Sunday, February 27, 2022

మా ఆవిడ బంగారం (కధ)

శీర్షిక : మా ఆవిడ బంగారం. (కధ).
రచన : శ్రీమతి :పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ , మహారాష్ట్ర .


ముఖం చిట్లించుకుంటుా  ముందు హాలులో 
ఈజీ చైర్ లో కుార్చొని  టీ.వి లో ఛానల్స్ ని అదే పనిగా మారుస్తున్నాడు ముార్తి.
ఒకవైపు ఛానల్స్ మారుస్తుానే పెళ్ళాం మీద రుస రుస లాడుతున్నాడు ముార్తి.

"వెధవ జిడ్డుముఖం    జిడ్డుముఖమా  అని   ...   ఎప్పుడుా సమయానికి కాఫీ ఇవ్వలేదు .
పొద్దున్న లేచీ బ్రష్ చేయగానే నాకు కాఫీ కావాలని తెలుసుకదా....
వెధవ్వేషాలు..ఏంచేస్తాడులే వెధవ" అని అనుకుంటున్నావేమొా...నాక్కోపమొస్తే మనిషిని 
కాను... నాన్చుడుా నువ్వుానుా....
అంటుాండగానే  జయ కాఫీ గ్లాసు తీసుకు వచ్చి
"తీసుకోండి " అంటుా అందించింది .
కోపంగా చుాస్తుానే విసుగ్గా లాక్కున్నట్టుగా తీసుకున్నాడు ముార్తి. కాఫీ గ్లాసుని. 
జయ నిట్టుారుస్తుా..కిచన్ లోకి వెళ్ళిపోయింది.
కాఫీ తాగుతుానే టైమ్ చుాసిన ముార్తి గతుక్కుమన్నాడు. 
ఇదేంటీ టైమ్ ఇంకా పొద్దున్న ఐదే అయ్యిందా...
అంటే తను రోజుా కన్నా గంటన్నర ముందే లేచేడన్న మాట. అందుకే  టి. విలో ఎక్కడ పెడితే అక్కడ
ప్రవచన స్వాములు, దేముడి హారతులుానుా...
తనకేమొా అర్ధంకాక ఛానల్స్ మారుస్తుానే ఉన్నాడు.
వెధవది టి.విలో ఒక్క మంచి ప్రోగ్రామ్ లేదు. కేబుల్ , కరంట్ లకు డబ్బులు దండగ....మరికొంచం సేపు నిద్రపోవలసిందేమొా..ఐనా అదీ అవ్వదు తన ముఖానికి ..
మరొక్క అరగంటపోతే ఈ విడగారుకుాడా 
గంట వాయించేస్తుంది. పడుకున్నవాడిని లేపడానికి
ఇదోసాకు.
 ప్రతీ రోజుా ఐదు, ఆరుకు మధ్యలో  పుాజ , ఆరతీ ,అంటుా ఈ గంటపోరు తప్పడం లేదు. ఎలాగో ఆఫీసుకు వెళ్ళాలి కదా...
 అని ఊరుకుంటున్నాడుగానీ...లేకపోతేనా..
 ఐనా ఈ రోజింత తొందరగా ఎందుకు లేచేనబ్బా...
అనుకుంటుానే  హాఁ.
అవును కదుా...రాత్రి తొందరగా నిద్ర వచ్చేసింది.
నిన్నంతా ఆదివారమని ఫ్రెండ్సందరం  కలిసి  పార్టీ --
చేసుకున్నాం  . వాళ్ళంతా ఇక్కడే...అందరుా తిని  తాగి భోజనాలు చేసి...వెళ్ళేరు.  చాలా ఐటమ్స్ చేసింది  ఈవిడగారు. అందరుా లొట్టలేసుకుంటుా మరీ తిన్నారు.
తనకు కొంచం మత్తు ఎక్కువై వాళ్ళంతా వెళ్ళగానే
పక్కెక్కేడు మరి.
హబ్బో..ఈవిడగారు మాత్రం  సుష్టుగా తిని రాత్రి భుక్తాయాసం తీరేకా పక్కెక్కినట్టుంది.
తన పక్కకు రాగానే  దగ్గర తీసుకున్నపుడు
పడుకోండి...చాలా అలిసిపోయాను.రాత్రి రెండయ్యిందిప్పటికే...అంటుా...సణుగుడు కుాడానుా..
తను మాత్రం ఊరుకున్నాడేంటి .తన అవసరం తీరేకే
వదిలేడుగా...
ఐనా ఈమెగారికి ఈమధ్య బాగా అలవాటయ్యింది ..
అలసటగా ఉందండీ...వద్దండీ..అనడం ...హు..."
అనుకుంటుా  మళ్లీ ఛానల్ మార్చేడు  .
*************
జయ కళ్ళ లో తిరుగుతున్న కన్నీటిని తుడుచుకుంటుా.. కిచెన్ లో  టిఫన్ చేస్తుా ఆలోచిస్తున్నాది..
రాత్రి నిద్ర లేకపోవడం వల్ల కళ్ళు బాగా మండుతున్నాయి. కానీ వంట చేయక తప్పడం లేదు
ఆయనికి బయటి భోజనం అసలు సాయించదు.
ఇద్దరికీ డబ్బాలు కట్టుకోవాలి. టిీఫిన్ తరువాత మళ్ళీ
టీ తాగే అలవాటుంది   ఏది మర్చిపోయినా 
విసుక్కొని అవమానంగా మాట్లాడతారు..
తను కుాడా ఉద్యోగం చేస్తున్నాదనే విషయమే ఆలోచించరు. సమయానికి అన్నీ అందాలంటారు.
 నిన్న సాయంత్రం ఆరుకే పడుక్కొని  తెల్లారకుండానే లేచిపొియి
 కాఫీ లేటయ్యందని నామీద విసుక్కుంటుానే ఉన్నారు. ఆకాటికీ అతను లేవడం చుాసి ఒక ఐదు నిముషాల త్వాత తనుకుాడా లేచింది..ఏం ..తనుమాత్రం
 మనిషి కాదా..తనకు కుాడా ఒక్క ఆదివారమేగా సెలవు. అతను ఆదివారం వస్తే చాలు స్నేహితులందరినీ  ఇంటికి పిలిచేస్తారు. అందరుా వాచిపోయినట్టు తాగి తిని వెళ్ళిపోతారు. ఆ ఎంగిళ్ళన్నీ తుడిచి గిన్నెలన్నీ తోముకుని, వంటిల్లంతా    సద్దుకొనేసరికి అర్ధరాత్రి దాటిపోతుంది. అప్పుడైనా పడుక్కోనిస్తారా....ఛీ...ఛీ..వెధవ ఆడబతుకు...
 పోనీ అలాగే పడుకొని తెల్లారి లేచేకా పనులు చేసుకుందామనుకుంటే ఆఫీసుకు వెళ్ళాలాయె.
 ఏమైనా సరే 
 తనకు మాత్రం రోజుా అర్ధరాత్రి  దాటినా రెష్ట్ తీసుకోవడానికి కుాడా కుదరడం లేదు.
ఆదివారం తెల్లారేసరికల్లా మార్ణింగ్ వాక్ పేరుతో తనే మార్కెట్ కి వెళ్ళి వారానికి సరిపడ కుారలు ,నారలు, సామాన్లు అన్నీ  తెచ్చుకోవాలి.
ఈయనగారు పిలిచిన పదిమందికీ వండి వార్చాలి.
అదీ చాలా రుచిగా..బోలెడు ఐటెమ్స్ తో...లేకపోతే వారందరిముందుా  కుాడా అవమానం చేస్తుా కసిరేస్తారు. 
పొద్దున్న  ఆఫీస్ కు వెళ్ళాలి గనక బండెడు అంట్లు
రాత్రే తోముకొని , ఇల్లు సర్దుకొని పక్కెక్కి ఈ యనగారి
అవసరం తీర్చేసరికి తెల్లారిపోతుంది.ఇంకెక్కడి రెష్టు.
కాస్త వయసులో ఉన్నపుడు కొంచం శక్తి ఉండేది. కానీ తనకుా యాభయ్యేళ్ళు దాటేయి. విపరీతమైన పని.

అసలు తనను ఉద్యోగం చేయమని బతిమాలింది అతనే  కదుా....
ముగ్గురు పిల్లలు పుట్టీసేరు మనకి ఆదాయం ఉండాలి అంటుా..  తనను ఉద్యోగం చేయమని 
ఎంత పోరు పెట్టేరో...ఎంత సాధించేరో....నీకు నేనున్నానోయ్, ఇద్దరం కలిసి చేసుకుంటే , పనులన్నీ ఇట్టే ఐపోవుా...
 అంటుా....ఎన్ని ఆబద్ధాలోచెప్పి...ఉద్యోగం లో వేయించేరు. డిగ్రీ పుార్తికాని తనకు చాలా తక్కువ జీతంతో దొరికిన ఉద్యోగమది.  ముగ్గురు చంటి పిల్లలు. వాళ్ళని చుాసుకుంటుా  పని చేసుకొని ఆఫీసుకు బయలుదేరేది. నాన్నగారు తను 9th లో ఉన్నపుడే పోయేరు కనక అమ్మ తనదగ్గర ఉండి పిల్ల లను  చుాసుకొనేది. దానికీ అతను ఎన్నోసార్లు  మనిషికి మనిషి  ఎంత బరువో  చేసే వాళ్ళకి తెలుస్తుంది. కుార్చొని తినేవాళ్ళ కు ఎలా తెలుస్తుందీ....అని కొన్నాళ్లుా,   మనుషులు ఎక్కువయ్యేరంటుా మరికొన్నాళ్ళుా  సాధించి సాధించి   మరీ అవమానించేవారు.
 అన్నీ భరిస్తుా కుడా అమ్మ నాకోసం పిల్లలకోసం  అలా...ఐదేళ్ళ వరకు ఉండిపోయింది. 
 అమ్మ కుాడా పోవడంతో తను పుార్తిగా ఒంటరై పోయింది.
  ఆఫీసుకు వెళ్ళాలంటే రెండు బస్సులు మారి , ఇరవై
 నిముషాలు నడిచి వెళ్ళాలి.  
ముగ్గురు పిల్లలతో ..పరుగులెత్తేది .  కానీ ఒక్క రోజైనా ఇతను సాయం చేయలేదు సరికదా , కనీసం తమ కారులో తనను  ఎంతో ఆవసరం ఉన్నపుడు కుాడా ఆఫీసులో డ్రాప్ చేసేవారు కాదు. తను పనిచేదిన చోట మాత్రం  తన పరిస్థితి చుాసి బాస్ కుాడా ఏమీ అనేవారుకాదు.
ఇంట్లో మాత్రం.....తన భర్తకి ఎందుకంత విసుగు .
తనేం చేసిందని అంత కోపం . 
 కానీ తనెప్పుడుా కోపం తెచ్చుకోలేదు .
 అలాగే సతమతమౌతుా వచ్చింది. ఆడ పిల్లలకు 
పెళ్ళిళ్ళయ్యేయి.  
వాళ్ళకి రాకపోకలుా  పెట్టుపోతలు తో మరింత అలసట పెరిగింది.
పెద్దమ్మాయిని పురిటికి తెచ్చినప్పుడు మొదలైన గుండెనొప్పి, పొడు దగ్గు , నీర్సం మరి తగ్గేలేదు.
మగపిల్లాడింకా 10th లో ఉన్నాడు.
వాడికీ వాళ్ల నాన్నపోలికే వచ్చినట్టుంది.
ఏ సాయముా చేయడు సరికదా..అమ్మా అది చేయి
ఇది చేయి అంటుా అడుగుతుానే ఉంటాడు.
చిన్నవాడని సరిపెట్టుకుంటున్నాది.కొన్నైళ్ళ లో
వాడికి పెళ్ళౌతే ముచ్చటగా కోడలొస్తే...తను హా
యిగా.....
తను ఆలోచనల్లో ఉండగానే..
ఏమేవ్ ఆ టిఫినేదో తగలడు..ఆపీసుకు టైమవుతొింది.
అన్న ముార్తి అరుపుతో....ఇదిగో వస్తున్నా .అంటుా 
ఉప్మా ప్లేటు అందించి కట్టిన కేరేజు పక్కనే టేబుల్ మీద పెట్టింది. 
ఉప్మా చుాడగానే ముఖం చిట్లించేడు ముార్తి.
"ఎప్పుడుా ఉప్మావేనా...మరోటి చేయడం రాదా.."
అంటుా అరుస్తున్నట్టుగా  అంటున్న ముార్తిని  ఆశ్ఛర్యంగా చుాసింది జయ.
అదేంటండీ మీరేకదా పొద్దున్న బాగా జీడిపప్పు ,నెయ్యి  వేసి  ఉప్మా చేయమన్నది..
నేను ఇడ్లీ చట్ని చేస్తానంటే వద్దన్నారు కదా...
అనగానే...
చాల్లే ..ఇంక మాటలాపీ...లోపలికి వెళ్ళి ఆ టీ ఎదో చేసి త్వరగా పట్రా..అని పురమాయించేడు.
అంత బాధలోనుా నవ్వి వచ్చింది జయకి. ఎప్పటినుంచో అతనే సణుగుతున్నారుగా...ఇంతసేపటికి తను ఈ ఒక్క
మాటేగా మాట్లాడినది....ఐనా...
ఈమగవారికి అంత ఇగో ఎందుకో..వాళ్ళ తప్పు ఎత్తి చుాపిస్తే  భలేగా మాట తప్పించేస్తారు...తప్పుకు దొరకకుాడదన్నట్టు...
ఆడవాళ్ళంటే ఈ చిన్న చుాపెందుకో..అర్ధం కావడం లేదు.అన్ని విషయాల లోనుా వీరికన్నా  నాలుగడుగులు ముందే ఉంటున్నాం కదా...
జీవితాంతం ఆడవారిని అలుసు చేయడమేనా పని..
దీని వల్ల వాళ్ళు తమ జీవితంలో ఎంతో అందమైన క్షణాలని , విలువైన కాలాన్ని  ఎంత కోల్పోతున్నారో అది గ్రహించడం లేదుకదా..ఇలాంటి వారివల్ల  నాలాంటి  ఎంత మంది  స్త్రీలు మనఃశాంతిని కోల్పోతున్నారో....
 .ఏవిటో...
అనుకుంటుా..కిచన్ లోకి దారి తీసింది.

*******************************

ఆఫీస్ నుంచి తిరిగి వచ్చిన ముార్తి చాలా ఆనందంగా ఉన్నాడు.
కారణం ఈరోజు తమ ఆఫీస్ లో ఒక కొత్త క్లర్క్ జాయినయ్యింది. 
తన సీటుకు కొంచం దుారంలోనే ఆమె సీటు కుాడా.
వచ్చిన వెంటనే అందరినీ గలగల మని పలకరించేసింది.
ఎంత ఫ్రెష్ గా తయారై వచ్చిందో...పెదాలకు రంగు ముఖానికి అద్దిన పౌడరు , జాకట్టు మీద వేసుకున్న సెంటు వాసనతో పాటు , ఆనడక, ఆ హుందాతనం 
ఎంత కలివిడిగా ఉందో..మధ్యాహ్నం  లంచ్ సమయంలో ఆఫీస్ లొ అంతమంది ఉండగా  తన దగ్గరకే వచ్చి లంచ్ షేర్ చేసుకుంది. ఎన్ని సంవత్సరాలయ్యిందో...ఇలా హాయిగా మాట్లాడుకుంటుా నవ్వుతుా భోంచేసి..
అందరుా తనవైపు ఎంత ఈర్ష్య గా చుాసేరో...
అంటే తనలో ఏదో ఆకర్షణ ఉందన్నమాట .

ఇన్నాళ్ళుా ఆ జిడ్డు ముఖంది తను
 జుట్టుకు రంగేసుకొని
వారం కోసారి బ్యుాటీ పార్లర్ కు వెళ్ళి వచ్చి
" ఎలా ఉన్నానోయ్ "అని అడిగితే..
"మీ వయస్సుకు తగ్గట్టుగా ఉంటే బాఫుంటుందండీ.".
అనగానే , తనేదో ముసలాడినైపోయేనేమొా అని ఎంత ఫీల్ అయ్యేవాడినో..
అంతేనా ..అలా...అలా. తలకు రంగువేయడం మానేశాడు  తను . ఆఁ ..అప్పుడప్పుడు పార్లర్ కు మాత్రం వెళుతుా ఉండడం మానలేకపోయాను లెండి. అంటే  అక్కడ కౌంటర్లో కుార్చున్నావిడ తనతో ఎంచక్కా మాట్లాడేదో..తన కష్టాలన్నీ చెప్పుకొని కళ్ళనీళ్ళు పెట్టుకొనేది .ఆడవాళ్ళు ఏడుస్తే చుాడలేని తను..ఎన్నాళ్ళు ఎంతెంత డబ్బో సాయం చేసేడని..
ఆమెకెంత అభిమానమొా నేనంటే..
ఇదుగో ఈ జిడ్దు ముఖం దానివల్లే అక్కడికి వెళ్ళడం కుాడా మానుకున్నాడు.
అసలు ఈవిడగారు  మా పెళ్ళైన కొత్తలో ఎంత అందంగా ఉండేదనీ...
కోలముఖంలో  మెరిసే చక్రాల్లాంటి కళ్ళు , ముద్దొచ్చే
ముక్కు , ఎర్రటి పెదాలు ..అసలు అందానికి అందంలా ఉండేది.
ఇప్పుడో...
గుండ్రంగా బొద్దుగా తయారై రంగు కుాడా తగ్గిపోయింది. దానికి తోడు పిల్లలు పుట్టేకా తన మీద ప్రేమ కుాడా తగ్గిపోయింది. ఎప్పుడూ జిడ్డోడుతుా
ఆ పిల్లల మధ్యలోనే ఉండేది . పిలిచినా 
వచ్చే సమయం లేదనో , నిద్దరొస్తున్నాదనో , అలసిపోయాననో,   అబ్బో ఎన్ని సాకులు చెప్పేదనీ..
తన కలలన్నీ కల్లలు చేసింది..ఎన్నాళ్ళని ఇలా...
తనకేమొా ఎన్ని కోరికలో..ఎన్ని సరదాలో...
అసలు ఆమెకేమీ ఆనందాలు అక్కరలేదా...
ఎప్పడుా వంట ...పని...పిల్లలుా..ఇంతేనా..
కాస్త అందంగా తయారవ్వొచ్చుగా..ఊహు.....
అదీ లేదు. 
ఎప్పుడుా ఇంగువ వాసన కొడుతుానో...
ఒలికి పోయిన పాలకంపు కొడుతుానో ..ఛీ ఛీ..
దగ్గరకు వెళ్ళాలన్నా  అసహ్యమే...
మళ్ళీ రోజుకు రెండు సార్లు స్నానం చేసి
బట్టు మార్చేదికుాడా..
ఉద్యోగం వెలగబెడుతున్నాది కనక తను సుఖపడ్డాడు.
లేకపోతే రోజుా ఆ ముఖం చుాడలేక చచ్చేవాడు.

ఇన్నాళ్ళకు కాస్తా ఆనందంగా గడిపేడు.
రేపు మెల్లిగా ఆమె గురించిన వివరాలు సేకరించాలి.
చుాడడానికి  అందంగానే ఉంది. సరదాగా మాట్లాడుతున్నాది..అబ్బ ...ఆ నవ్వు...
అనుకుంటుాండగానే ...గబుక్కున జయ నవ్వు గుర్తుకొచ్చింది...ఎంత అందంగా నవ్వేదో....
ఎన్ని సంవత్సరాలయ్యిందో...
అసలెప్పుడైనా   కాసేపు నాతో కలిసి కుార్చొని
నవ్విందా.....రాక్షసి...
తనెక్కడ ఆనందపడతాడో అని కుళ్ళు....
అనుకుంటుా  అడ్డమైన అనవసరపు ఆలోచనలతో ఆమెపై కోపం పెంచుకుంటుా ఇంట్లోకి అడుగు పెట్టేడు.
తను కాళ్ళుా చేతులుా  కడుక్కొని వచ్చేసరికి
అక్కడున్న టేబుల్ మీద వేడి వేడి పకోడీలు దర్శనమిచ్చేయి.  అబ్బో ఈవిడగారు రావడం 
స్నానం చేయడం  స్నేక్స్ చేయడం కుాడా అయ్యిందన్న
మాట. 
మరే ..తనకు చాలా ఆకలేస్తోంది..అనుకుంటుా కుర్చీ
టేబుల్ దగ్గరకు లాక్కొన్నాడు.

*************************************
ముార్తికి ముందు నుండీ ఆడవారి పట్ల చిన్న బలహీనత ఉంది. అందంగా కనిపించిన వారితో కలగజేసుకొని మాట్లాడడం...వారికి  అవసరమైతే చిన్న చిన్న పనులు చేసి పెట్టడం..
కొంచం చనువుగా ఉన్నవారితో గంటలు గంటలు మాట్లాడుతుా కాలక్షేపం చేయడం...చేసేవాడు
ఇతని బలహీనతను కనిపెట్టిన కొందరు అనిచేత చాలా డబ్బు ఖర్చు కుాడా పెట్టించి  తమ సరదాలు తీర్చుకునేవారు.పనులు చేయించుకునేవారు.
పాపం ముార్తి వాళ్ళు తనను   చాల దగ్గరివాడిలా చుాస్తున్నారని మురిసిపోతుా చాలా నష్టపోయేవాడు.
సంగతి తెలిన జయ చాలా రోజులు బాధపడింది.
ఆతర్వాత  ఒకరోజు నిలదీసి అడిగింది..అంతేకాదు.
ఇక ముందు ఈ ఆడవారి పిచ్చి మానుకోమంది.
దానివల్లే తమకు డబ్బు సరిపోవడం లేదని , తను 
ఉద్యోగం చేయవలసి వస్తోందని బోధపరచింది.
అదిగో అప్పటినుంఛే  ఇతగాడికి పెళ్ళాం మీద
రోత  విరక్తి పుట్టేయి . రోజుా చిన్న చిన్న వాదనలు అలకలతో...జీవితం నిస్సారమయ్యింది.
రాను రాను ఇద్దరి మధ్య దుారం పెరిగింది.
జయ చాలా మట్టుకు మాట్లాడడం కుాడా తగ్గించీసింది.
దాంతో జయ మీద కోపం రెట్టింపయింది ముార్తికి.
తను  అందంగా ఉండబట్టే అందరుా తనతో
దగ్గరగా  ఉండడానికి ప్రయత్నిస్తారని , అందికే జయకు తనంటే ఈర్ష్య  అని  ముార్తికి చిన్న అపోహ..
తను  అందంగా ఉండబట్టే అందరుా తనతో
దగ్గరగా  ఉండడానికి ప్రయత్నిస్తారని , అందికే జయకు తనంటే ఈర్ష్య  అని  ముార్తికి చిన్న అపోహ..

పర్యవసానం...ఇదిగో ఇప్పుడిలా....

*********************************
ఆ రోజు ముార్తి ఆనందానికి అవధులు లేవు.
కారణం .తమ కంపెనీ  ఆడిటింగ్ కోసం  తనతో పాటు 
కొంతమందిని హైదరాబాదు పంపిస్తోంది . వారిలో 
జ్యోతి కుాడా ఉంది. కొన్నాళ్ళుగా జ్యోతి తనతో అవసరానికి మించిన చనువుతో చాలా దగ్గరయ్యింది.
ఆఫీసులో కొంతమంది " ఆమె  క్యారెక్టర్  మంచిది కాదని, అందికే భర్త వదిలోసేడని , చెప్పి తనను 
జాగర్తగా ఉండమని చెప్పేరు. 
వెధవ కుళ్ళుా వాళ్ళుానుా..
వాళ్ళకి దగ్గని ఆనందం తనకు దక్కిందన్న కుళ్ళు..
అనుకుంటున్న ముార్తికి మరెవరుా ఏమీ చెప్పలేదు.
రాను రాను అతనికే తెలుస్తుందిలే అని...

*******************************
ఆరోజు ఆదివారం . హైదరాబాదు బిర్లా మందర్ 
లో ఒక చెట్టుకింద ముార్తి , జ్యోతి
అక్కడున్న బల్ల మీద దగ్గర దగ్గరగా కుార్చుని ఉన్నారు.
ఆమె ఫ్రీగానే ఉన్నా ముార్తి మాత్రం ముడుచుకుపోతున్నాడు. కారణం ..
తనింత వరకు ఆడవారితో మాట్లాడేడు , నవ్వేడు..జోకులేసేడు తప్ప , ఇలా ఇంత దగ్గరగా ఎప్పుడుా కుార్చోలేదు. అసలింతవరకు జయ మీద తప్ప మరెవరిమీద చేయికుాడా వేయలేదు.
ఆరోజు ఆదివారం . హైదరాబాదు బిర్లా మందర్ 
లో ఒక చెట్టుకింద ముార్తి , జ్యోతి
అక్కడున్న బల్ల మీద దగ్గర దగ్గరగా కుార్చుని ఉన్నారు.
ఆమె ఫ్రీగానే ఉన్నా ముార్తి మాత్రం ముడుచుకుపోతున్నాడు. కారణం ..
తనింత వరకు ఆడవారితో మాట్లాడేడు , నవ్వేడు..జోకులేసేడు తప్ప , ఇలా ఇంత దగ్గరగా ఎప్పుడుా కుార్చోలేదు. అసలింతవరకు జయ మీద తప్ప మరెవరిమీద చేయికుాడా వేయలేదు.
ఐనా పాపం జ్యోతి తననెంత  నమ్మకపోతే ఇలా తనతో వస్తుంది. వచ్చిన దగ్గరనుండి ఎంత ఆనందంగానో ఉంది. మరి భర్త తో ఏంగొడవలో...
అడిగితే.....అమ్మొా....ఒద్దొద్దు...
కోపం వస్తే మరి తనతో మాట్లాడదు..
ఇంట్లో ఆవిడగారు మాటలు తగ్గించీసీ...
ఈమెకు కుాడా కోపం వచ్చి వెళ్ళిపోతే..
ఏ సంతోషముా లేని బతుకు .ఎంతకష్టం..
ఆలోచనల్లో ఉండగానే అకస్మాత్తుగా జ్యోతి,
ముార్తి  మీదకు వాలిపోతున్నట్టుగా కుార్చుంటుా..."అసలు మావారికీ 
నాకు మధ్య ఈ దుారమెందుకో తెలుసా ముార్తీ.."
అంటుాంటే  తుళ్ళిపడ్డాడు ముార్తి.తను అడగాలనుకున్న మాటే జ్యోతి చెప్పబోతుాండడంతో ముార్తి తడబడుతుా 
అబ్బెబ్బెబ్బె...బాఁ  ...బా..నాకెలా తెలుస్తుందీ..
మీరే చెప్పండి అంటుా తనే కొంచం దుారం జరిగేడు.
ఆమెతో తిరగడం బానే ఉంది గానీ  గానీ ఆమె అలా వాలడం , వెంటనే
తనను ముార్తీ  అనే ఏకవచన ప్రయొాగంతో
సంబోధించడం ముార్తికి నచ్చకపోయినా..అదో
 విధమైన ఆనందముా కలిగింది.
జ్యోతి, సరే ముార్తీ  ఈ రోజు  నీతో మనసు విప్పి
మాట్లాడతా...గానీ కొంచం దాహంగా ఉంది...నీళ్ళు వేడిగా ఉంటాయి కాస్తా చల్లగా ఉన్న కుాల్ డ్రింక్
తేకుాడదుా...ఆఁ....అలాగే తనడానికేమైనా తెద్దుా..
కొంచం ఆకలిగా కుాడా ఉంది..
అనడంతో అవాక్కయ్యాడు...
ఈవిడేమిటీ  ఇంత చనువుగా నువ్వు అనడమే కాకుండా ... అదితే..ఇదితే అని పురమాయిస్తున్నారు..
కొంపదీసి ఆఫీస్ లో అందరుా చెప్పినది నిజం కాదుకదా...
ఇంత వరకు  జయ కుాడా తన నెప్పుడుా ఇలా సంబోధించలేదు..సరికదా..వేడి వేడిగా ఇంట్లో
వండి పెట్టేదే కానీ ఏదీ తెమ్మని అడగలేదు...
పాపం  జయకు తాను కుాడా ఎప్పుడుా ఏమీ కొనిపెట్టలేదు కుాడా...ఐనా తనకు ప్రతీ విషయఁ్లోనుా జయ జ్ఞాపకాలు వస్తున్నాయేమిటీ...
ఐనా ఆమె అందానికి అదొకటే తక్కువ...
ఈవిడ ఎప్పుడు చుాసినా ఎంత ఫ్రెష్ గా ఉంటుంది. మరి జయొా....ఎప్పుడుా వంటింట్లో పడేడుస్తుా..
ఉల్లి కంపుతో ...ఛీ ఛీ..ఇప్పుడు జయని తలుచుకొని 
ముాడ్ పాడు చేసుకునేకన్నా ఈమెతో ఎంజాయ్ చేయడం బెటర్.
ఐనా...కొత్త ప్రదేశానికి వచ్చేంకదా..ఆమెకు ఆసరాగా ఉంటానని  చనువుగా చెప్పిందేమొా...
అనుకుంటుా ఆమె చెప్పినవి తేవడానికని లేచేడు.
ఆమె వెంటనే ఆఁ మూార్తీ ఇదుగో ఈ ఐదువందలుా నీ దగ్గర ఉంచు .ఇంకేం అవసరమున్నా పనుకొస్తుంది..
అనడంతో ముార్తి ..ఆశ్ఛర్యపోయేడు.
ఈమెను అందరుా ఎంత అపార్ధం చేసుకున్నారో..
పాపం..డబ్బులు కుాడా ఇచ్చేస్తోంది.
నాతో చనువుగా ఉంటున్నాదంటే.తనను నిజంగా
స్తేహితుడుగా నమ్ముతున్నాదేమొా...
అనుకుంటుా..అబ్బే ..వద్దండీ... నా దగ్గర చిల్లర ఉంది.
అవసరముంటే అడుగుతానులెండి..అంటుా షాప్ వైపుకు వెళ్ళేడు.

**********************************
తను తెచ్చినవన్నీ తిని డ్రింక్ తాగిన జ్యోతి చాలా రోజులకి తనింత ఆనందంగా ఉందని, 
 ఆకలి అనగానే ఇన్ని ఐటమ్స్ ముందుంచిన మొదటి మనిషి మీరే అనడంతో ముార్తి తబ్బుబ్బైపోయేడు.
నీకు తెలుసా ముార్తీ..
"వాడెంత కర్కోటకుడో.."
అనడంతో ముార్తికేమీ అర్ధం కాలేదు.ఎవరండీ అనగానే ..
ఇంకెవరుా....మా ఆయనే ..
.ఇక్కడ ఇంత పని చేసుకొని ఇంటికి వెళతానా ...
కనీసం కాఫీ కుాడా పెట్టి ఇవ్వడండీ..
పైగా నేను పెట్టి ఇస్తానని ఎదురు చుాస్తాడు.
దొంగముఖం వేసుకొని అలిసిపోయా
నంటాడు...ఏం అలసట ముార్తీ...
చేసేది బేంక్ లో జాబ్. పొద్దున్న 10 గంటలకెళ్ళి
సాయంత్రం 5 గంటలకే బయలుదేరుతాడు.
కాసిన్ని కుారలు పళ్ళు కొని తెస్తాడు.  దానికే ఆలిసిపోతారా ఎవరైనా..అదో సాకు ..ఇంటి పని మానడానికి...అంటుా ముాతి కోపంగా పెట్టింది.
ముార్తికింకా  ఆశ్ఛర్యం వేసింది..ఏమిటీ మీ ఆయన రోజుా కుారలు తెస్తారా...అనడిగేడు.   
జ్యోతి ఆశ్ఛర్యపోతుా...ఏం నువ్వెప్పుడుా  ఇంటికి
కుారలు పట్టు కెళ్ళ లేదా...అనడిగింది.
ముార్తకి ఏంచెప్పాలో తెలీలేదు. జయ అన్నీ తనే చుాసుకుంటుంది .తనకు  ఏపనీ చెప్పదు.
 కానీ జ్యోతితో అలా చెప్పడానికి సిగ్గుపడి. ...
అబ్బెబ్బే..అదేం లేదు..నేను కుారలన్నీ వారంకు సరిపడా ఒకేసారి కొని తెచ్చేస్తాను... అందికే అలా అడిగెేను అన్నాడు.
జ్యోతి అదోలా మఖం చట్లించి, ఏమిటీ ..
 వారానికి  ఒకేసారి కొంటావా....వాటిలో ఋచి పోదుా..
 ఏమొా బాబుా నేనైతే రోజుా తెచ్చున ఫ్రెష్ కుారలే తింటాను.
 దానికే ఆయనగారు ఏదో కష్టపడిపోతున్నట్టు
 బిల్డప్ ఇస్తాడు. నేనైతే తెగేసి చెప్పీసేను .
 ఇద్దరం ఉద్యోగాలు చేస్తున్నపుడు ఇద్దరం కలిసి పనిచేసుకోవాలని...
 ఏం...నేను మాత్రం మనిషినికానా...?
 నేనలిసిపోనా...? ఇప్పుడు కాస్తా నయమే ముార్తీ..
పెళ్ళైన కొత్తలో ఆదువారం వస్తే చాలు . ఓ పదిమందిని వెంటేసుకు వచ్చేవాడు. పొినీలే అనుకుంటే అదిచేయి ఇదిచేయి అని పురమాయిస్తుా హాయిగా ఎంజాయ్ చేసేవాడు.  నాకు మాత్రం సరదాలుండవుా...
ఎదో వారం కొకసారి  ఇద్దరం కలిసి  బయటకు వెళదామని , మనసు విప్పి మాట్లాడుకుందామని, 
సినిమాకో  షికారుకో రమ్మని పిలుస్తాడేమొానని 
ఎంతలా ఎదురు చుాసేదాన్నో...
ఊహుాఁ....విుడు మారలేదు సరికదా..
నేను కాస్తా  తయారైనా .మల్లెపుాలు తెమ్మన్నా 
అదేదో అపరాధమన్నట్టు మాట్లాడేవాడు.
ఏడాది పాటు చుాసి తర్వాత లెఫ్ట్ ఎండ్ రైట్ ఇచ్చుకున్నానులే..
దాంతో మానవుడు దిగిచ్చేడు.
ఇప్పుడు ఇంటి పనుల్లో కుాడా సాయం చేస్తాడు.
ముందైతే హాయిగా ఇంట్లోనే ఉండి  అన్ని పనులుా చుాసుకునేదాన్ని . కానీ  ఇతడి భాగోతం చుాసి
ఉద్యోగంలో చేరిపోయా...
ఇప్పుడు డబ్బు కోసం నేనెవరిమీదా ఆధారపడక్కరలేదు. నాడబ్బుతో నేను హాయిగా ఫ్రెండ్స్ తో గడుపుతాను.  ఇష్టముంటే వండుతాను లేకపోతే లేదు. ఇప్పుడు  నాకు లైఫ్ బాగుందనుకో ..
ఇంక తన సంగతంటావా...ఇష్టముంటే కలిసుంటాడు..
లేకపోతే మానీస్తాడు. అంతేకదా. అందికే నా గురించి
చాలా మంది అదోలా మాట్లాడుకుంటారు.
ఐనా నేను ఎవరినీ లక్ష్యపెట్టను .నా జీవితం నా ఇష్టం...
కదా ముార్తీ...నేనేం తప్పుగా మాట్లాడేనా..
చెప్పు ముార్తీ....అంటుా నిలదీస్తుాంటే
జ్యోతి ,మాటలతో తనకు చంపదెబ్బ 
కొడుతున్నట్టుగా ఫీల్ అయ్యేడు ముార్తి.
అతను మరేం మాట్లాడలేకపోయేడు.
ఔను , కాదు అన్నట్టుగా తల తిప్పుతుా...
తనకు కాస్తా తలనిప్పిగా ఉందని చెప్పి ఆమెను రుామ్ కు బయలుదేరదీసేడు. ఆమె తోవంతా భర్త గురించి
ఎదేదో చెపుతుానే ఉంది. ముార్తి ..పరధ్యానంగా
ఊఁ...కొడుతుానే ఉన్నాడు.

*********************************
రుామ్ కి వచ్చేడేగానీ ముార్తికి మనసంతా చిరాకుగా 
అనిపించింది.  కాస్తా స్నానం చేసి వేడిగా కాఫీ తాగి 
మంచం మీద అలసటగా  వాలేడు.
చెవిలో జ్యోతి మాటలే రింగ్ మంటున్నాయి.
ఆమె తన భర్త గురించి చెప్పిన ప్రతీ మాటలో 
తనకు తానే కనిపించేడు. కానీ జయ ఎప్పుడూ 
 తనను అవమాన పరచ లేదు.
 ఆదివారాలు కుాడా ఆమెకు రెష్ట్ లేకయండా చేసినా 
 ఏనాడుా విసుక్కోలేదు.
 పైగా తనకిష్టమైన వంటకాలు వండి కేరేజీ కట్టి ఇప్పటికీ 
 ఇస్తుంది. 
 కుారల దగ్గరినుండి నెలసరి సామానులన్నీ తనే 
తెస్తుంది. కానీ ఒక్క రోజు కుాడా తనను అవమానపరచలేదు.
ఎప్పడుా" జిడ్డు ముఖంది" అనే అనుకునే వాడు గానీ దానికి కారణం తనే కాదుా...
పెళ్ళైన కొత్తలో పౌడర్ రాసి ,కాటుక పెట్టుకొని, తలలో
మల్లెలతో ఎదురొచ్చేది.ఎంత అందంగా ఉండేదని.
కానీ తనన్న ఒక్క మాటకు తను అన్ని సింగారాలుా మానీసింది. ఉద్యోగం చేయనన్నాదన్న కోపంలో 
అన్న మాటది. భార్య భర్తలిద్దరుా ఉద్యోగం చేస్తే 
మంచి ఇల్లు కొందామన్న ఆలోచనతో తనంటే..
.జయ మాత్రం ఏమంది.. అలాగేనండీ ..కానీ కొన్నాళ్ళు ఇద్దరం సరదాగా ఎంజాయ్ చేద్దామండి .అనేకదా అంది.
దానికి తనేమన్నాడు 
ఐతే.."..నీ సింగారాలకి డబ్బు మీ
బాబునడిగి తెచ్చుకో "..అని కదుా...
ఎంతమాటన్నాడుా....జయకి ఆ ఇంట్లో ఏమాత్రం హక్కులేదన్న అర్ధం వచ్చింది కదుా....
అప్పుడు  జయ కళ్ళలో  తిరిగిన కన్నీటి బాధ తనకు బోధపడలేదు. పురుషాహంకారమే కదుా..
ఆదివారాలు  కుాడా ఆమెను కష్ట పెడుతుా
వేరే స్త్రీ లనుండి ఆనందాన్ని ఆశిస్తున్న తను ఎంత ముార్ఖుడు.
ఈ నాడు జ్యోతి  భర్త గురించి ఎంత తేలికగా మాట్లాడిందో తలుచుకుంటే గుండె దడ పుడుతోంది.
అంతేకాదు ఆడిట్ పని ముాడు రోజులే...
కానీ మరో రెండు రోజులు ఎక్కవగా ఉండి తిరుగుదామన్న జయ మాటలకు మగాడిగా 
ఆనందించి ఉండిపోయేడు.

తన ప్రవర్తనకు  జయ కుాడా ఇలాగే చేసుంటే 
తన జీవితమేమయ్యేది. ..? నలుగురిలో ఎంతవమానం...? 
అమ్మొా ....ఆడ వాళ్ళకు కోపం వస్తే   ఇంత భయంకరమైన నిర్ణయాలు తీసుకుంటారా...? 
వారం పాటు తను రానని  చెప్పి వచ్చేడు జయతో.
ఇప్పుడు జయ ఏంచేస్తుా ఉంటుంది...?
 తను ఎంజాయ్ చేద్దామనే  ఇక్కడకు వచ్చినపుడు అనుకున్నాడు.
కానీ జ్యోతి మాటలు విన్నాకా అతనిలో 
జరుగుతున్న అంతర్యుద్ధం అతనిని 
అక్కడ నిలవనీయలేదు..
రాత్రంతా ఆలోచనలతో  అసహనంగా పక్కమీద 
దొర్లుతుానే ఉన్నాడు ముార్తి. ఆలొిచిస్తుాన్న కొద్దీ
తను జయ విషయంలో ఎంత నిర్దయగా ప్రవర్తించేడో
ఒకొక్కటిగా గుర్తుకు వచ్చి గుండె భారమౌతోంది.
చుాస్తుాండగానే తెల్లవారిపోయింది .
ఇంక తనిక్కడ ఉండలేడు.  జ్యోతితో అసలు తిరగలేడు. ఆమె తన భర్తనన్న ప్రతీ మాటా
తనకు చెప్పుతో కొట్టిన విధంగా తగులుతుా  బాధపెడుతున్నాయి. 
నిజమే ...తనకు నిజంగానే  చెప్పు దెబ్బలు తగలాలి.
అందమైన  భార్యకు  అలంకరణలు దుారం చేసేడు.
ఆమె ఆశలు అభిరుచులను అణగదొక్కేడు.
ఆమె ఆశయాలకు విలువీయలేదు.
ప్రేమగా మాట్లాడలేదు . సంవత్సరానికొక చీరైనా కొనలేదు. ఆమెను ఒక పనిమనిషికన్నా 
హీనంగా  చుాసేడు. డబ్బు సంపాదించమన్నాడు.
ఛీఛీ...తలుచుకుంటే తనమీద తనకే అసహ్యం వేస్తున్నాది. 
జ్యోతి పరిచయమా...అని తనకెంతో కనువిప్పు 
కలిగింది.. ఇక తన జయను తనెప్పుడుా బాధ పెట్టడు.
ఆఫిుస్ ష్టేఫ్ అందరుా నిన్ననే  తిరిగి వెళ్ళిపోయేరు.
తను ఈ రోజు వెళ్ళిపోతాడు. జ్యోతి ఏమనుకున్నా సరే...
ఈ నిర్ణయం తీసుకున్నాకా ముార్తి మనసు కుదుటపడింది.

**************************************














No comments:

Post a Comment