మందార మల్లియల సుమ మాల లర్పింప
బ్రృందావనా ఘనా వేళాయె రారా...
మంజీర మ్రృదు పద కేళీ విలోలా
రస హ్రృదయానంద మురళీ మనోహర ।।
విందులు చేయగ నీ మురళి రాగాలు
కోయిలలు పాడేను రసరమ్య గీతాలు
గోబాల గోపికల హ్రృదయారవిందాల
విరిసేను అనురాగ మ్రృదు మధుర భావాలు..।॥
వెన్నచిలికే వేళ వేడుకిది చాలించి..
కన్న మరలీ రార ..కరుణ నను కావగ ।
మన్ననల సుమ మాలలను దాల్చి పోరా
చిన్ని కోరిక నాది చవి దీర్చి బ్రోవరా..॥
కోటి దివ్వెల కాంతి నీ నగు మొామురా
మేటి గంధపు పరిమళపు దేహ మీదిర।
కుాడు సతులను వీడి కొంచమిటు చుాడరా
పాడి కాదుర కన్న కన్నడింపక రార..॥
-----------------------------------------------------
రచన...శ్రీమతి...పుల్లాభట్ల
జగదీశ్వరీముార్తి.
No comments:
Post a Comment