Tuesday, March 10, 2020

మెరుపులు

——————————
కవితలకు ఆహ్వానము
——————————

సాహిత్యంలో నూతన ప్రక్రియ ఐన " మెరుపులు " సంకలనానికి కవితలు కోరబడుచున్నవి.ఒక అంశం పై గాని లేదా వేరువేరు సామాజిక అంశాలపైన ఒక్కొక్కరు పది మెరుపులను నా వాట్సాప్ నెంబర్ 9959180762 
———————— కు 20/03/2020 వరకు పంపగలరు. సంకలనానికి పంపే మెరుపులను వేరే గ్రూపులలో పెట్టకూడదు. పేపర్లలో ప్రచురించకూడదు.

*******************
మెరుపులు నియమాలు
*******************
1) ఇందులో నాలుగు పాదాలుండాలి 

2) 1,3—2,4 పాదాలలో అంత్యప్రాస ఉండాలి

3) మొదటి పాదంలోని మొదటిపదం, రెండవ పాదంలోని మొదటి పదం జంటపదాలు కావచ్చు, కాకపోవచ్చు.

4) 1,2 పాదాలలో ఒక విషయాన్ని, 3,4 పాదాలలో ఒకవిషయాన్ని తెలియజేయవచ్చు.( లేదా ) నాలుగు పాదాలు ఒకే విషయాన్ని  తెలియజేయవచ్చు.

5) 1,3 పాదాలలో రెండు పదాలుండాలి.2,4 లలో సందర్భాన్ని బట్ట ఒక పదం రావచ్చు.

6) ఆలోచింపజేసే విషయాలు, జ్ఞానాత్మక విషయాలు, అనుభవాలు గుర్తుచేసే విషయాలు ఉండాలి.
7) ఛందస్సుతో సంబంధం లేదు.

ఉదా||
————
కడవ నీటిలో
పడవ నడువదు
కంటి నీటిలో
కల్మష ముండదు !! 1 !!

ఆలిలేని ఇంట్లో
జాలి వుంటుందా
మనసులేని ఒంట్లో
మంచి బతుకుతుందా !! 2 !!

అహం విడచిన
స్నేహం దక్కు
మందు మరచిన
మర్యాద దక్కు !! 3 !!

బంధాన్ని తెంచుటకు
భార్య రాయికాదు
బంధించి వుంచుటకు
ఆమె పక్షికాదు !! 4 !!

రవి మండితే
అగ్ని గుండం
రాజు మండితే
జనులకు గండం !! 5 !!


మెరుపులు సృష్టికర్త
——————————
తాండ్ర చిరంజీవి
సెల్ : 9959180762.

No comments:

Post a Comment