గజల్
నీలినింగి దూరాల్లో తారకవై నీవంతా
ఆ శూన్యం చేరలేని సారికనై నేనంతా
కలలొక్కటి మిగిలెనేమొ గాయపడిన హృదయానికి
గుండె పగిలి కన్నీరై తడుస్తోంది కవితంతా
వలుపు కథలు చెరిపేస్తూ కడలిపాడు అలల పాట
మరల మరల ఆలపిస్తు బతికేస్తా బతుకంతా
శిశిరాలను చైత్రాలుగ మార్చలేను ఓ చెలియా!
నీ ఊహా చిత్రాలతొ నింపేస్తా మనసంతా
సత్య కనుల నీలి రంగు పూసుకుంటె ఆకాశం
కురుస్తున్న చినుకుల్లో వెతుక్కుంట వలపంతా
రాజశేఖరుని శ్రీ శివ లక్ష్మి
సత్య స్వరాళి
No comments:
Post a Comment