మరో అడుగు.
కాలం కరిగిపోతోంది.
పాశ్చత్వపు పోకడలతో
తెలుగుతనం తెలతెలపోతోంది.
గత వైభోగపు మెరుపుల్లో
అష్టదిగ్గజాల విరుపుల్లో
ప్రబంధ కవుల తలపుల్లో
ఆణిముత్యమై ప్రతఫలించిన
మన తెలుగు మసిబారిపోయింది.
కానీ ఇదిగో మళ్ళీ ఇన్నాళ్ళకు
ప్రవాసాంధృల "మరో అడుగు"
తెలుగు ప్రేమికుల కళ్ళల్లో వెలుగు.
మన ఆంధ్రులకు అలుసైపోయిన
తెలుగు భాషకి అందాలు అద్ది
రచనా వ్యాసంగాల అలరింపులతో..
కవితా పరిమళాల పలకరింపుతో
ప్రవాసాంధృల "మరో అడుగు" .
.పూణే తెలుగు సాహితీ పీఠం ,
మహారాష్ట్ర తెలుగు రచయితల సమూహం,
తెలుగుని బ్రతికికంచడానికి
నడుం కట్టి వేస్తున్న " మరో అడుగు".
భావుకుల అక్షరసరాల సమాగమనం.
పరాయి రాష్ట్రంలో తెలుగు సౌరంభం
మరో మహా ప్రస్థానానికి ఇది ఆరంభం.
తెలుగు వెలుగు తెేజాలకి ఆక్షరాభ్యాసం
పదండి ముందుకు పదండి త్రోసుకు...
ఈ మహా సాహిత్య యజ్ఞానికి సమిధలమై
పోదాం పోదాం పూణేకి....
రచన .
ప.వి. రమణముార్తి.
మైసుార్.
No comments:
Post a Comment