కేవలం ఇతర రాష్ట్రాలలో ఉన్న రచయిత్రులందరికి శ్రీలక్ష్మి గారు ఒక మహా అవకాశం మన సమూహానికి కల్పించారు. మన మధ్యలో తురగ జయశ్యామల, తుర్లపాటి రాజేశ్వరి, రేణుక బుదారం వంటి రచయిత్రులు ఉన్నందున విత్తన సదస్సుకు రాకున్నా కూడా మనమంతా రాబోయే సంకలనానికి కథలు కవితలు రాయవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాలలో కేవలం సదస్సుకు హాజరైనవారు మాత్రమే రాయాలి.....కానీ మన సమూహానికి మాత్రమే వెనులబాటు కల్పించి అందరిని ప్రోత్సహిస్తున్నారు.
* కథ, కవితల నిడవి కనుక్కుంటాను
* చివరి తేదీ కూడా తెలియజేస్తాను.
ఈ రాత్రి వరకు మాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ పుస్తక రూపంలో ఉంది. అది కూడా ఇక్కడ పోస్ట్ చేస్తాను.
* సదస్సు కి రాని వారికి అవగాహన ఉంటుంది.
* మీరు ఇక కలం చేత బూని సమాయత్తమవ్వండి.
* అయితే మన కవితలు కథలు మనలో సీనియర్ రచయిత్రులు ముందు పరిశీలిస్తారు....వారి నుండి మనం సూచనలు తీసుకొని మన రచనలను ఇంకా బాగా రాద్దాము, ఎడిట్ చేసుకుందాము. ఆ తరువాతనే మనం అక్షరాయాన్ కు పంపుదాము. వారికి సౌకర్యంగా ఉంటుంది.
దయ చేసి ఇది మళ్లీ ఇంకో గ్రూప్ లో పోస్ట్ చేయకండి. చర్చించకండి. కేవలం మీ రచనపైన దృష్టి పెట్టండి. లేని పోనీ గొడవలు వద్దు కదా. ధన్యవాదాలు.
No comments:
Post a Comment