మారుతున్న కాలం
ఒక అడుగు ముందుకు వేసింది ॥
నశించిన మానవత్వం
మంచితనం ముసుగులో
మందుగుండు నింపుతుా
మారణహోమం చేస్తున్నాది ॥
వుారిలోని పుారిగుడిసెలు..
పెంకుటిల్లై....తర్వాత
మేడలుగామారి , అగ్గిపెట్టె
గదులుగా అలంకరంచబడి
అంధకార అరాచకాలకి
బందీ అయిపోయాయి..।॥
కాలం మరో అడుగు ముందుకొచ్చింది.॥
పచ్చని పొలాలు
పచ్చనోట్లకి
అమ్ముడుపోయాయి ॥
రైతుల అత్మహత్యల
ఆక్రోశాలు ,వెంచర్ల
ప్లాట్లుగా మారి
వేలం పాటలతో
వేరు పడ్డాయి ॥
టెక్నాలజీల జోరుతో
హోరెత్తిన యంత్రాలు ,
మంత్రాలు వేసి
చుాపిస్తున్న
అసహ్యకర , అశ్లీల
నగ్న చిత్రాల ఆకర్షణీయత ,...
సాంప్రదాయ పరదాలకు
చిల్లులు వేస్తున్నాది ॥
ఆడతనానికి, మగతనానికి
మధ్య ఉన్న సంస్కారం..
అర్ధరాత్రి రోడ్డునపడి
అర్ధనగ్న నాట్యం చేస్తొింది..॥
విన్యాసాల విరుపులకి
వీర్యం , వీరవిహారం చేస్తుా
ప్రాయంతో పనిలేకుండా
తన ప్రతాపం చుాపిస్తొింది..॥
కాలం ...మరో అడుగు ముందుకు జరిగింది ..
..
న్యాయస్థాన
నిర్లజ్జ తీర్పులకి
నీతి , నియమాలు
తల వంచాయి... ॥
వివాహ బంధాలు
విచ్చలవిడి తనానికి
పట్టం కట్టి...విడాకుల
విసుర్లతో వీరవిహారం
చేస్తున్నాయి.॥
కాలం మరో అడుగు ముందుకు జరిగింది॥
మత్తెక్కిన క్రౌర్యానికి ,
మగువల మానాలు-
రక్తపుధారలు శ్రవిస్తుా
రసికుల దాహాన్ని
తీరుస్తున్నాయి॥
అవివాహపు అబార్షన్లతో
ఆడతనం .,.అమ్మతనాన్ని ,
పణంగాపెట్టి , పసి ప్రాణాలతో
పాచికలాడుకుంటున్నాది. ॥
సాంప్రదాయాల సంస్కారం
చాటు దాగిన , శీల సంపద,
ఏసిడ్ దాడులతో , రంగుమారి
ఏహ్యమైన కంపుతో
ఎక్కిళ్ళు పడుతోంది..॥
అధ్యాపకుల ఆదర్శ బోధలు,
విద్యార్ధుల విచ్చలవిడి తనపు
అపహాస్య - అవమానాలకి,
తర్పణాలు సమర్పిస్తున్నాయి..॥
రోజుకుా పెరిగే ....
రోదనలు ,రోగాలు ,
మానభంగాలు .,ప్రాణల పణాలు,
ఏసిడ్ దాడులు,...ఏలుబడుల
అధికారపు అణచివేతలు..॥
నిరాశా-నిస్ప్రుహలతో
నీరుకారిన నిస్త్రాణ
నిట్టుార్పులు ,
అబలల ఆర్తనాదాల
కన్నీటి సునామీలు...॥
అసహాయుల శక్తిహీనపు
శోక- సంతాపాల ,మధ్య
దోచుకోబడ్డ , వేల
కర్కోటపు వేలిముద్రల
మాగాణీలు , మాన్యలు ॥
ఇంకా...అరాచకాలు...
పెరగకముందే....
కాలం మరో అడుగు
ముందుకు వేయకముందే.......
కళ్లు తెరిచిన కవితాలోకం
కాలం క్రుారత్వానికి
అక్షర యజ్ఞంతో ఆనకట్ట
కట్టాలనే నిర్ణయాన్ని
కలిసి తీసుకుంది..॥
కలం గళంతో తమ
నిరసన నిర్ణయాలని
తెలిపేందుకు పునాది వేసీ
మంచె సిధ్ధం చేసింది..॥
కలం అనే కత్తి తో
అక్షరాల పై
అవిరామంగా దాడి చేసి ,
కలుషితాల్ని ఖననం
చేయగలిగే కవితా శక్తికి ..',..
కాళ్ళు కడిగి ...
కంకణ ధారణ
చేయాలనే సంకల్పానికి
శ్రీకారం చుట్టింది. ॥
అక్షర యజ్ఞంలో తమవంతు
హవిస్సును , ఆనందంగా అర్పించి
కాలం చేసిన గాయాలకు కాస్త
ఉపశమనం కలిగించండి.॥
రండి రండి...
పదండి ముందుకు
పదండి తోసుకు....
పోదాం ...పోదాం..
మున్ముందుకి.....
త్వమేవ శరణం
శరణం త్వమేవ...
రచయిత్రి
శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.
No comments:
Post a Comment