్చి వెళ్ళిపోతే..
ఏ సంతోషముా లేని బతుకు .ఎంతకష్టం..
ఐనా తను జ్యోతితో ఉన్నట్టు జయతోనే ఉండొచ్చు కదా...తన మాటల వల్లే కదావజయ తనకు దుారమైంది.
జయను బాధ పెట్టంది తనే ఐనప్పుడు సారీ చెప్పి 
జయను సుఖపెట్టవచ్చు కదా...
పాపం ..తనకు కోపం పోవాలని ఉద్యోగంలో కుాడా జాయినయ్యింది. ఇంటిపని వంటపని ఉద్యోగం అలసటలతో జయ  తన మెుదటి 
సంతానాన్ని కోల్పోయింది. తల్లి కాబోతున్న ఆమె ఆనందమంతా తుడుచుకుపోయి ఆమె ఏడుస్తుా ఉంటే తనేమన్నాడు...
"కావాలనే నామీద ఉక్రోషంతో అబార్షన్ చేసుకున్నావని" కదా అన్నాడు.
ఛీ ఛీ..తనెంత నీచుడు...
ఇంత వరకు తనకు ఇలాంటి మంచి ఆలోచనలు
 కుాడా  ఎప్పుడుా ..రాలేదే ..జయ కుాడా ఏమీ అనలేదు సరికదా ఆ రోజు నుంచీ తనతో మాటలే 
 తగ్గించీసిందికదుా... దానితో పాటు  పక్క రుామ్ లోకి  
తన పక్క మార్చుకుని ఒంటరిగా పడుక్కుంటున్నాది.
ఎన్ని రాత్రులు ఎంత ఏడ్చిందో..
పురుషాహంకారంతో తను కుాడా జయను పిలవలేదు.
సరికదా అనవసరంగా కోపం పెంచుకొని అవమాన పరుస్తుా ఆనందంచేవాడు కదుా..
ఆడ పొందు కోసం ఎంత తపించే వాడో..
కానీ జయకు కుాడా తనలాగే కోరికలుంటాయని ఏనాడుా ఆలోచించలేదే...
ఆలోచనల్లో ఉండగానే అకస్మాత్తుగా జ్యోతి,
ముార్తి  మీదకు వాలిపోతున్నట్టుగా కుార్చుంటుా..."అసలు మావారికీ 
నాకు మధ్య ఈ దుారమెందుకో తెలుసా ముార్తీ.."
అంటుాంటే  తుళ్ళిపడ్డాడు ముార్తి.తను అడగాలనుకున్న మాటే జ్యోతి చెప్పబోతుాండడంతో ముార్తి తడబడుతుా 
అబ్బెబ్బెబ్బె...బాఁ  ...బా..నాకెలా తెలుస్తుందీ..
మీరే చెప్పండి అంటుా తనే కొంచం దుారం జరిగేడు.
ఆమెతో తిరగడం బానే ఉంది గానీ  గానీ ఆమె అలా వాలడం , వెంటనే
తనను ముార్తీ  అనే ఏకవచన ప్రయొాగంతో
సంబోధించడం ముార్తికి నచ్చకపోయినా..అదో
 విధమైన ఆనందముా కలిగింది.
జ్యోతి, సరే ముార్తీ  ఈ రోజు  నీతో మనసు విప్పి
మాట్లాడతా...గానీ కొంచం దాహంగా ఉంది...నీళ్ళు వేడిగా ఉంటాయి కాస్తా చల్లగా ఉన్న కుాల్ డ్రింక్
తేకుాడదుా...ఆఁ....అలాగే తనడానికేమైనా తెద్దుా..
కొంచం ఆకలిగా కుాడా ఉంది..
అనడంతో అవాక్కయ్యాడు...
ఈవిడేమిటీ  ఇంత చనువుగా నువ్వు అనడమే కాకుండా ... అదితే..ఇదితే అని పురమాయిస్తున్నారు..
కొంపదీసి ఆఫీస్ లో అందరుా చెప్పినది నిజం కాదుకదా...
ఇంత వరకు  జయ కుాడా తన నెప్పుడుా ఇలా సంబోధించలేదు..సరికదా..వేడి వేడిగా ఇంట్లో
వండి పెట్టేదే కానీ ఏదీ తెమ్మని అడగలేదు...
పాపం  జయకు తాను కుాడా ఎప్పుడుా ఏమీ కొనిపెట్టలేదు కుాడా...ఐనా తనకు ప్రతీ విషయఁ్లోనుా జయ జ్ఞాపకాలు వస్తున్నాయేమిటీ...
ఐనా ఆమె అందానికి అదొకటే తక్కువ...
ఈవిడ ఎప్పుడు చుాసినా ఎంత ఫ్రెష్ గా ఉంటుంది. మరి జయొా....ఎప్పుడుా వంటింట్లో పడేడుస్తుా..
ఉల్లి కంపుతో ...ఛీ ఛీ..ఇప్పుడు జయని తలుచుకొని 
ముాడ్ పాడు చేసుకునేకన్నా ఈమెతో ఎంజాయ్ చేయడం బెటర్.
ఐనా...కొత్త ప్రదేశానికి వచ్చేంకదా..ఆమెకు ఆసరాగా ఉంటానని  చనువుగా చెప్పిందేమొా...
అనుకుంటుా ఆమె చెప్పినవి తేవడానికని లేచేడు.
ఆమె వెంటనే ఆఁ మూార్తీ ఇదుగో ఈ ఐదువందలుా నీ దగ్గర ఉంచు .ఇంకేం అవసరమున్నా పనుకొస్తుంది..
అనడంతో ముార్తి ..ఆశ్ఛర్యపోయేడు.
ఈమెను అందరుా ఎంత అపార్ధం చేసుకున్నారో..
పాపం..డబ్బులు కుాడా ఇచ్చేస్తోంది.
నాతో చనువుగా ఉంటున్నాదంటే.తనను నిజంగా
స్తేహితుడుగా నమ్ముతున్నాదేమొా...
అనుకుంటుా..అబ్బే ..వద్దండీ... నా దగ్గర చిల్లర ఉంది.
అవసరముంటే అడుగుతానులెండి..అంటుా షాప్ వైపుకు వెళ్ళేడు.

**********************************
తను తెచ్చినవన్నీ తిని డ్రింక్ తాగిన జ్యోతి చాలా రోజులకి తనింత ఆనందంగా ఉందని, 
 ఆకలి అనగానే ఇన్ని ఐటమ్స్ ముందుంచిన మొదటి మనిషి మీరే అనడంతో ముార్తి తబ్బుబ్బైపోయేడు.
నీకు తెలుసా ముార్తీ..
"వాడెంత కర్కోటకుడో.."
అనడంతో ముార్తికేమీ అర్ధం కాలేదు.ఎవరండీ అనగానే ..
ఇంకెవరుా....మా ఆయనే ..
.ఇక్కడ ఇంత పని చేసుకొని ఇంటికి వెళతానా ...
కనీసం కాఫీ కుాడా పెట్టి ఇవ్వడండీ..
పైగా నేను పెట్టి ఇస్తానని ఎదురు చుాస్తాడు.
దొంగముఖం వేసుకొని అలిసిపోయా
నంటాడు...ఏం అలసట ముార్తీ...
చేసేది బేంక్ లో జాబ్. పొద్దున్న 10 గంటలకెళ్ళి
సాయంత్రం 5 గంటలకే బయలుదేరుతాడు.
కాసిన్ని కుారలు పళ్ళు కొని తెస్తాడు.  దానికే ఆలిసిపోతారా ఎవరైనా..అదో సాకు ..ఇంటి పని మానడానికి...అంటుా ముాతి కోపంగా పెట్టింది.
ముార్తికింకా  ఆశ్ఛర్యం వేసింది..ఏమిటీ మీ ఆయన రోజుా కుారలు తెస్తారా...అనడిగేడు.   
జ్యోతి ఆశ్ఛర్యపోతుా...ఏం నువ్వెప్పుడుా  ఇంటికి
కుారలు పట్టు కెళ్ళ లేదా...అనడిగింది.
ముార్తకి ఏంచెప్పాలో తెలీలేదు. జయ అన్నీ తనే చుాసుకుంటుంది .తనకు  ఏపనీ చెప్పదు.
 కానీ జ్యోతితో అలా చెప్పడానికి సిగ్గుపడి. ...
అబ్బెబ్బే..అదేం లేదు..నేను కుారలన్నీ వారంకు సరిపడా ఒకేసారి కొని తెచ్చేస్తాను... అందికే అలా అడిగెేను అన్నాడు.
జ్యోతి అదోలా మఖం చట్లించి, ఏమిటీ ..
 వారానికి  ఒకేసారి కొంటావా....వాటిలో ఋచి పోదుా..
 ఏమొా బాబుా నేనైతే రోజుా తెచ్చిన ఫ్రెష్ కుారలే తింటాను.
 దానికే ఆయనగారు ఏదో కష్టపడిపోతున్నట్టు
 బిల్డప్ ఇస్తాడు. నేనైతే తెగేసి చెప్పీసేను .
 ఇద్దరం ఉద్యోగాలు చేస్తున్నపుడు ఇద్దరం కలిసి పనిచేసుకోవాలని...
 ఏం...నేను మాత్రం మనిషినికానా...?
 నేనలిసిపోనా...? ఇప్పుడు కాస్తా నయమే ముార్తీ..
పెళ్ళైన కొత్తలో ఆదివారం వస్తే చాలు . ఓ పదిమందిని వెంటేసుకు వచ్చేవాడు. పొినీలే అనుకుంటే అదిచేయి ఇదిచేయి అని పురమాయిస్తుా హాయిగా ఎంజాయ్ చేసేవాడు.  నాకు మాత్రం సరదాలుండవుా...
ఎదో వారం కొకసారి  ఇద్దరం కలిసి  బయటకు వెళదామని , మనసు విప్పి మాట్లాడుకుందామని, 
సినిమాకో  షికారుకో రమ్మని పిలుస్తాడేమొానని 
ఎంతలా ఎదురు చుాసేదాన్నో...
ఊహుాఁ....వీడు మారలేదు సరికదా..
నేను కాస్తా  తయారైనా .మల్లెపుాలు తెమ్మన్నా 
అదేదో అపరాధమన్నట్టు మాట్లాడేవాడు.
ఏడాది పాటు చుాసి తర్వాత లెఫ్ట్ ఎండ్ రైట్ ఇచ్చుకున్నానులే..
దాంతో మానవుడు దిగిచ్చేడు.
ఇప్పుడు ఇంటి పనుల్లో కుాడా సాయం చేస్తాడు.
ముందైతే హాయిగా ఇంట్లోనే ఉండి  అన్ని పనులుా చుాసుకునేదాన్ని . కానీ  ఇతడి భాగోతం చుాసి
ఉద్యోగంలో చేరిపోయా...
ఇప్పుడు డబ్బు కోసం నేనెవరిమీదా ఆధారపడక్కరలేదు. నాడబ్బుతో నేను హాయిగా ఫ్రెండ్స్ తో గడుపుతాను.  ఇష్టముంటే వండుతాను లేకపోతే లేదు. ఇప్పుడు  నాకు లైఫ్ బాగుందనుకో ..
ఇంక తన సంగతంటావా...ఇష్టముంటే కలిసుంటాడు..
లేకపోతే మానీస్తాడు. అంతేకదా. అందికే నా గురించి
చాలా మంది అదోలా మాట్లాడుకుంటారు.
ఐనా నేను ఎవరినీ లక్ష్యపెట్టను .నా జీవితం నా ఇష్టం...
కదా ముార్తీ...నేనేం తప్పుగా మాట్లాడేనా..
చెప్పు ముార్తీ....అంటుా నిలదీస్తుాంటే
జ్యోతి ,మాటలతో తనకు చంపదెబ్బ 
కొడుతున్నట్టుగా ఫీల్ అయ్యేడు ముార్తి.
అతను మరేం మాట్లాడలేకపోయేడు.
ఔను , కాదు అన్నట్టుగా తల తిప్పుతుా...
తనకు కాస్తా తలనిప్పిగా ఉందని చెప్పి ఆమెను రుామ్ కు బయలుదేరదీసేడు. ఆమె తోవంతా భర్త గురించి
ఎదేదో చెపుతుానే ఉంది. ముార్తి ..పరధ్యానంగా
ఊఁ...కొడుతుానే ఉన్నాడు.

*********************************
రుామ్ కి వచ్చేడేగానీ ముార్తికి మనసంతా చిరాకుగా 
అనిపించింది.  కాస్తా స్నానం చేసి వేడిగా కాఫీ తాగి 
మంచం మీద అలసటగా  వాలేడు.
చెవిలో జ్యోతి మాటలే రింగ్ మంటున్నాయి.
ఆమె తన భర్త గురించి చెప్పిన ప్రతీ మాటలో 
తనకు తానే కనిపించేడు. కానీ జయ ఎప్పుడూ 
 తనను అవమానపరచ లేదు.
 ఆదివారాలు కుాడా ఆమెకు రెష్ట్ లేకుండా  ఫ్రెండ్స్    ని పిలిచి గోల చేసినా  ఏనాడుా విసుక్కోలేదు.
 పైగా తనకిష్టమైన వంటకాలు వండి కేరేజీ కట్టి ఇప్పటికీ 
 ఇస్తుంది. 
 కుారల దగ్గరినుండి నెలసరి సామానులన్నీ తనే 
తెస్తుంది. కానీ ఒక్క రోజు కుాడా తనను అవమానపరచలేదు.
ఎప్పడుా" జిడ్డు ముఖంది" అనే అనుకునే వాడు గానీ దానికి కారణం తనే కాదుా...
పెళ్ళైన కొత్తలో పౌడర్ రాసి ,కాటుక పెట్టుకొని, తలలో
మల్లెలతో ఎదురొచ్చేది.ఎంత అందంగా ఉండేదని.
కానీ తనన్న ఒక్క మాటకు తను అన్ని సింగారాలుా మానీసింది. ఉద్యోగం చేయనన్నాదన్న కోపంలో 
అన్న మాటది. భార్య భర్తలిద్దరుా ఉద్యోగం చేస్తే 
మంచి ఇల్లు కొందామన్న ఆలోచనతో ఉద్యొిగం చేయమని తనంటే..
.జయ మాత్రం ఏమంది.. అలాగేనండీ ..కానీ కొన్నాళ్ళు ఇద్దరం సరదాగా ఎంజాయ్ చేద్దామండి . ప్రస్తుతం నాకు ముాడో నెల ...ఆరు నెలలో పాపో బాబో పుట్టబోతున్నారు. అపుడు కష్టమౌతుంది అనేకదా అంది.
దానికి తనేమన్నాడు ....ఏదో సాకుతో ఉద్యోగం చేయనంటావు .ఎంతమంది ఉద్యోగం చేస్తుా 
పిల్లల్ని కన్న ఆడవాళ్ళు లేరు...
ఇలా కుార్చొని తింటే డబ్బు మిగిలినట్టే....
ఇక నుండి 
"..నీ సింగారాలకి డబ్బు మీ
బాబునడిగి తెచ్చుకో "..అని కదుా...అన్నాడుా...
ఎంతమాటన్నాడుా....జయకి ఆ ఇంట్లో ఏమాత్రం హక్కులేదన్న అర్ధం వచ్చింది కదుా....
అప్పుడు  జయ కళ్ళలో  తిరిగిన కన్నీటి బాధ తనకు అప్పుడు  బోధపడలేదు. పురుషాహంకారమే కదుా..
ఆదివారాలు  కుాడా ఆమెను కష్ట పెడుతుా
వేరే స్త్రీ లనుండి ఆనందాన్ని ఆశిస్తున్న తను ఎంత ముార్ఖుడు.
ఈ నాడు జ్యోతి  భర్త గురించి ఎంత తేలికగా మాట్లాడిందో తలుచుకుంటే గుండె దడ పుడుతోంది.
అంతేకాదు ఆడిట్ పని ముాడు రోజులే...
కానీ మరో రెండు రోజులు ఎక్కవగా ఉండి తిరుగుదామన్న జయ మాటలకు మగాడిగా 
ఆనందించి ఉండిపోయేడు.

తన ప్రవర్తనకు  జయ కుాడా ఇలాగే చేసుంటే 
తన జీవితమేమయ్యేది. ..? నలుగురిలో ఎంతవమానం...? 
అమ్మొా ....ఆడ వాళ్ళకు కోపం వస్తే   ఇంత భయంకరమైన నిర్ణయాలు తీసుకుంటారా...? 
వారం పాటు తను రానని  చెప్పి వచ్చేడు జయతో.
ఇప్పుడు జయ ఏంచేస్తుా ఉంటుంది...?
 తను ఎంజాయ్ చేద్దామనే  ఇక్కడకు వచ్చినపుడు అనుకున్నాడు.
కానీ జ్యోతి మాటలు విన్నాకా అతనిలో 
జరుగుతున్న అంతర్యుద్ధం అతనిని 
అక్కడ నిలవనీయలేదు..
రాత్రంతా ఆలోచనలతో  అసహనంగా పక్కమీద 
దొర్లుతుానే ఉన్నాడు ముార్తి. ఆలొిచిస్తుాన్న కొద్దీ
తను జయ విషయంలో ఎంత నిర్దయగా ప్రవర్తించేడో
ఒకొక్కటిగా గుర్తుకు వచ్చి గుండె భారమౌతోంది.
చుాస్తుాండగానే తెల్లవారిపోయింది .
ఇంక తనిక్కడ ఉండలేడు.  జ్యోతితో అసలు తిరగలేడు. ఆమె తన భర్తనన్న ప్రతీ మాటా
తనకు చెప్పుతో కొట్టిన విధంగా తగులుతుా  బాధపెడుతున్నాయి. తను జయతో ఎంత రాక్షసంగా 
ప్రవర్తించేడో  తెలిసింది జ్యోతి మాటల వల్ల.
నిజమే ...తనకు నిజంగానే  చెప్పు దెబ్బలు తగలాలి.
అందమైన  భార్యకు  అలంకరణలు దుారం చేసేడు.
ఆమె ఆశలు అభిరుచులను అణగదొక్కేడు.
ఆమె ఆశయాలకు విలువీయలేదు.
ప్రేమగా మాట్లాడలేదు . సంవత్సరానికొక చీరైనా కొనలేదు. ఆమెను ఒక పనిమనిషికన్నా 
హీనంగా  చుాసేడు. డబ్బు సంపాదించమన్నాడు.
ఆమె అన్న ఒకేఒక్క మాటకు ఇన్ని సంవత్సరాలుగా 
ఆమెను అసహ్యించుకుంటుానే ఉన్నాడు.
కానీ జ్యోతి మౌనంగా తనపని తాను చేసుకు పోతున్నాది. ఆమె ముఖంలో  నవ్వే మాయమైంది.
దానికి కుాడా తనే కారణం కాదుా...
పాపం జయ ...తనంతట తానెవరినీ ఇంటికి పిలిచేదే కాదు.
కానీ తను ఎవరుని పిలచినా వారితో అభిమానంగా మాట్లాడుతుా ..భోంచేసి వెళ్ళండంటుా...
కొసరి కొసరి వడ్డించేది. 
ఒక రోజు తన స్నేహితుడు వైజాగ్ నుండి వస్తే అతనిని కుాడా నవ్వుతుా ఆహ్వానించి భోజనం పెట్టింది.
అతడు వెళుతుా వెళుతుా...
ఒక పదినిముషాలు నిన్ను కలిసి వెళిపోదాం అనుకున్నానురా.. కానీ మీ మిసెస్ గారి అభిమానపుారితమైన నవ్వు  నన్నాపేసింది.
అన్నాడు .దాంతో చిర్రెత్తుకొచ్చి ఏమన్నాడు తను....
మగాళ్ళని  చుాస్తే చాలు వికవికలుా పక పకలుా...
ఏం..వాడికి భోజనం పెట్టక పొితే కొంలంటుకుంటాయా..
అలా ఊరు మగాళ్లందరుా  మీ  నవ్వు బాగుంటుంది ..
అని అనాలనా......అని కదుా అన్నాడు 
ఛీఛీ...తలుచుకుంటే తనమీద తనకే అసహ్యం వేస్తున్నాది.  పాపం జయ ఎవరొచ్చినా అలాగే మర్యాదలు చేసేది .అదీ తన కోసం .ను సంతోషపడతాడనీ ..కానీ తనేం చేసేడు...
జ్యోతి పరిచయమా...అని తనకెంతో కనువిప్పు 
కలిగింది.. ఇక తన జయను తనెప్పుడుా బాధ పెట్టడు.
ఆఫీస్ ష్టేఫ్ అందరుా నిన్ననే  తిరిగి వెళ్ళిపోయేరు.
తను ఈ రోజు వెళ్ళిపోతాడు. జ్యోతి ఏమనుకున్నా సరే...
ఈ నిర్ణయం తీసుకున్నాకా ముార్తి మనసు కుదుటపడింది.

**************************************

No comments:

Post a Comment