[1/6, 14:15] iswarimurthy: నమస్కారమండీ...
శ్రీ గిడుగు రామ ముార్తి పంతులు గారి పై కవిత పంపుతున్నాను. గమనించ గలరు.
పాఠ్యాంశ' , గ్రంధ,కావ్యాల భాష.
అక్షరాశ్యులకు కుాడా అర్ధమవని గ్రాంధిక ప్రాస
నిరక్షరాశ్యులకు కుాడా అర్ధమవ్వాలన్న ధ్యాస
నిత్య వాడుక భాషగా మార్చాలన్న ఆత్మ ఘోష॥
పర్యవసానం పుస్తక వనంలో వీర విహారం
తుమ్మెద గ్రోలిన మధువు రీతి ,
నిత్య సాహిత్య రస పానం ,.
సాధించిన "వ్యవహారిక భాషా సుగంధ" ఫల సారం॥
తోటి సహాధ్యాయుల సమిష్టి సహకారంతో ..
భాషోద్యమాకారుని క్రుషి , వేసిన సోపానం.
నేడు యావత్ భారత దేశం చేస్తున్న--
తెలుగు వెలుగుల" సరళభాషా" వీర విహారం.॥
అందరికీ అందుబాటులోకి వచ్చిన ఆనంద సౌరభం
" తెలుగుభాషాదినోత్సవ" మనే సాహిత్య సంబరం.
అతని జన్మదినదినాన -
అద్భుతంగా జరిగే ఆనందోత్సవం. ॥
(29 ఆగష్ట్ నాడు." తెలుగు భాషా దినోత్సవం ).
కైజర్ - ఇ- హింద్ అనే గౌరవ స్వర్ణ సుాత్రం తో
నిండిన పురస్కార సుమ-సౌరభాల తోరణం.
డాక్టరేట్, కళాప్రపుార్ణ వంటి ఎన్నో బిరుదు-
సుమాల సమాహార సమ్మేళనం.॥
పట్టు వదలని విక్రమార్కుని రీతి
పట్టుదల తో సాధించిన ఘన కీర్తి.
తెలుగుభాషా ఉద్యమొాద్యుతి స్ఫుార్తి
అతడే శ్రీ గిడుగు రామ్ముార్తి.॥
----------------------------------------
రచన, శ్రీమతి-
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్
8097622021.
[1/6, 14:54] గిడుగు రామ ముార్తి ఫౌండేషన్: చాలా బాగుంది మేడం మీ కవిత. 💐👌👍
[1/6, 15:05] గిడుగు రామ ముార్తి ఫౌండేషన్: నాకు కూడా చాలా ఆనందం. మీ రచనలు ఏవైనా మా భువన విజయం సాహిత్య మాస పత్రికకు పంపండి. నేనే ఈ పత్రిక ఎడిటర్. ఇదే వాట్స్ అప్ నుంబర్ కి.. నమస్సులు. శుభం. శుభాకాంక్షలు. 💐
[1/6, 15:34] iswarimurthy: "శ్రీ గిడుగు రామ ముార్తి పంతులు " గారి పై రాసిన ఈ కవిత నా స్వీయ రచనేననీ , దేనికీ అనువాదము కాదని , ఇందు ముాలముగా తెలియజేయుచున్నాను.
ఇట్లు ,
శ్రీమతి జగదీశ్వరీముార్తి. ...
[1/6, 15:55] iswarimurthy: జీవితం .
-------------------------------
(భువన విజం పత్రిక కొోసం పంపిన కవిత.)
జిీవితం.
--------*
జీవితమే నడి సంద్రపు నావ
తెలియని బ్రతుకొడిదుడుకుల త్రోవ
అలల ఒరవడికి మునుగునో తేలునో
ఎవరిని అడిగేది ? ఏమని అడిగేది..?॥
గడచిన జీవిత పుటలు తెరవగా
జ్ఞాపకాలె దొంతరలై కదిలే
వెదకిచుాడ వెతలెన్నో కలచె
మదిలో గుస గుస వ్యధ కలిగించె..॥
ఎవరిని ఎన్నని ఏమిటి లాభం
గడచిన జీవితమే ఒక శాపం
ఒంటరినై నే నిలచిన క్షణం
మనసే నాతో మాట్లాడు నేస్తం..॥
భువిలో ఎన్నో అక్షర మాలలు
ఉచ్ఛ..నీచ , ఆచారపు దాడులు
జాతి -మతముల జాడ్యపు మరకలు
తెరవని తలపుల అడ్డుగోడలు...
జీవిత దశలో ఆఖరి పిలుపుకు
అన్నీ వీడి , తెరవాలి తలుపులు
చాలించెడి ఈ తనువు పాత్రతో
రాదేదీ నీ వెనుక యాత్రలో..
ఒంటరినై నెే నిలచిన క్షణం నా
మనసే నాతో మాట్లాడు నేస్తం...॥
------------------------------------------
ఈ కవిత నా స్వీయ రచన.
దేనికీ అనువాదము కాదు అని తెలియచేయడమైనది.
-------------------------------
-రచన ,శ్రీమతి,
పుల్లాభట్ల- జగదీశ్వరీముార్తి..
కల్యాణ్.
-------------------------------------------------------------
- P.S. Murthy ...101,
Vighnahar Sankul ,
Birla collage Road.,
Bhoir wadi.
KALYAN ( west ).
8097622021.
----------------------.
No comments:
Post a Comment